Independence Day 2022: హర్ ఘర్ తిరంగ కార్యక్రమానికి దేశ పౌరుల నుంచి భారీ స్పందన వచ్చింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపుపై ప్రజలు విశేషంగా స్పందించారు. ఇంటింటా జాతీయ పతాకాలు ఎగుర వేశారు. దాంతో పాటు జాతీయ జెండాతో సెల్ఫీలు దిగి హర్ ఘర్ తిరంగ వెబ్ సైట్ లో అప్ లోడ్ చేయాలన్న దానిపై ప్రజలు భారీగా స్పందించారు. 5 కోట్ల మందికి పైగా త్రివర్ణ పతకంతో సెల్ఫీ దిగి వెబ్ సైట్ లో అప్ లోడ్ చేశారు. 


ఇదో అద్భుత విజయం..


జాతీయ పతాకంతో సెల్ఫీలు దిగి వెబ్ సైట్ లో అప్ లోడ్ చేయడాన్ని కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ అద్భుతమైన విజయంగా పేర్కొంది. ఈ రికార్డును సోషల్ మీడియా ద్వారా పంచుకుంది. ఈ విజయం భారత దేశ ఐక్యత మరియు ప్రజల భాగస్వామ్యానికి నిదర్శనం అని సాంస్కృతిక శాఖ పేర్కొంది. 22 జులై నాడు, తమ ఇళ్ల వద్ద త్రివర్ణ పతాకాన్ని ఎగుర వేయడం ద్వారా 'హర్ ఘర్ తిరంగా' ఉద్యమంలో పాల్గొనాలని ప్రధాన మంత్రి దేశానికి స్పష్టమైన పిలుపును ఇవ్వడంతో ఇదంతా ప్రారంభమైంది. ప్రచారాన్ని ఒక అడుగు ముందుకు వేస్తూ, సాంస్కృతిక మంత్రిత్వ శాఖ, ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ నోడల్ ఏజెన్సీ, ప్రజలు తమ జెండాతో సెల్ఫీలు తీసుకుని ప్రచార వెబ్‌సైట్ www.harghartirang.comలో అప్‌లోడ్ చేయాలని విజ్ఞప్తి చేశారు. ఒక అద్భుతమైన విజయంలో, ఐదు కోట్లకు పైగా 'తిరంగా' సెల్ఫీలు 'హర్ ఘర్ తిరంగా' వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయబడ్డాయి" అని మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ర్యాలీలు, సాంస్కృతిక ప్రదర్శనల నుండి మానవ నిర్మాణాల వరకు, జాతీయ పండుగను దేశవ్యాప్తంగా అనేక రకాలుగా స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకుంటారు.


వారికి కేంద్రం కృతజ్ఞతలు..


ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌ లో భాగంగా సోమవారం ఉదయం ఎర్రకోటలో వేడుకలు ఘనంగా జరిగాయి. జెండా ఎగురవేసిన అనంతరం ప్రధాని నరేంద్ర మోదీ రాబోయే 25 ఏళ్లకు సంబంధించిన రోడ్ ‌మ్యాప్‌ను పంచుకున్నారు. ఈ ముఖ్యమైన సమయాన్ని అమృత్ సమయంగా అభివర్ణించారు ప్రధాన మంత్రి. భారత దేశం తన 76వ స్వాతంత్ర్య సంవత్సరాన్ని ప్రారంభించింది. ఆగస్ట్ 15, 2022 వరకు 75 వారాల కౌంట్‌ డౌన్‌ ను ముగించింది. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కోసం నోడల్ మంత్రిత్వ శాఖ ద్వారా నడిచే ప్రభుత్వం యొక్క 'హర్ ఘర్ తిరంగ' కార్యక్రమాన్ని చేపట్టింది. నిన్న పంద్రాగస్టు నాడు సాయంత్రం 4 గంటల ప్రాంతంలో ఐదు కోట్ల తిరంగా సెల్ఫీల చారిత్రక ఘనత సాధించినట్లు కేంద్ర తన ప్రకటనలో వెల్లడించింది. ప్రచారంలో పాల్గొన్న వారి పట్ల సాంస్కృతిక మంత్రిత్వ శాఖ కృతజ్ఞతలు తెలిపింది.


2023 వరకు వేడుకలు..


75 సంవత్సరాల స్వాతంత్ర్య వేడుకలు 12 మార్చి 2021న 75 వారాల కౌంట్‌డౌన్‌గా 15 ఆగస్టు 2022కి ప్రారంభమయ్యాయి. ఈ వేడుక 15 ఆగస్టు 2023 వరకు కొనసాగుతుంది. త్రివర్ణ పతాకంతో వ్యక్తి గత సంబంధాన్ని ఏర్పరచుకునే లక్ష్యంతో ఈ కార్యక్రమం ప్రారంభమైంది. అందుకే ఇప్పటి నుండి 2047 వరకు అమృత్ కాలంగా ప్రధానమంత్రి అభివర్ణించారు. 25 సంవత్సరాలలో దేశ అభివృద్ధికి సహకరించాలనే సంకల్పంలో భాగంగా ప్రజలు తమ ఇంటి వద్ద లేదా పని చేసే ప్రదేశంలో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయాలని కోరారు.