Powerless AC :  ఎండా కాలంలో వేడి, ఉక్కపోత నుండి తప్పించుకోవడానికి ఎలాగోలా ఏసీ కొన్నా దాన్నిఆన్ చేయాలంటే మాత్రం మధ్య తరగతి జనానికి గుండె దడ. ఎందుకంటే కరెంట్ బిల్లు అప్పుల్ని పెంచేస్తుందని ఆందోళన. అందుకే ఏసీని.. కరెంట్ మీటర్‌ని పరిశీలిస్తూ వినియోగిస్తూ ఉంటారు. అందుకే కంపెనీలు కరెంట్ ను తక్కువగా వినియోగించుకునే ఏసీల పేరుతో కొత్త కొత్త ఉత్పత్తుల్ని అమ్ముతూ ఉంటారు. అయితే ఇలాంటి వారందరికీ ఇప్పుడు చెక్ పడినట్లే. ఎందుకంటే కరెంట్ అవసరం లేని ఏసీలు త్వరలోనే రాబోతున్నాయి.


నుపుర్ శర్మపై సుప్రీం వ్యాఖ్యలు దురదృష్టకరం- విశ్రాంత న్యాయమూర్తుల బహిరంగ లేఖ


గౌహతి  ఐఐటి శాస్త్రవేత్తలు కరెంట్ అవసరం లేని ఏసీ పద్దతిని కనుగొన్నారు. దాని పేరు 'పాసివ్‌ రేడియేటివ్‌ కూలింగ్‌'. ఇది కూడా ఏసీ లాంటి పరికరమే. కానీ కరెంట్ అవసరం లేదు.   ఈ పాసివ్‌ రేడియేటివ్‌ కూలింగ్‌ విధానం ద్వారా.. సమీప ప్రాంతాల నుంచి వేడిని గ్రహించి, దాన్ని మరలా  రేడియోధార్మికత రూపంలో వాతావరణంలోకి విడుదల చేస్తాయి.  ఈ పాసివ్‌ రేడియేటివ్‌ కూలర్లు రాత్రివేళ మాత్రమే పనిచేస్తాయి. పగటి సమయంలో పనిచేయవు. మరి ఇవి పగటి సమయంలో కూడా ఉపయోగపడాలంటే.. ఈ కూలర్లు సౌర రేడియోధార్మికత మొత్తాన్నీ పరావర్తనం చెందించాలి. అయితే ఇప్పటివరకూ అభివద్ధి చేసినవి మాత్రం.. పగటి సమయంలో సరిపడా చల్లదనం అందించలేకపోతున్నాయని గౌహతి ఐఐటీ పరిశోధకులు ప్రకటించారు. 


మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్‌కు జెరాక్స్ కాపీలా ఉన్న ఈ వ్యక్తి ఎవరో తెలుసా?


సిలికాన్‌ డైఆక్సైడ్‌, అల్యుమినియం నైట్రైడ్‌లతో పలుచటి పొరలను ఉపయోగించి పాసివ్‌ రేడియేటివ్‌ కూలింగ్‌' ను అభివృద్ధి చేసారు.  ఈ పొరలు సౌర, వాతావరణ రేడియోధార్మికతను 97 శాతం పరావర్తనం చెందించాయని శాస్త్రవేత్తలుప్రకటించారు.  దీన్ని పైకప్పు పూతగా వాడటం వల్ల ఇంట్లో ఉష్ణోగ్రతలు.. వెలుపలి కన్నా 15 డిగ్రీల సెల్సియస్‌ వరకు తగ్గుతాయని పేర్కొన్నారు. పగటి సమయంలో పనిచేసే పాసివ్‌ రేడియేటివ్‌ కూలింగ్‌ వ్యవస్థను అభివృద్ధి చేయడం చాలా కష్టం. అయినా వారి పరిజ్ఞానంతో సాధ్యమైందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. 


ఆ 20 మందిపై కేసులు పెట్టండి - టీడీపీ సోషల్ మీడియా కార్యకర్తలపై విజయసాయి ఫిర్యాదు!


వేసవి కాలంలో విద్యుత్ డిమాండ్ పెరిగిపోవడానికి కూడా ఏసీలో కారణం .  ఇప్పుడు పాసివ్‌ రేడియేటివ్‌ కూలింగ్‌' ఏసీలు పూర్తి స్థాయిలో అభివృద్ధి పరిచి వాణిజ్య పరంగా ఉత్పత్తి ప్రారంభిస్తే ఓ సంచలనమే అవుతుంది. పర్యావరణ పరంగా కూడా మేలు చేస్తుంది. కరెంట్ వినియోగం తగ్గుతుంది. ఎంతో మందికి వేసవిలో వేడి నుంచి రక్షణ లభిస్తుంది.