Vijayasai Complaint On TDP Social Media :    తెలుగుదేశం పార్టీకి చెందిన సోషల్ మీడియా కార్యకర్తలు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో పాటు తనపైనా తప్పుడు ప్రచారం చేస్తున్నారని వైఎస్ఆర్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఏపీ సీఐడీ, సీఎంవో అధికారులకు ఫిర్యాదు చేశారు. తప్పుడు వీడియోలు, గ్రాఫిక్స్ ఫోటోలు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినట్లు గుర్తించామని వారిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో కోరారు. మొత్తంగా ఫిర్యాదు జాబితాలో ఇరవై మంది పేర్లను చేర్చారు. వీరంతా ట్విట్టర్, ఫేస్‌బుక్ వంటి సోషల్ మీడియాల్లో యాక్టివ్‌గా ఉంటూ తెలుగుదేశం పార్టీ తరపున పోస్టులు పెడుతున్నారని తెలిపారు. విజయసాయిరెడ్డి ఫిర్యాదు చేసిన వారి పేర్లు   

1.అనిత (విశాఖపట్నం)2.మాలతి రెడ్డి ( విజయవాడ)3.హర్షిత (హైదరాబాద్)4.కిరణ్ కుమార్ కింతలి 5.జెట్టి రేణుక (తెనాలి)6.బాలనదం (విజయవాడ)7.కొల్లి విజయ్ (రాజమండ్రి)8.వేమూరి అశ్వినీ (ఒంగోలు)9.బెల్లంకొండ సురేష్ (గుంటూరు)10.షైక్ తజుద్దీన్ (విజయవాడ)11.పవన్ కుమార్ (హిoదుపురం)12.మురళీకృష్ణా (నెల్లూరు)13.అoజీ చౌదరి (భద్రాచలం)14.సత్యం రెడ్డి (నెల్లూరు)15.సందీప్ కుమార్ (విశాఖ)16.బసి రమణ రెడ్డి (కాకినాడ)17.అడపా నరేష్ (విశాఖ)18.శ్రావణ్ కుమార్ నాయుడు (కుప్పం )19.షైక్ మీరా మోహిదీన్ (నెల్లూరు)20.వెంకట్ రెడ్డి (కడప) వీరందరితో పాటు కొన్ని యూ ట్యూబ్ చానల్స్‌పై కూడా విజయసాయిరెడ్డి ఫిర్యాదు చేశారు. ఆ యూట్యూబ్ చానల్స్ నిర్వాహకులు తప్పుడు ఫ్రచారం చేస్తున్నారని ఆరోపించారు. విజయసాయిరెడ్డి ఫిర్యాదుపై ఏపీ సీఐడీ , సీఎంవో ఎలాంటి చర్యలు తీసుకుంటోందో తెలియాల్సి ఉంది.  

ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి గెలుస్తారన్న ధీమాతోనే యశ్వంత్‌కు టీఆర్‌ఎస్ మద్దతు: రేవంత్

ఇటీవల తెలుగుదేశం పార్టీకి చెందిన ఇద్దరు సోషల్ మీడియా యాక్టివిస్ట్‌లను పోలీసులు అర్థరాత్రి ఇంటి తలుపులు పగులగొట్టి అరెస్ట్ చేయడం .. తర్వాత వారిని కొట్టినట్లుగా ఆరోపణలు రావడం సంచలనాత్మకం అయింది. పోలీసుల తీరుపై టీడీపీ అధినేత చంద్రబాబు కూడా మండిపడ్డారు. నిబంధనలను అతిక్రమిస్తున్న వారిని వదిలి పెట్టేది లేదని హెచ్చరిస్తున్నారు.

పరిటాల రవి తరహాలో హత్యకు కుట్ర - సైబరాబాద్ సీపీ సహకరిస్తున్నారని రఘురామ సంచలన ఆరోపణలు !

అయితే ట్విట్టర్‌లో విజయసాయిరెడ్డి కన్నా దారుణమైన భాషను ఎవరూ వాడరని టీడీపీ సోషల్ మీడియా కార్యకర్తలు అంటున్నారు. ఆయన ట్విట్టర్ ఖాతా నిండా చంద్రబాబు, రఘురామ రాజు సహా పలువురు విపక్ష నేతల ఫోటోలను మార్ఫింగ్ చేసిన  ఫోటోలు ఉంటాయని.. దారుణమైన భాషతో కుటుంబసభ్యుల్నీ వదలకుండా తిట్టిన తిట్లు ఉంటాయని ఏమైనా కేసులు పెడితే ముందుగా విజయసాయిరెడ్డిపై పెట్టాలని ఆయన చేసిన కొన్ని పోస్టులను ఉదహరిస్తున్నారు.