హర్యానా ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. ఎంచక్కా పని చేస్తూనే ఆఫీసుల్లో మందు తాగచ్చొని ఫ్రీడం ఇచ్చేసింది. కొత్తగా తీసుకొచ్చిన మద్యం పాలసీలో ఈమేరకు నిర్ణయం తీసుకుంది. 


కార్పొరేట్ ఆఫీసుల్లో సాధారణంగా టీ, కాఫీ, కూల్‌డ్రింక్స్ తాగడం మనం చూసే ఉంటాం. ఇకపై హర్యానాలోని కార్పొరేట్‌ ఆఫీసులకు వెళ్తే మాత్రం లిక్కర్‌ బాటిళ్లు దర్శనం ఇవ్వబోతున్నాయి. ఇప్పటి వరకు ఉన్న రూల్స్‌ను సడలించిన అక్కడి ప్రభుత్వం ఆఫీసుల్లో కూడా మద్యం సేవించవచ్చని రూల్స్ పాస్ చేసింది. 


2023-24 వ సంవత్సరానికి సంబంధించిన కొత్త మద్యం పాలసీ తీసుకొచ్చిన హర్యానా ప్రభుత్వం ఈ సంచలన నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు ఇదే సోషల్ మీడియాలో హాట‌్ టాపిక్‌గా మారింది. కార్పొరేట్‌ ఆఫీసు క్యాంటీన్లలో మద్యం తాగొచ్చని రూల్ తీసుకొచ్చింది. ఆల్కహాల్‌ శాతం తక్కువ ఉన్న బీరు వైన్, వంటి మద్యాన్ని తాగేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 


హర్యానా తీసుకొచ్చి  ఈ కొత్త పాలసీ జూన్‌ 12 నుంచి అమల్లోకి రానుంది. దీనికి కొన్ని రూల్స్ పెట్టింది ప్రభుత్వం. ఇలా మద్యం సరఫరా చేయాలనుకుంటే 5వేల మంది కంటే ఎక్కువ మంది ఉద్యోగులు ఉండాలి. ఆఫీస్‌ విస్తీర్ణం కూడా  లక్ష చదరపు అడుగులకుపైబడి ఉండాలనే షరతులు పెట్టింది ప్రభుత్వం. అలాంటి ఆఫీసుల్లోనే మద్యం తాగేందుకు అనుమతి ఉందని పేర్కొంది.