Gyanvapi Case: 


యోగి సంచలన  వ్యాఖ్యలు..


జ్ఞానవాపి మసీదు కేసుపై యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మసీదులో ఆవరణలో త్రిశూలం ఎందుకు ఉందని ప్రశ్నించారు. ముస్లిం పిటిషనర్‌లు చారిత్రక తప్పిదాన్ని సరి చేసే పరిష్కారంతో ముందుకు రావాలని డిమాండ్ చేశారు. ANIకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ ప్రస్తావన తీసుకొచ్చారు. 


"మసీదులో త్రిశూలం ఎందుకుంది..? మేమేమీ పెట్టలేదే. అక్కడ కచ్చితంగా జ్యోతిర్లింగం ఉంది. దేవుడి ప్రతిమలున్నాయి. అక్కడి గోడలు మనకు ఏవో చెబుతున్నాయి. ఇది కచ్చితంగా ఓ చారిత్రక తప్పిదమే. దీనికి పరిష్కారం చూపించేందుకు ముస్లిం పిటిషనర్‌లు ముందుకు రావాలి. మాకు కావాల్సింది ఇదే. "


- యోగి ఆదిత్యనాథ్, యూపీ ముఖ్యమంత్రి