MLA Jignesh Mevani: గుజరాత్ ఎమ్మెల్యే జిగ్నేశ్ మేవానీకి మరో కేసులో బెయిల్ వచ్చింది. మహిళా పోలీసును వేధించిన కేసులో ఆయనకు అసోం కోర్టు బెయిల్ మంజూరు చేసింది.
మళ్లీ అరెస్ట్
మేవానీని అసోం పోలీసులు గత వారం అరెస్టు చేశారు. ప్రధాని నరేంద్ర మోదీపై వివాదాస్పద ట్వీట్ చేశారంటూ ఆయనపై అసోంలో కేసు నమోదైంది. ఈ కేసులో భాగంగా గత బుధవారం రాత్రి 11.30 గంటలకు పాలంపూర్‌లో మేవానీని అదుపులోకి తీసుకొని పోలీసులు అసోం తరలించారు. అయితే ఈ విషయంలో కోర్టు బెయిల్ ఇచ్చింది.
ఇలా రిలీజ్ అయిన వెంటనే అసోం పోలీసులు మరో కేసులో మేవానీని అరెస్ట్ చేశారు. ఈ కేసులో కూడా అసోం కోర్టు బెయిల్ ఇచ్చింది.
పుష్ప
అయితే అరెస్ట్ చేసి తీసుకెళ్తుండగా పుష్ప సినిమాలోని రియాక్షన్ ఇచ్చారు జిగ్నేశ్. ఆయుధాలతో పోలీసులు పక్కన ఉన్న సమయంలో జిగ్నేశ్.. కెమెరా వైపు చూసిన జిగ్నేశ్ 'తగ్గేదేలే' అంటూ రియాక్షిన్ ఇచ్చారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కేంద్రానికి వ్యతిరేకంగా గళం విప్పుతున్న కారణంగానే తనను అరెస్ట్ చేసినట్లు జిగ్నేశ్ ఆరోపించారు. అక్రమ కేసులతో తనను భయపెట్టాలని చూస్తున్నారన్నారు. కానీ దేనికీ తాను భయపడనని జిగ్నేశ్ అన్నారు.
Also Read: Hanuman Chalisa Row: అమరావతి ఎంపీ నవనీత్ రాణా దంపతులకు మళ్లీ నిరాశే
Also Read: World’s Most Loyal Employee: 84 ఏళ్లుగా ఒకే కంపెనీలో ఉద్యోగం- నీ ఓపికకు దండం సామీ!