Punjab News: పంజాబ్ పటియాలాలో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. ఊరేగింపు సందర్భంగా రెండు వర్గాల మధ్య హింసాత్మక ఘర్షణలు జరిగాయి. శివసేన ఆధ్వర్యంలో ఖలిస్థాన్ వ్యతిరేక మార్చ్ నిర్వహించగా మరో వర్గం అభ్యంతరం తెలిపింది. దీంతో రెండు వర్గాల మధ్య వాగ్వాదం చెలరేగింది. ఇరు వర్గాలు రాళ్లు రువ్వుకున్నాయి.
భారీగా మోహరింపు
ఉద్రిక్త పరిస్థితులను అదుపు చేసేందుకు అధికారులు భారీగా పోలీసులను మోహరించారు. అయినప్పటికీ ఘర్షణలు అదుపులోకి రాలేదు. పోలీసులపై ఓ వర్గం రాళ్లు రువ్వగా, మరో వర్గం కత్తులతో దాడి చేసేందుకు యత్నించింది. ఈ ఘర్షణలో పలువురు పోలీసులు గాయపడ్డారు.
సీఎం ఆదేశాలు
ఈ ఘటనపై పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ స్పందించారు. పరిస్థితి గురించి డీజీపీతో మాట్లాడినట్లు తెలిపారు.
Also Read: Hanuman Chalisa Row: అమరావతి ఎంపీ నవనీత్ రాణా దంపతులకు మళ్లీ నిరాశే
Also Read: World’s Most Loyal Employee: 84 ఏళ్లుగా ఒకే కంపెనీలో ఉద్యోగం- నీ ఓపికకు దండం సామీ!