Monsoon Parliament Session: జులై 17న అఖిలపక్ష భేటీని ఏర్పాటు చేసింది కేంద్ర ప్రభుత్వం. పార్లమెంటు వర్షాకాల సమావేశాలకు ముందుగా ఈ భేటీ జరగనుంది. ఆదివారం ఉదయం 11 గంటలకు జరిగే ఈ సమావేశానికి ప్రధాని నరేంద్ర మోదీ హాజరయ్యే అవకాశం ఉంది.


సహకారం కోసం






పార్లమెంటు ఉభయ సభలు జులై 18 నుంచి సమావేశం కానున్నాయి. అదే రోజు రాష్ట్రపతి ఎన్నికలు నిర్వ‌హిస్తారు. వ‌ర్షాకాల సమావేశాలు ఆగస్టు 13న ముగుస్తాయి. వర్షాకాల సమావేశాలు సాధారణంగా జులై మూడో వారంలో ప్రారంభమై స్వాతంత్య్ర‌ దినోత్సవానికి ముందు ముగుస్తాయి. ఈ సారి రాష్ట్రపతి ఎన్నికతోపాటు ఉప‌రాష్ట్ర‌ప‌తి ప‌ద‌వికి కూడా ఈ సెషన్‌లోనే ఎన్నికలు జరగనున్నాయి. కనుక విపక్షాలు సహకరించాలని ప్రభుత్వం కోరే అవకాశం ఉంది.


ముర్ముకే






మరోవైపు రాష్ట్రపతి ఎన్నికల్లో తమ మద్దతు ద్రౌపది ముర్ముకేనని మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ శిందే స్పష్టం చేశారు. తమ ఎమ్మెల్యేల మద్దతు ఆమెకే ఉంటుందన్నారు.


ఠాక్రే కూడా


రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్‌డీఏ అభ్యర్థి ద్రౌపది ముర్ముకే శివసేన కూడా మద్దతు ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ అంశంపై ముంబయిలోని ఉద్ధవ్ ఠాక్రే నివాసం మాతోశ్రీలో సోమవారం సమావేశం జరిగింది. ఈ భేటీలో శివసేన ఎంపీలతో ఠాక్రే చర్చించారు. ఇందులో 12 మందికి పైగా ఎంపీలు.. ముర్ముకే మద్దతు ఇవ్వాలని ఠాక్రేకు సూచించినట్లు సమాచారం.


ఇద్దరు లేరు


ఉద్ధవ్ నివాసంలో జరిగిన సమావేశానికి ఇద్దరు ఎంపీలు తప్ప అందరూ హాజరయ్యారు. శివసేనకు మొత్తం 18 మంది ఎంపీలున్నారు. వీరిలో భావన, శ్రీకాంత్ శిందే (సీఎం ఏక్‌నాథ్ శిందే తనయుడు) గైర్హాజరయ్యారు. మెజార్టీ ఎంపీలు డిమాండ్ చేస్తుండటంతో ఉద్ధవ్ కూడా ముర్ముకే మద్దతు ఇచ్చేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.


Also Read: Rahul Gandhi Europe Visit: మరోసారి రాహుల్ గాంధీ ఫారెన్ టూర్- కీలక సమావేశాలకు లేనట్లే!


Also Read: UK New PM Announcement: టీచర్స్‌డే రోజే ఇంగ్లాండ్ ప్రధాని ఎంపిక- రిషికే అవకాశాలెక్కువ!