UK New PM Announcement: బ్రిటన్ కొత్త ప్రధాని ఎంపిక ముహూర్తం ఎట్టకేలకు తేలింది. సెప్టెంబర్ 5న పార్టీ నాయకులు సమక్షంలో కొత్త ప్రధాని పేరును అధికారికంగా ప్రకటించనుంది అధికార కన్జర్వేటివ్ పార్టీ.


రేసులో 11 మంది


ప్రధాని పదవికి పోటీ పడేందుకు 11 మంది నేతలు సిద్ధంగా ఉన్నారు. రేసులో ఉండాలనుకునేవారు నామినేషన్లు సమర్పించేందుకు మంగళవారం ఒక్కరోజే గడువుంది. వేసవి విరామం అనంతరం బ్రిటన్‌ పార్లమెంట్‌ సెప్టెంబర్‌లోనే తిరిగి ప్రారంభమవుతుంది. అప్పుడే కొత్త ప్రధాని ప్రకటన ఉండనుంది.


ఇలా ఎంపిక



  • ప్రధాని పదవికి పోటీ పడాలనుకునే వారికి కనీసం 20 మంది ఎంపీల మద్దతు ఉండాలి.

  • పోటీలో ఉన్నవారిని పార్టీ నేతలు బ్యాలెట్ ఓటింగ్ ద్వారా ఎన్నుకుంటారు.

  • రౌండ్ల వారీగా ఓటింగ్ నిర్వహించి తక్కువ ఓట్లు వచ్చిన వారిని ఎలిమినేట్ చేస్తూ ఉంటారు.

  • చివరకు మిగిలిన ఇద్దరిలో ఎవరికి ఎక్కువ ఓట్లు వస్తే వారే కన్జర్వేటివ్ పార్టీ నూతన సారథిగా, ప్రధానిగా బాధ్యతలు చేపడుతారు.


రిషికి ఛాన్స్ ఎక్కువ


కొత్త ప్రధాని రేసులో భారత సంతతికి చెందిన రిషి సునక్ ఉన్నారు. బోరిస్ జాన్సన్‌ కేబినెట్ నుంచి మొదటగా తప్పుకున్న వ్యక్కి రిషి సునక్. ఆ తర్వాత సొంత ప్రభుత్వంలో మంత్రులతో పాటు మొత్తం 58 మంది రాజీనామా చేశారు. దీంతో పదవి నుంచి తప్పుకుంటున్నట్లు బోరిస్ ప్రకటించారు. 


ప్రచారం


ప్రధాని రేసులో ఉన్న రిషి సునక్.. ఇప్పటికే ప్రచారం కూడా మొదలుపెట్టారు. ఇంగ్లాండ్ ప్రజల నమ్మకాన్ని తిరిగి నిలబెట్టడానికి తనకు ఓటేయాలంటూ రిషి కోరుతున్నారు.


రిషి కనుక ప్రధాని అయితే ఆ ఘనత సాధించిన తొలి భారత సంతతి వ్యక్తిగా రికార్డులకెక్కుతారు. 42 ఏళ్ల రిషి సునక్‌ను ప్రధాని బోరిస్ జాన్స్ ఫిబ్రవరి 2020లో ఎక్స్‌చెకర్ చాన్స్‌లర్‌గా నియమించారు. ఫలితంగా తొలిసారి పూర్తిస్థాయి కేబినెట్ హోదా పొందారు. కరోనా సమయంలో డౌనింగ్ స్ట్రీట్‌లోని జరిగిన ప్రధాని బర్త్ డే వేడుకల్లో పాల్గొన్నందుకు గాను జరిమానాను కూడా ఎదుర్కొన్నారు. రిషి సునక్ తాతలు పంజాబ్ నుంచి వచ్చారు.






Also Read: Red Alert For Maharashtra Rains: భారీ వర్షాలకు ముంబయి గజగజ- మరో 2 రోజుల పాటు అంతేగా అంతేగా!


Also Read: Sri Lanka Crisis: దుబాయ్‌కు పారిపోవాలని ప్లాన్- శ్రీలంక అధ్యక్షుడి సోదరుడ్ని పట్టుకున్న అధికారులు!