Know How Lokmanya Tilak Transformed Ganesh Puja To Struggle For Freedom
అప్పట్లో కేవలం ఇళ్లల్లోనే వినాయక చవితి పూజలు
బహిరంగ ప్రదేశాల్లో ఉత్సవాలను స్టార్ట్ చేసిన బాలగంగాధర్ తిలక్
1894లో ఎలాంటి బహిరంగ మీటింగ్స్ కు అనుమతి ఇవ్వని బ్రిటిష్
ప్రజలను ఏకం చేయడానికి వినాయక చవితిని ఎంచుకున్న తిలక్
పూణెలో బహిరంగ ప్రాంతాల్లో వినాయక విగ్రహాల ప్రతిష్ఠాపన
ప్రజలను పెద్దఎత్తున ఉత్సవాల్లో భాగం చేసిన తిలక్
కుల,వర్గ భేదాలు లేకుండా అందర్నీ ఏకతాటిపైకి తెచ్చిన తిలక్
వినాయక చవితికి పది రోజుల ఉత్సవాలు, ఊరేగింపుగా నిమజ్జనం... ఈ సంప్రదాయాన్ని మొదలుపెట్టింది స్వాతంత్య్ర సమరయోధులలో ఒకరైన ‘లోకమాన్య’ బాలగంగాధర్ తిలక్ (Bal Gangadhar Tilak). వినాయక చవితి..... దేశవ్యాప్తంగా పేద, ధనిక తేడా లేకుండా అందరూ భక్తిశ్రద్ధలతో జరుపుకునే పండుగ. అసలు వినాయక చవితి ఉత్సవాలు జరిగే అన్ని రోజులూ... దేశంలోని ప్రతి వీధి, ప్రతి ప్రాంతం చాలా సందడి సందడిగా కనిపిస్తుంది. ఇక ఆఖరి రోజు నిమజ్జనం గురించి ప్రత్యేకంగా చెప్పాలా. మండపం దగ్గర నుంచి నిమజ్జనం చేసే చోటు దాకా ఓ ఊరేగింపుగా వెళ్లి మరీ గణనాథుడ్ని సాగనంపుతారు. వయోభేదం లేకుండా అందరూ ఉత్సాహంగా పాల్గొంటారు.
అప్పట్లో నిమజ్జనం ఇలా ఉండేది కాదు
అసలు ఒకప్పుడు ఇలాంటి ఊరేగింపులు ఏమీ లేకుండా వినాయక చవితి చాలా సాదాసీదాగా జరిగిపోయేది. అసలు ఊహించుకోలేకపోతున్నాం కదా. కానీ అదే నిజం. ఇలా ఊరేగింపు సంప్రదాయాలను తీసుకొచ్చింది ఎవరో తెలుసా.. లోకమాన్య బాల గంగాధర్ తిలక్. అప్పట్లో వినాయక చవితిని ఎవరి ఇంట్లో వాళ్లు పూజలా జరుపుకునేవారు. ఎలాంటి ఆర్భాటం, సందడి లేకుండా సాధారణంగా జరిగిపోయేది. కానీ 1894 నుంచే బహిరంగ ప్రదేశాల్లో ఉత్సవాలు, సందడి మొదలైంది. దానికి కారణం.. స్వాతంత్ర్య ఉద్యమం. 1894 సమయంలో రాజకీయ సంబంధిత ఎలాంటి ర్యాలీలకు, కానీ ప్రదర్శనలకు బ్రిటిష్ ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు. అలాంటివి జరిపినవారిపై కఠినంగా వ్యవహరించేది.
ఎలాంటి మీటింగ్స్, బహిరంగ ప్రదర్శనలు లేకపోతుండటం వల్ల ప్రజలందరిలో యూనిటీ, స్వాతంత్ర్య కాంక్ష మెల్లగా తగ్గిపోతుందని తిలక్ భావించారు. ప్రజలందర్నీ ఏకం చేయడానికి వినాయక చవితిని తిలక్ ఓ సాధనంగా గుర్తించారు. కుల, వర్గ భేదాలు లేకుండా అందర్నీ ఏకతాటిపైకి తీసుకురావడానికి ఈ పండుగను సరైన మార్గంగా భావించారు. అప్పుడే తొలిసారి పుణేలో బహిరంగ ప్రదేశాల్లో భారీగా వినాయక విగ్రహాలను ప్రతిష్ఠించారు. ప్రజలందర్నీ పది రోజుల ఉత్సవాల్లో భాగం చేశారు. అక్కడివారంతా భక్తిశ్రద్ధలతో భారీ ఎత్తున ఉత్సవాల్లో పాల్గొన్నారు. అందర్లోనూ యూనిటీ కనిపించింది. పది రోజులు ఉత్సవాలు జరిపిన తర్వాత, ఊరేగింపుగా తీసుకెళ్లి వినాయకుడ్ని నిమజ్జనం చేసేవారు. ఇది కూడా అంతకుముందు ఎప్పుడూ లేదు. సో ఆ రకంగా... వినాయక చవితి అనే దేవుడి సెంటిమెంట్ ఆధారంగా స్వాతంత్ర్యం కోసం ప్రజలను తిలక్ ఉత్తేజితులను చేశారు. బానిస సంకెళ్ల నుంచి పోరాడేందుకు, అందర్నీ సమైక్యం చేసేందుకు అప్పట్లో భారతీయులకు దొరికిన ఓ మార్గం వినాయక చవితి.
Also Read: Vinayaka chavithi 2022: బానపొట్ట, పెద్ద చెవులు, చిన్న కళ్లు -వినాయకుడి రూపం వెనుకున్న పరమార్థం ఇదే!
Also Read: vinayaka chavithi 2022: వినాయకుడి ముందు గుంజీలు ఎందుకు తీస్తారు!