Gaganyaan Mission Objectives:


తొలి దశ సక్సెస్..


ఇస్రో గగన్‌యాన్ మిషన్‌ (Gaganyaan TV-D1 Mission) విజయవంతంగా పూర్తైంది. ఆస్ట్రోనాట్‌లను స్పేస్‌లోకి పంపించడంలో కీలకమైన  Crew Escape System ని టెస్ట్ చేసేందుకు ఈ ప్రయోగం చేపట్టిన ఇస్రో...సక్సెస్ అయింది. క్రూ ఎస్కేప్ సిస్టమ్ పైనే ప్రధానంగా దృష్టి పెట్టింది. ఆస్ట్రోనాట్‌లను సురక్షితంగా ల్యాండ్‌ చేసే ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఇది. క్రూ మాడ్యూల్‌ (Crew Module) గాల్లో ఉన్నప్పుడు క్రూ ఎస్కేప్ సిస్టమ్ యాక్టివేట్ అవుతుంది. ఆ సమయంలో ఫ్లైట్‌ కండీషన్‌ ఏంటో తెలుసుకునేందుకు ఇస్రోకి వీలవుతుంది. క్రూ మాడ్యూల్ నుంచి క్రూ ఎస్కేప్ సిస్టమ్‌ విజయవంతంగా విడిపోతుందా లేదా అన్నది పరీక్షిస్తారు. ప్రస్తుతం చేసింది కూడా అదే. భవిష్యత్‌లోనూ మరిన్ని టెస్ట్‌లు చేసేందుకు ప్లాన్ చేసుకుంది ఇస్రో. Mach Number 1.2 వద్ద TV-D1 మిషన్‌ అబార్ట్ అయ్యేలా సెట్ చేసింది. 


ఈ మిషన్‌తో కలిగే లాభాలేంటి..?


గగన్‌మిషన్‌తో ద్వారా ఇస్రో ముగ్గురు వ్యోమగాముల్ని స్పేస్‌లోకి పంపాలని లక్ష్యంగా పెట్టుకుంది. 400 కిలోమీటర్ల ఎత్తులోని ఆర్బిట్‌లోకి ఈ ముగ్గురినీ పంపాలనుకుంటోంది. మూడు రోజుల పాటు ఈ మిషన్ కొనసాగుతుంది. ఆ తరవాత వాళ్లను సురక్షితంగా భూమి మీదకి తీసుకురావడంతో ఈ మిషన్ పూర్తవుతుంది. బెంగళూరులోని Astronaut Training Facility లో ఈ ఆస్ట్రోనాట్స్‌కి శిక్షణ అందించనున్నారు. క్లాస్‌రూమ్ ట్రైనింగ్, ఫిజికల్ ఫిట్‌నెస్ ట్రైనింగ్, సిమ్యులేటర్ ట్రైనింగ్, ఫ్లైట్‌ సూట్‌ ట్రైనింగ్‌ ఇస్తారు. దశల వారీగా ఈ మిషన్‌ని ప్రయోగించనుంది ఇస్రో. ఇప్పటికే తొలి దశ విజయవంతంగా పూర్తైంది. ఈ మిషన్‌ కోసం 90 బిలియన్‌ల ఖర్చు చేయనుంది ఇస్రో. ఇప్పటికే సోవియట్ యూనియన్, అమెరికా, చైనా స్పేస్‌లో వ్యోమగాముల్ని పంపాయి. గగన్‌యాన్ మిషన్‌ సక్సెస్‌ అయితే...ఈ జాబితాలో భారత్‌ కూడా చేరనుంది. తొలి దశ పూర్తైంది కాబట్టి ఇకపై పూర్తి స్థాయిలో దీన్ని ప్రయోగించేందుకు సిద్ధమవుతోంది ఇస్రో. వచ్చే ఏడాది ఓ హ్యూమనాయిడ్ రోబోని గగన్‌యాన్ స్పేస్‌ క్రాఫ్ట్‌ (Gaganyaan Spacecraft) ద్వారా పంపేందుకు ఇస్రో అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ఈ ఫిమేల్‌ రోబోకి Vyommitra అనే పేరు కూడా పెట్టింది. 2019లోనే ఈ ఫిమేల్ హ్యూమనాయిడ్‌ని (ISRO Female Humanoid) ప్రపంచానికి పరిచయం చేసింది. తొలిసారి 1984లో భారతీయుడైన రాకేశ్ శర్మ (Rakesh Sharma) రష్యన్ స్పేస్‌ క్రాఫ్ట్‌లో అంతరిక్షంలోకి వెళ్లాడు. అక్కడ దాదాపు 21 రోజుల 40 నిముషాల పాటు ఉన్నాడు. 


2025 నాటికి స్పేస్‌లోకి..


ఇప్పటికే చంద్రయాన్ 3 మిషన్ సక్సెస్‌తో ప్రపంచవ్యాప్తంగా ఇస్రో పేరు మారుమోగుతోంది. అంతరిక్ష రంగంలో మిగతా దేశాలకు ఏమీ తీసిపోమన్న సందేశాన్ని ఇస్తోంది. అటు కేంద్ర ప్రభుత్వం కూడా స్పేస్‌ ఇండస్ట్రీకి ప్రోత్సాహం అందిస్తోంది. ఫలితంగా..వరుస పెట్టి కీలకమైన ప్రయోగాలను చేపడుతోంది. అందులో భాగంగానే గగన్‌యాన్‌కి శ్రీకారం చుట్టింది. 2025 నాటికి పూర్తి స్థాయిలో ఓ ఆస్ట్రోనాట్‌ని స్పేస్‌లోకి పంపాలని లక్ష్యంగా పెట్టుకుంది. 


Also Read: ఇస్రో గగన్‌యాన్‌ మిషన్ సూపర్ సక్సెస్, కాసేపు టెన్షన్ పెట్టినా ప్రయోగం విజయవంతం