Gaganyaan Mission Success:
గగన్‌యాన్ సక్సెస్..
ఇస్రో చేపట్టిన గగన్‌యాన్ మిషన్ విజయవంతంగా పూర్తైంది. సాంకేతిక సమస్యల కారణంగా కాసేపు టెన్షన్ పెట్టినా గగన్ యాన్ టీవీ డీ1 ప్రయోగం సూపర్ సక్సెస్ అయ్యింది. రెండు వాయిదాల తర్వాత మూడోసారి రాకెట్ ను ప్రయోగించిన ఇస్రో శాస్త్రవేత్తల కృషి ఫలించింది. ప్రయోగం తర్వాత నింగిలో 17 కిలోమీటర్ల ఎత్తులో రాకెట్ నుంచి క్రూ ఎస్కేప్ మాడ్యూల్, క్రూ మాడ్యూల్ పరస్పరం విడిపోగా సెకనుకు 8.5 మీటర్ల వేగంతో క్రూ మాడ్యూల్.. సురక్షితంగా బంగాళాఖాతంలో దిగింది. ఈ ప్రయోగంలో విజయం సాధించటం ద్వారా భవిష్యత్తులో రాకెట్ లో సమస్యలు తలెత్తినా అందులో ఆస్ట్రోనాట్లకు రక్షణ కల్పించేలా ప్రణాళికలు రచిస్తామని ఇస్రో తెలిపింది. ఇస్రో గగన్ యాన్ ప్రాజెక్ట్ లో ఇది మొదటి విజయమని ఇస్రో ఛైర్మన్ సోమనాథ్ ప్రకటించారు
ఈ ప్రయోగం సక్సెస్ అయ్యే ముందు కాసేపు టెన్షన్ పెట్టింది. టెక్నికల్ ఫెయిల్యూర్ కారణంగా ప్రయోగం రెండు గంటలు ఆలస్యమైంది. అయితే...ఇందుకు కారణమేంటో ఇస్రో ఛైర్మన్ సోమనాథ్ వివరించారు. లిఫ్ట్ ఆఫ్ అయ్యే ముందు చిన్న సమస్య ఎదురైందని, అందుకే...ప్రయోగంలో జాప్యం జరిగిందని చెప్పారు. "ప్రయోగం మొదలయ్యే ముందు లిఫ్ట్ ఆఫ్ హోల్ట్‌లో పెట్టాల్సి వచ్చింది. గ్రౌండ్ కంప్యూటర్ లిఫ్ట్‌ఆఫ్‌కి క్లియరెన్స్ ఇవ్వలేదు. ఈ టెక్నికల్ ఇష్యూని వెంటనే గుర్తించాం. తక్షణమే ఆ సమస్యని సవరించాం. కాకపోతే...అంతా క్లియర్ అవడానికి రెండు గంటల సమయం పట్టింది"
- సోమనాథ్, ఇస్రో ఛైర్మన్