G20 Summit 2023 LIVE: బ్రెజిల్ ప్రెసిడెంట్‌కి G20 అధ్యక్ష బాధ్యతలు, గ్యావెల్ అప్పగించిన ప్రధాని మోదీ
G20 Summit Delhi LIVE Updates: G20 సదస్సుకి సంబంధించిన అప్‌డేట్స్ కోసం ఈ పేజ్‌ని ఫాలో అవ్వండి.
వచ్చే ఏడాది G20 సమావేశాలు బ్రెజిల్‌లో జరగనున్నాయి. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోదీ బ్రెజిల్ అధ్యక్షుడు లూయిజ్‌కి Gavel అందించారు. అధికారికంగా బాధ్యతలు అప్పగించారు.
ప్రధాని నరేంద్ర మోదీ ఈ సెషన్‌లో ఖలిస్థాన్ ఉద్యమం గురించి ప్రస్తావించారు. యూకే ప్రధాని రిషి సునాక్‌తో దీనిపై చర్చించినట్టు సమాచారం.
యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ దేర్ కీలక వ్యాఖ్యలు చేశారు. భవిష్యత్ అంతా డిజిటల్ యుగమే అని అన్నారు. AIతో పాటు డిజిటల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌పై దృష్టి పెడతామని వెల్లడించారు. AIతో కొన్ని సమస్యలున్నప్పటికీ అవకాశాలూ అదే స్థాయిలో ఉన్నాయని తేల్చి చెప్పారు. One Futureపై చర్చ జరుగుతున్న సమయంలో ఈ కామెంట్స్ చేశారు.
రెండో రోజు సమావేశాల్లో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ ఫ్రాన్స్ అధ్యక్షుడు మేక్రాన్‌తో వర్కింగ్ లంచ్ మీటింగ్ నిర్వహించనున్నారు. దీంతో పాటు కెనడా ప్రధానితో భేటీ అవుతారు.
గ్లోబల్ సౌత్ నినాదాన్ని వినిపించడంలో భారత్ సక్సెస్ అయిందని, ఢిల్లీ డిక్లరేషన్‌కి అందరూ ఆమోదం తెలపడం గొప్ప విషయమని ఐక్యరాజ్యసమితి ప్రతినిధి స్టెఫానే డుజర్రిక్ ప్రశంసించారు.
ఢిల్లీని మరోసారి భారీ వర్షాలు కుదిపేస్తున్నాయి. పలు చోట్ల రోజ్లు జలమయం అయ్యాయి. ట్రాఫిక్‌కి అంతరాయం కలుగుతోంది. ఈ ఎఫెక్ట్ G20 సదస్సుపైనా పడింది. ఈ సమ్మిట్ జరుగుతున్న భారత్ మండపంలో వరద నీరు వచ్చి చేరింది. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
గ్రీన్ క్లైమేట్ ఫండ్‌లో భాగంగా 2 బిలియన్ డాలర్ల నిధులు కేటాయించేందుకు బ్రిటన్ అంగీకరించింది.
మూడో సెషన్ మొదలవనున్న నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీకి ఇండోనేషియా అధ్యక్షుడు జోకో విడోడో, బ్రెజిల్ అధ్యక్షుడు లూయిజ్ ఇనాకియో మొక్కలు బహుకరించారు.
భారత్ మండపంలో G20 సదస్సు మూడో సెషన్‌ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. One Future అంశంపై కీలకంగా చర్చించనున్నారు. ప్రధాని స్పీచ్‌తో ఈ మూడో సెషన్ ముగియనుంది.
G20 మూడో సెషన్ మరి కాసేపట్లో ప్రారంభం కానుంది. ఇవాళ్టి సమావేశాల్లో వాతావరణ మార్పులపై చర్చలు జరగనున్నాయి.
G20 సదస్సులో మొదటి రోజు హాజరైన అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఇండియా పర్యటన ముగించుకున్నారు. ఇక్కడి నుంచి నేరుగా వియత్నాం వెళ్లనున్నారు. ఇప్పటికే ఆయన ఎయిర్‌పోర్ట్‌కి చేరుకుని వీడ్కోలు పలికారు.
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఏర్పాటు చేసిన విందులో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ పలు కీలక విషయాలు చర్చించారు. రెండు దేశాల మధ్య మైత్రిని బలోపేతం చేసేందుకు ప్రయత్నిస్తున్నట్టు ఆర్థిక శాఖ వెల్లడించింది.
G20 సదస్సు జరుగుతున్న భారత్ మండపం వద్ద G20 నేతలందరూ కలిసి మొక్కలు నాటనున్నారు.
రాజ్‌ఘాట్‌లోని రాజ్ ఘాట్ వద్ద ప్రధాని మోదీ సహా G20 అధినేతలు మహాత్మా గాంధీకి నివాళులర్పించారు. బైడెన్, సునాక్ సహా పలు దేశాల కీలక నేతలు పూలతో శ్రద్ధాంజలి ఘటించారు.
ప్రపంచ జీవ ఇంధన కూటమి ఏర్పాటు చేస్తున్నట్లు భారత్ ప్రకటించింది. జీవ ఇంధనాల అభివృద్ధి విషయంలో కలిసికట్టుగా పనిచేద్దామని సభ్య దేశాలకు ప్రధాని మోదీ పిలుపునిచ్చారు.
కొన్ని విషయాల్లో చైనా భారత్‌కి ఎంతో సహకరించిందని స్పష్టం చేశారు జైశంకర్. అభివృద్ధి అజెండాతోనే ఢిల్లీ డిక్లరేషన్‌ని ప్రవేశపెట్టినట్టు తెలిపారు.
ఉగ్రవాదాన్ని అన్ని దేశాలూ తీవ్రంగా ఖండించాయని, మనీ ల్యాండరింగ్‌పైనా కఠిన చర్యలు తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించాయని విదేశాంగ మంత్రి జైశంకర్ వెల్లడించారు.
రష్యా ఉక్రెయిన్ యుద్ధంపై G20 సదస్సులో జరిగిన చర్చపై అమితాబ్ కాంత్ కీలక విషయాలు వెల్లడించారు. ఈ సమస్య పరిష్కారం కోసం భారత్ బ్రెజిల్, సౌతాఫ్రికా, ఇండోనేషియాతో భారత్ ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరిపినట్టు తెలిపారు. ఇది భారత్‌కు అతి పెద్ద సవాలుగా నిలిచిందని, అయినా అధిగమించేందుకు అన్ని విధాలుగా ప్రయత్నించిందని స్పష్టం చేశారు.
ఢిల్లీ డిక్లరేషన్‌పై G20 షెర్పా అమితాబ్ కాంత్ కీలక వ్యాఖ్యలు చేశారు. మహిళా సాధికారత, లింగసమానత్వంపైనే ఈ డిక్లరేషన్ ఎక్కువగా దృష్టి సారించిందని, ఇది భారత్ సాధించిన విజయం అని వెల్లడించారు. మహిళ ఆహార భద్రతతో పాటు వాళ్లకు పోషకాహారం అందించాలన్న అంశంపైనా చర్చ జరిగిందని తెలిపారు.
G20 సభ్యుల నుంచి భారత్‌కి ఈ స్థాయిలో మద్దతు రావడం సంతోషంగా ఉందని అన్నారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. ఇది భారత దేశ నిబద్ధతకు నిదర్శనం అని స్పష్టం చేశారు.
యూకే ప్రధాని రిషి సునాక్ రేపు (సెప్టెంబర్ 10) అక్షర్‌ధామ్ ఆలయాన్ని సందర్శించుకోనున్నట్టు అధికారులు వెల్లడించారు.
పెట్రోల్‌లో 20% ఇథనాల్‌ని కలపాలన్న ప్రతిపాదన తీసుకొచ్చింది భారత్. తద్వారా కర్బన ఉద్గారాలను తగ్గించవచ్చని స్పష్టం చేసింది. ఇందుకోసం లక్షల కోట్ల డాలర్ల మేర ఖర్చు చేయాల్సి ఉంటుందని వెల్లడించింది. ఈ విషయంలో అభివృద్ధి చెందిన దేశాలే కీలక పాత్ర పోషిస్తాయని ప్రధాని మోదీ వెల్లడించారు. అంతర్జాతీయంగా ఈ విధానాన్ని అమలు చేయాలని ప్రతిపాదించారు.
జపాన్ ప్రధాని ఫుమియో కిషిదతో భారత ప్రధాని నరేంద్ర మోదీ ద్వైపాక్షిక చర్చలు జరిపారు. G20 సమావేశాలతో సమాంతరంగా ఈ సమావేశాలు జరుగుతున్నాయి.
ప్రధాని నరేంద్ర మోదీ, యూకే ప్రధాని రిషి సునాక్ మధ్య ద్వైపాక్షిక చర్చలు జరుగుతున్నాయి.
మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ శిందే ఢిల్లీకి చేరుకున్నారు. రాష్ట్రపతి విందుకి హాజరు కానున్నారు.
ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మేక్రాన్ G20 సదస్సుకి హాజరయ్యేందుకు ఢిల్లీకి వచ్చారు. భారత ప్రతినిధులు ఆయను ఆత్మీయంగా స్వాగతించారు.
G20 సదస్సులో "ఒకే పుడమి" థీమ్‌పై మాట్లాడారు ప్రధాని నరేంద్ర మోదీ. భారత్ ఈ విషయంలో ఎన్నో చర్యలు చేపట్టిందని వెల్లడించారు. మానవ కేంద్రంగానే అభివృద్ధి జరగాలని, భారత సంస్కృతిలో ఇది భాగమని తెలిపారు One Earth థీమ్‌పై భారత్ ఎన్నో విధాలుగా చర్యలు తీసుకుందని వాటిలో LiFE Mission ఒకటని వివరించారు. వీటితో పాటు International Year of Millets అంశాన్నీ ప్రస్తావించినట్టు ప్రధాని వెల్లడించారు.
G20 సదస్సుని ప్రపంచమంతా గమనిస్తోందని అన్నారు యూకే ప్రధాని రిషి సునాక్. 15 ఏళ్ల క్రితం అంతర్జాతీయంగా సవాళ్లు ఎదురయ్యాయని అప్పుడు G20 అధినేతలే ముందుకొచ్చి సమస్యకు పరిష్కారం చూపించే ప్రయత్నం చేశారని గుర్తు చేశారు. ఇప్పుడు కూడా అలాంటి సవాళ్లే ఎదురవుతున్నాయని, అందుకే ప్రపంచమంతా మరోసారి G20 దేశాలవైపే చూస్తోందని అన్నారు.
G20 విందుకు హాజరయ్యేందుకు ఢిల్లీ బయల్దేరిన తమిళనాడు ముఖ్యమంత్రి ఎమ్‌కే స్టాలిన్ ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌కి చేరుకున్నారు.
G20 సదస్సుకి రష్యా అధ్యక్షుడు పుతిన్ రాకపోవడంపై రష్యన్ న్యూస్ ఎడిటర్ స్పందించారు. భారత్, రష్యా మధ్య మైత్రి ఎప్పటికీ ఇలాగే ఉంటుందని..రష్యా ప్రజలూ ప్రధాని మోదీని ఇష్టపడుతున్నారని వెల్లడించారు. G20 సదస్సుకి ఎవరు హాజరవుతున్నారన్నది ముఖ్యం కాదని రష్యా ఉందా లేదా అనేదే ముఖ్యమని స్పష్టం చేశారు.
"ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో G20 సదస్సు విజయవంతమవుతుంది. ఈ సమ్మిట్ కోసం వచ్చిన అతిథులందరికీ ఆత్మీయ స్వాగతం. ప్రధాని మోదీకి మరోసారి అభినందనలు తెలుపుతున్నాను"
- ప్రమోద్ సావంత్, గోవా ముఖ్యమంత్రి
G20 సదస్సు సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రత్యేక డిన్నర్ ఏర్పాటు చేశారు. ఈ విందుకి పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఆహ్వానం అందింది. ఈ మేరకు తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్, బిహార్ సీఎం నితీష్ కుమార్ ఢిల్లీకి బయల్దేరారు.
G20 సదస్సులో ప్రధాని నరేంద్ర మోదీ Union of Comoros అధ్యక్షుడు African Union ఛైర్‌పర్సన్ అజాలి అసౌమనికి కీలక బాధ్యతలు అప్పగించారు. తొలిరోజు సమావేశానికి ఆయనే అధ్యక్షత వహించాలని కోరారు. ఈ మేరకు ఆయనను ఆత్మీయంగా ఆలింగనం చేసుకుని బాధ్యత అప్పగించారు. ఆఫ్రికన్ యూనియన్ G20లో శాశ్వత సభ్యత్వం సాధించిన సమయంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.
ప్రపంచానికి కొత్త దిశ చూపించడానికి ఈ 21 వ శతాబ్దం ఎంతో కీలకమైన సమయం. పాత సమస్యలకు కొత్త పరిష్కారాలు వెతుక్కోడానికి ఇదే మంచి తరుణం. అందుకే మానవాభివృద్ధి కేంద్రంగానే విధానాలు రూపొందించాల్సిన అవసరముంది. కొవిడ్ లాంటి మహమ్మారిని జయించగలిగితే...యుద్ధాల వల్ల ప్రజలు కోల్పోతున్న నమ్మకాన్నీ తిరిగి నిలబెట్టగలం.
- ప్రధాని నరేంద్ర మోదీ
"G20 సదస్సుకి భారత్ అధ్యక్షత వహించడం ఐక్యతకు చిహ్నం. సబ్‌కా సాథ్ అనే నినాదం కేవలం దేశానికే పరిమితం కాదు. ప్రపంచానికీ వర్తిస్తుంది. ఈ సదస్సుని లీడ్ చేస్తోంది భారత దేశ ప్రజలే. కోట్లాది మంది దేశ పౌరులు పరోక్షంగా ఈ సదస్సులో భాగస్వాములై ఉన్నారు. దేశంలోని 60 నగరాల్లో దాదాపు 200 సమావేశాలు జరిగాయి. ఈ సందర్భంగా భారత్ ఓ విజ్ఞప్తి చేస్తోంది. ఆఫ్రికన్ యూనియన్‌కి G20 దేశాల్లో శాశ్వత సభ్యత్వం ఇవ్వాలని ప్రతిపాదిస్తోంది. ఈ ప్రతిపాదనకు అందరూ అంగీకరిస్తారని ఆశిస్తున్నాను"
- ప్రధాని నరేంద్ర మోదీ
ప్రధాని నరేంద్ర మోదీ కూర్చున్న స్థానంలో ముందు నేమ్‌ప్లేట్ ఆసక్తికరంగా మారింది. దానిపై India కి బదులుగా Bharat అని రాసుంది. పేరు మార్పుపై ఇప్పటికే చర్చ జరుగుతుండగా ప్రధాని మోదీ నేమ్‌ప్లేట్‌పై ఆ పేరు కనిపించింది.
ప్రధాని నరేంద్ర మోదీ G20 సదస్సుని ప్రారంభించారు. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. మొరాకోలో భూకంప విపత్తులో మృతి చెందిన వారికి సంతాపం తెలిపారు. గాయపడ్డవాళ్లు వీలైనంత త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్టు చెప్పారు. ఈ కష్టకాలంలో మొరాకో దేశానికి ఎలాంటి సాయమైనా అందించేందుకు భారత్ సిద్ధంగా ఉందని వెల్లడించారు.
ఒడిశా కోనార్క్ వీల్ వద్ద నిలబడి ప్రధాని నరేంద్ర మోదీ G20 సదస్సుకి వస్తున్న అతిథులకు స్వాగతం పలుకుతుండటం ఆసక్తికరంగా మారింది.
ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మేక్రాన్ మధ్యాహ్నం 12.35 నిముషాలకు రానున్నారు. ఆలోగా తొలి విడత సమావేశాలు జరగనున్నాయి.
యూకే ప్రధాని రిషి సునాక్ భారత్ మండపానికి చేరుకున్నారు. ప్రధాని మోదీ ఆయనను ఆత్మీయంగా ఆలింగనం చేసుకుని ఆహ్వానం పలికారు.
భారత్ మండపానికి చేరుకున్న ఇండోనేషియా అధ్యక్షుడు జోకో విడోడోని ప్రధాని ఆత్మీయంగా స్వాగతించారు.
బ్రెజిల్ అధ్యక్షుడు లూయిజ్ ఇనాకియో భారత్ మండపానికి చేరుకున్నారు. ప్రధాని మోదీ ఆయనకు షేక్‌హ్యాండ్ ఇచ్చి స్వాగతం పలికారు.
చైనా ప్రెసిడెంట్ జిన్‌పింగ్ రాకపోయినా ఆ దేశ ప్రధాని లీ క్వియాంగ్ G20 సదస్సుకి హాజరయ్యారు. భారత్ మండపం వద్ద ప్రధాని మోదీ ఆయనను స్వాగతించారు.
అమెరికా ప్రెసిడెంట్ జో బైడెన్ ప్రగతి మైదాన్ లోని భారత్ మండపానికి చేరుకున్నారు.
ఉదయం 9 గంటలకు ప్రధాని నరేంద్ర మోదీ ప్రగతి మైదాన్‌లోని భారత్ మండపానికి చేరుకున్నారు. విదేశాంగ మంత్రి జైశంకర్, భద్రతా సలహాదారు అజిత్ దోవల్ ఆయనకు స్వాగతం పలికారు.
Background
G20 Summit 2023 LIVE:
G20 సదస్సులో తొలిరోజే ఆసక్తికర పరిణామం జరిగింది. సదస్సుని ప్రారంభిస్తూ ప్రసంగించిన ప్రధాని మోదీ చివర్లో కీలక ప్రకటన చేశారు. G20లో ఆఫ్రికన్ యూనియన్ (African Union)కు శాశ్వత సభ్యత్వం కల్పించారు. సభ్యులందరి ఆమోదంతో ఆఫ్రికన్ యూనియన్‌కి శాశ్వత సభ్యత్వం ఇస్తున్నట్టు ప్రధాని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఆఫ్రికన్ యూనియన్ చీఫ్ అజాలీ అసౌమనీని (Azali Assoumani)ఆలింగనం చేసుకున్నారు. స్వయంగా తానే పర్మినెంట్ మెంబర్స్ కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కుర్చీలో కూర్చోబెట్టారు. దీనిపై అజాలీ ఆనందం వ్యక్తం చేశారు. సబ్‌కా సాథ్ నినాద స్ఫూర్తితోనే ఆఫ్రికన్ యూనియన్‌కి శాశ్వత సభ్యత్వం కల్పిస్తున్నట్టు ప్రధాని మోదీ స్పష్టం చేశారు.
"సబ్‌కా సాథ్ నినాదం స్ఫూర్తితో ఆఫ్రికన్ యూనియన్‌కి G20 లో శాశ్వత సభ్యత్వం ఇవ్వాలని ప్రతిపాదిస్తున్నాం. ఇందుకు సభ్యులందరూ ఆమోదం తెలుపుతున్నారనే విశ్వసిస్తున్నాను. మీ అంగీకారంతో ఆఫ్రికన్ యూనియన్‌కి శాశ్వత సభ్యత్వం కల్పిస్తున్నాం. మనం చర్చలు మొదలు పెట్టే ముందు AU ప్రెసిడెంట్ అజాలీ ఆయన స్థానంలో కూర్చోవాలని కోరుకుంటున్నాను"
- ప్రధాని నరేంద్ర మోదీ
ప్రధాని నరేంద్ర మోదీ G20 సదస్సుని ప్రారంభించారు. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. మొరాకోలో భూకంప విపత్తులో మృతి చెందిన వారికి సంతాపం తెలిపారు. గాయపడ్డవాళ్లు వీలైనంత త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్టు చెప్పారు. ఈ కష్టకాలంలో మొరాకో దేశానికి ఎలాంటి సాయమైనా అందించేందుకు భారత్ సిద్ధంగా ఉందని వెల్లడించారు. మోదీ కూర్చున్న స్థానంలో ముందు నేమ్‌ప్లేట్ ఆసక్తికరంగా మారింది. దానిపై India కి బదులుగా Bharat అని రాసుంది. పేరు మార్పుపై ఇప్పటికే చర్చ జరుగుతుండగా ప్రధాని మోదీ నేమ్‌ప్లేట్‌పై ఆ పేరు కనిపించింది. విపక్షాలు దీనిపై ఎన్నో విమర్శలు చేస్తున్నాయి. డైవర్షన్ పాలిటిక్స్ అంటూ మండి పడుతున్నాయి. ఇలాంటి కీలక సమయంలో భారత్ అని కనిపించడం వల్ల కేంద్రం అందుకు సిద్ధంగానే ఉందని సంకేతాలిచ్చినట్టైంది.
- - - - - - - - - Advertisement - - - - - - - - -