G20 Summit 2023: రక్షణ వ్యవస్థను పటిష్టం చేసేందుకు భారత్ చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా 31 అధునాతన ఆయుధ MQ-9B రీపర్, ప్రిడేటర్-బి డ్రోన్లు కొనుగోలు చేసేలా అమెరికా ప్రభుత్వానికి అభ్యర్థన లేఖ (LoR: letter of request) పంపింది. రక్షణ మంత్రిత్వ శాఖ 31 'హంటర్-కిల్లర్', రిమోట్ పైలట్ విమాన వ్యవస్థలు, వాటి ఆయుధ ప్యాకేజీలు, మొబైల్ గ్రౌండ్ కంట్రోల్ సిస్టమ్‌లు ఇతర పరికరాలతో కోసం కొద్ది రోజుల క్రితం అభ్యర్థన లేఖను అమెరికాకు పంపినట్లు అధికార వర్గాలు తెలిపాయి.
విదేశీ సైనిక విక్రయాల (FMS) కార్యక్రమం కింద అమెరికా కాంగ్రెస్ నుంచి ఒకటి లేదా రెండు నెలల్లో కొనుగోలుకు అయ్యే ఖర్చు, అవసరమైన నోటిఫికేషన్‌తో అంగీకార పత్రం వస్తుందని అధికార వర్గాలు పేర్కొన్నాయి. 31 డ్రోన్లు, నేవీ కోసం 15 సముద్ర గార్డియన్‌లు, ఆర్మీ, IAF కోసం 16 స్కై గార్డియన్ల ధర $3.1 బిలియన్ల ఉండొచ్చని అంచనా వేస్తున్నారు.
క్యాబినెట్ కమిటీ నుంచి క్లియరెన్స్ పొందిన తర్వాత ఈ క్యాలెండర్ సంవత్సరంలో కాకపోయినా, ఈ ఆర్థిక సంవత్సరంలోనే HALE ఒప్పందంపై సంతకం చేయడానికి అవకాశం ఉంటుందని సమాచార వర్గాలు పేర్కొన్నాయి. వచ్చే ఆరు లేదా ఏడేళ్లల్లో జనరల్ అటామిక్స్ (GA) ద్వారా భారతదేశంలో రూపుదిద్దుకునే డ్రోన్‌ల ఇండక్షన్‌ను పూర్తి చేయడానికి సాయుధ దళాలు అన్ని ఆసక్తిగా ఉన్నాయన్నారు.
చైనా దాని మిత్రదేశం పాకిస్తాన్‌కు కై హాంగ్-4, వింగ్ లూంగ్-II డ్రోన్‌లను సరఫరా చేస్తోంది. వీటికంటే ఎక్కువ సామర్థ్యం కలిగి ఉన్న MQ-9Bలు హిందూ మహాసముద్రంలో భారతదేశం నిఘా, భద్రతకు అదనపు బలం చేకూర్చుతాయి. మూడు విభాగాల్లో కొనుగోలు చేయనున్న డ్రోన్‌లు, పేలోడ్‌లను నిర్దిష్ట అవసరాలకు అనుగుణంగా ప్రత్యేకతలను LoR వివరిస్తుంది, ఇందులో నావికాదళం, సముద్ర గస్తీ రాడార్‌లు సైతం ఉంటాయి.
ఈ ఒప్పందంలో GA భారతదేశంలో ఖర్చు, మెయింటెనెన్స్, రిపేర్, ఇతర సదుపాయాలను అందించనుంది. అలాగే భారతీయ సంస్థల నుంచి కొన్ని భాగాలను కూడా తీసుకోనుంది. MQ-9B డ్రోన్లు ఇంటెలిజెన్స్, నిఘా నుంచి తప్పించుకునేలా 40,000 అడుగుల ఎత్తులో దాదాపు 40 గంటల పాటు ప్రయాణించేలా రూపొందించబడ్డాయి. అలాగే హెల్‌ఫైర్ ఎయిర్-టు-గ్రౌండ్ మిస్సైల్స్, స్మార్ట్ బాంబులు, ఆయుధాలను కలిగి ఉంటాయి. ఖచ్చితమైన దాడులు చేసేందుకు ఉపయోగపడతాయి.
సెప్టెంబరు 2020లో జనరల్ అటామిక్స్ నుంచి భారత నావికాదళం లీజుకు తీసుకున్న రెండు నిరాయుధ సముద్ర గార్డియన్లు, IOR, చైనాతో 3,488 కిమీ వాస్తవ నియంత్రణ రేఖ వెంట అత్యాధునిక ISR మిషన్ల కోసం సమర్థవంతంగా ఉపయోగించబడ్డాయి. MQ-9B ఒప్పందం DRDOకు ఉపయోగపడుతుందని అంచనా వేస్తున్నారు. శత్రు లక్ష్యాలపై క్షిపణులను, ఖచ్చితత్వంగా పేల్చేయగల సామర్థ్యం ఉన్న స్వదేశీ HALE డ్రోన్‌లను అభివృద్ధి చేయడంలో సహాయపడుతుందని భావిస్తున్నారు.