Friendship Day 2023:



డెలివరీ బాయ్‌గా సీఈవో 


జొమాటో సీఈవో దీపీందర్ గోయల్ ( Deepinder Goyal ) అందరినీ సర్‌ప్రైజ్ చేశారు. ఫ్రెండ్‌షిప్‌ డే సందర్భంగా స్వయంగా ఆయనే కస్టమర్స్‌కి ఫుడ్ డెలివరీ చేశాడు. బైక్‌పై అన్ని చోట్లా తిరుగుతూ కస్టమర్స్‌కి ఫుడ్‌తో పాటు ఫ్రెండ్‌షిప్ డే బ్యాండ్‌లనూ ఇచ్చాడు. కస్టమర్స్‌కి మాత్రమే కాదు. డెలివరీ పార్ట్‌నర్స్‌కి, రెస్టారెంట్ పార్ట్‌నర్స్‌కీ ఆయనే స్వయంగా బ్యాండ్‌లు డెలివరీ చేశాడు. రాయల్‌ ఎన్‌ఫీల్డ్ బైక్‌పై జొమాటో  బ్యాగ్‌ వెనకాల పెట్టుకుని, డెలివరీ బాయ్ టీషర్ట్ వేసుకుని కనిపించాడు. "ఫ్రెండ్‌షిప్ బ్యాండ్‌లు డెలివరీ చేయడానికి వెళ్తున్నా" అంటూ ట్విటర్‌లో పోస్ట్ చేశాడు. కొన్ని ఫొటోలు షేర్ చేశాడు. ఆయన చేతిలో ఫ్రెండ్‌షిప్ బ్యాండ్‌లున్నాయి. ఈ పోస్ట్ క్షణాల్లోనే వైరల్ అయిపోయింది. నెటిజన్లు ఈ పోస్ట్‌ చూసి తెగ ఇంప్రెస్ అయ్యారు. కొందరు కస్టమర్స్‌ ఇవాళ జొమాటో సీఈవోని చూడబోతున్నారంటూ చాలా ఎగ్జైటింగ్‌గా కామెంట్స్ పెట్టారు. "మీరు ఛండీగఢ్‌లో డెలివరీ చేస్తున్నారా..? ఒక్కసారైనా మీ చేతితో డెలివరీ తీసుకోవాలని కోరుకుంటున్నాను" అని ఓ నెటిజన్ కామెంట్ పెట్టాడు. చాలా తక్కువ సమయంలోనే జొమాటో పాపులర్ అయింది. ప్రతి సిటీలోనూ సర్వీస్‌లు అందిస్తోంది. ఇంత పాపులారిటీ ఉన్న కంపెనీ సీఈవో ఓ సాధారణ డెలివరీ బాయ్‌గా మారిపోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది.