S Jaishankar Interview: 


భారత్‌ పేరుపై జైశంకర్ వ్యాఖ్యలు..


విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ ANIకి ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు కీలక విషయాలు ప్రస్తావించారు. ఇండియా పేరుని భారత్‌గా మార్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయన్న వాదనల నేపథ్యంలో ఆయన క్లారిటీ ఇచ్చారు. రాజ్యాంగంలో "Bharat"అనే పేరు మెన్షన్ చేసే ఉందని తేల్చి చెప్పారు. సెప్టెంబర్ 9న జీ 20 సదస్సు ముగియనుంది. ఈ సందర్భంగా విపక్షాలకు ప్రత్యేక విందుకు ఆహ్వానించారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. అయితే...ఈ ఇన్విటేషన్ కార్డ్‌లో President of Bharat అని ఉండటంపై విపక్షాలు మండి పడుతున్నాయి. దీనిపై స్పందించిన జైశంకర్...రాజ్యాంగంలో India తో పాటు గా Bharat అని కూడా పేర్కొన్నట్టు చెప్పారు. 


"ఇండియా అంటే భారత్. మన దేశ రాజ్యాంగంలోనూ ఈ పేరు ఉంది. విపక్షాలకు నా విజ్ఞప్తి ఒక్కటే. దయచేసి మన రాజ్యాంగాన్ని పూర్తిగా చదవండి. భారత్‌ అనే పదానికి ఓ అర్థం ఉంది"


- ఎస్ జైశంకర్, విదేశాంగ శాఖ మంత్రి