Domestic Violence Rajasthan: భర్త హింసిస్తున్నాడని, చిత్ర హింసలకు గురి చేస్తున్నాడని ఎంతో మంది భార్యలు పోలీసులకు ఫిర్యాదు చేస్తుంటారు. లేదా గృహహింస చట్టం కింద కోర్టును ఆశ్రయిస్తారు. అయితే ఇందుకు భిన్నంగా తన భార్య రోజూ చితకబాదుతుందని ఓ భర్త పోలీసులను ఆశ్రయించాడు. గృహహింస చట్టం కింద కోర్టులో కేసు పెట్టాడు.
ఏం జరిగింది?
రాజస్థాన్ అల్వార్ జిల్లా భివాడి పట్టణంలో ఈ ఘటన జరిగింది. పాఠశాల ప్రిన్సిపల్‌గా పనిచేస్తోన్న అజిత్ యాదవ్ తన భార్య చిత్రహింసలకు గురిచేస్తుందని వాపోయాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు ఇంట్లోని సీసీటీవీలో రికార్డయ్యాయి. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
భయంగా ఉంది
అజిత్ యాదవ్ అల్వార్ కోర్టులో గృహహింస చట్టం కింద కేసు కూడా పెట్టాడు. ఇంటికి వెళ్లాలంటే భయంగా ఉందని, ఎలాంటి కారణం లేకుండా భార్య చితకబాదుతోందని అజిత్ కోర్టులో కన్నీళ్లు పెట్టుకున్నాడు. కోర్టు, పోలీసులే తనను కాపాడాలని అభ్యర్థించాడు. భార్య తనపై దాడి చేసిన సీసీటీవీ ఫుటేజీని కోర్టుకు సమర్పించాడు.
ఈ ఫుటేజిని పరిశీలించిన న్యాయస్థానం బాధిత భర్త చేసిన ఆరోపణలపై విచారణ చేయాలని పోలీసులను ఆదేశించింది. అవసరమైతే భద్రత కూడా కల్పించాలని సూచించింది.
ఇదే కారణం
32 ఏళ్ల అజిత్ యాదవ్‌కు ఏడేళ్ల క్రితం సుమనాతో ప్రేమ వివాహం జరిగింది. వీరిద్దరికీ ఆరేళ్ల బాబు ఉన్నాడు. ఏడాది క్రితం వరకూ ఎంతో సంతోషంగా కాపురం చేస్తున్న వారి మధ్య అకస్మాత్తుగా మనస్పర్థలు ఏర్పడ్డాయి. అప్పటి నుంచి భార్య తనను చిత్రవధకు గురిచేస్తోందని అజిత్ యాదవ్ కోర్టును ఆశ్రయించాడు.
Also Read: Karti Chidambaram: ఒక్క చైనీయుడికి కూడా వీసా ఇవ్వలేదు- ఇవన్నీ బోగస్ కేసులు: కార్తీ చిదంబరం
Also Read: Delhi's Thyagraj Stadium: కుక్కను వాకింగ్‌కు తీసుకెళ్లేందుకు స్టేడియం ఖాళీ చేయించిన ఐఏఎస్!