Aurangzeb Lane Renamed:
అబ్దుల్ కలాం లేన్..
ఢిల్లీలోని ఔరంగజేబు లేన్ (Aurangzeb Lane)పేరు మార్చుతూ నిర్ణయం తీసుకుంది. న్యూ ఢిల్లీ మున్సిపల్ కౌన్సిల్ (NMDC). ఔరంగజేబు పేరు తీసేసి మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం (Dr APJ Abdul Kalam Lane)పేరు పెట్టింది. ఇటీవలే సమావేశమైన ఈ కౌన్సిల్ సభ్యులు..పేరు మార్పునకి ఆమోదం తెలిపారు. అబ్దుల్ కలాం రోడ్‌కి, ఔరంగజేబు లేన్‌కి కనెక్టివిటీ ఉంది. ఇప్పుడు ఔరంగజేబు లేన్ పేరు తీసేయడం వల్ల నేరుగా అబ్దుల్ కలాం రోడ్‌కి, అబ్దుల్ కలాం లేన్‌కి కనెక్ట్ చేసినట్టైంది. 2015లోనే ఔరంగజేబు రోడ్ పేరుని అబ్దుల్ కలాం పేరిట మార్చింది NMDC. ఇప్పుడు లేన్ పేరు కూడా మార్చేసింది.
"న్యూ ఢిల్లీ మున్సిపల్ యాక్ట్ 1994లోని సెక్షన్స్ ప్రకారం ఔరంగజేబు లేన్ పేరుని మార్చి డాక్టర్ అబ్దుల్ కలాం పేరు పెట్టాలని నిర్ణయించుకున్నాం. దీనిపై కౌన్సిల్ అప్రూవల్ కూడా లభించింది"
-సతీష్ ఉపాధ్యాయ, NDMC వైస్ ఛైర్మన్
ముస్లిం సంఘాల నుంచి వ్యతిరేకత..
2015లోనే ఔరంగజేబు రోడ్డు పేరు మార్చినప్పుడు ముస్లిం సంఘాలు వ్యతిరేకించాయి. చరిత్రను చెరిపేసేందుకు కుట్ర చేస్తున్నారని మండి పడ్డాయి. ఇప్పుడు కూడా అదే నిర్ణయం తీసుకోవడం వల్ల అసహనం వ్యక్తం చేస్తున్నాయి. ఇది ఇక్కడితో ఆగదని తేల్చి చెబుతున్నారు కొందరు అధికారులు. మహారాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఔరంగాబాద్ జిల్లా పేరు మార్చేస్తానని ప్రకటించింది. దానిపైనా వివాదం నడుస్తోంది. ముస్లిం పాలనలో ఉన్న వీధుల పేర్లన్నింటినీ మార్చేయాలని పెద్ద లిస్ట్ పెట్టుకుంది కేంద్ర ప్రభుత్వం. బ్రిటీష్ కాలం నాటి పేర్లను ఇప్పటికీ కొనసాగించాల్సిన అవసరం ఏంటని ప్రశ్నిస్తోంది. కానీ..కొన్ని ముస్లిం సంఘాలు మాత్రం దీన్ని వ్యతిరేకిస్తున్నాయి. అబ్దుల్ కలాంకి గౌరవం ఇవ్వాలంటే ఓ మ్యూజియం కట్టించి పిల్లలకు అందుబాటులోకి తీసుకుని రావాలని, కానీ ఇలా పేర్లు మార్చడం వల్ల ఒరిగేది ఏమీ ఉండదని వాదిస్తున్నాయి.
Also Read: ఎయిర్‌పోర్ట్‌లో భగత్ సింగ్ లైఫ్ స్టోరీ ప్రదర్శన, స్పెషల్ ప్లాజా నిర్మించనున్న ప్రభుత్వం