Shaheed Bhagat Singh Airport : 


భగత్‌సింగ్ ఎయిర్‌పోర్ట్‌లో..


పంజాబ్‌లోని ఛండీగఢ్‌ ఎయిర్‌పోర్ట్‌కి భగత్‌సింగ్ పేరు పెట్టిన రాష్ట్ర ప్రభుత్వం...ఇప్పుడు మరో కీలక నిర్ణయం తీసుకుంది. భగత్‌ సింగ్ జీవిత చరిత్రను అందరికీ పరిచయం చేయాలన్న ఉద్దేశంతో ఈ ఎయిర్‌పోర్ట్‌లో ప్రత్యేకంగా ఓ ప్లాజా నిర్మించనుంది. దీనికి Nishan-e-Inquilab Plaza అని పేరు పెట్టనుంది. భగత్ సింగ్‌ లైఫ్‌స్టోరీని ఇందులో ప్రదర్శించనుంది. ఇకపై కేవలం పంజాబ్ ప్రజలే కాకుండా ఈ ఎయిర్‌పోర్ట్‌కి వచ్చి పోయే వాళ్లంతా...భగత్‌ సింగ్‌ గురించి తెలుసుకునేందుకు అవకాశం లభించనుంది. ఇదే సమయంలో భగత్‌సింగ్ విగ్రహాన్నీ ఏర్పాటు చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. గతేడాది సెప్టెంబర్ 28న ఛండీగఢ్ ఎయిర్‌పోర్ట్‌కి Shaheed Bhagat Singh Airport పేరు పెట్టింది ప్రభుత్వం. ఇకపై యువతకు ఆయన ఐడియాలజీని మరింత దగ్గర చేయాలని ప్లాన్ చేస్తోంది. అందులో భాగంగానే...ప్లాజా నిర్మాణం చేపట్టనుంది. ఇందుకోసం రూ.6.52కోట్లు ఖర్చు చేయనుంది. రాష్ట్ర గవర్నర్ బన్వరిలాల్ పురోహిత్ కూడా దీనిపై ప్రత్యేక ఆసక్తి చూపిస్తున్నారు. ఈ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో పంజాబ్ సంస్కృతి కళ్లకు కట్టేలా కొత్త హంగులు చేర్చేందుకు PWD అధికారులకు ఆదేశాలిచ్చారు. త్వరలోనే ఈ ప్లాజా నిర్మాణానికి ప్రభుత్వం టెండర్‌లు వేయనుంది. ఒకేసారి ప్లాజా నిర్మాణంతో పాటు భగత్‌సింగ్ విగ్రహాన్నీ ఏర్పాటు చేసేలా ప్లాన్ చేసోంది. టెండర్ ఇష్యూ అయిన నాటి నుంచి 6 నెలల్లో పనులు పూర్తవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది. భగత్ సింగ్ ఎలా మాట్లాడేవాడు..? ఎలా నవ్వే వాడు..? ఎలా కౌగిలించుకునే వాడు..? ఇలా ప్రతి డిటెయిల్‌నీ ప్లాజాలో చూపించనున్నారు. ఇప్పటికే ఈ ఎయిర్‌పోర్ట్ రూపు రేఖల్ని మార్చేసిన ప్రభుత్వం...ఇప్పుడు మరి కొన్ని హంగులు జోడిస్తోంది. 


ఎంపీ వివాదాస్పద వ్యాఖ్యలు..


పంజాబ్‌ ఎంపీ సిమ్రన్‌జిత్ సింగ్ మన్...గతంలో భగత్‌సింగ్‌పై వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. స్వాతంత్య్ర సమరయోధుడైన భగత్‌సింగ్‌ను టెర్రరిస్ట్‌తో పోల్చుతూ ఆయన కామెంట్ చేయటంపై అన్ని రాజకీయ పార్టీలు భగ్గుమన్నాయి. అమృత్‌సర్‌లో శిరోమణి అకాలీ దళ్ చీఫ్‌గానూ ఉన్నారు సిమ్రన్ జిత్ సింగ్. "భగత్‌సింగ్ ఓ యువ నేవీ అధికారిని చంపాడు. ఓ సిక్కు కానిస్టేబుల్‌నీ హతమార్చాడు. నేషనల్ అసెంబ్లీలో బాంబు విసిరాడు. ఈ పనులు చేసిన వాడు టెర్రరిస్ట్ కాకపోతే మరింకేంటి" అని ఆయన అన్నారు. ఇక ఈ వివాదంపై ఆప్‌ తీవ్రంగా మండి పడింది. ఆప్‌ అధిష్ఠానంతో పాటు పంజాబ్ ప్రభుత్వం కూడా ఈ విషయాన్నితీవ్రంగా పరిగణించింది. సిమ్రన్ జిత్ వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసింది. స్వాతంత్య్ర ఉద్యమంలో వీరోచితంగా పోరాడిన యోధుడి గురించి ఇలాంటి వ్యాఖ్యలు చేయటం సరికాదని ఆగ్రహం వ్యక్తం చేసింది. "ఇది సిగ్గుచేటు. భగత్‌సింగ్‌ను టెర్రరిస్ట్‌గా పోల్చి ఆయనను అవమానించారు. పంజాబ్ ప్రజలందరూ భగత్‌ సింగ్ సిద్ధాంతాలను విశ్వసిస్తారు. ఈ వ్యాఖ్యల్ని మేం ఖండిస్తున్నా" అని ఆప్‌ స్పష్టం చేసింది. ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా కూడా స్పందించారు. "భగత్‌సింగ్‌ను ఇలా పోల్చటం సిగ్గు చేటు. ఆయన ఓ హీరో. ఇంక్విలాబ్ జిందాబాద్" అని పోస్ట్ చేశారు. 


Also Read: ఆపరేషన్ థియేటర్లలోనూ హిజాబ్‌కి అనుమతివ్వండి, ప్రిన్సిపల్‌కి మెడికల్ స్టూడెంట్స్ లేఖ