ఢిల్లీలో కాలుష్యం స్థాయి ఇప్పటికే గణనీయంగా పెరిగింది. ఇప్పుడు దీపావళి సందర్భంగా కాల్చిన బాణసంచాతో పరిస్థితి మరింత ప్రమాదకరంగా మారింది. స్విస్ సంస్థ ఐక్యూఎయిర్ ప్రకారం ఇది సోమవారం ప్రపంచంలోనే అత్యంత కలుషితమైన నగరంగా మారింది. ఢిల్లీ తర్వాత పాకిస్థాన్‌కు చెందిన లాహోర్ రెండో స్థానంలో నిలిచింది. దీపావళి రోజున ఢిల్లీలో ఏక్యూఐ 312గా నమోదైంది. నగరంలో 2018లో 281ఎక్యూఐ నమోదైంది.


గత ఏడాది కంటే పరిస్థితి మెరుగే... 


గత ఏడాదితో పోలిస్తే, ఈ ఏడాది ఢిల్లీలో దీపావళి రోజున కాలుష్యం తక్కువగా రికార్డు అయింది. ఇది కాస్త ఆ ప్రాంత ప్రజలకు ఉపశమనం కలిగించే విషయం. కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి డేటా ప్రకారం, గతేడాది దీపావళి రోజున ఢిల్లీలో 382 ఎక్యూఐ నమోదైంది. 2016లో ఏక్యూఐ 431గా ఉంది.






నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్డ్ స్టడీస్, ఇండియన్ ఇన్స్టిట్యూట్లో ఛైర్ ప్రొఫెసర్ గుఫ్రాన్ బేగ్ మాట్లాడుతూ... రాజధానిలో గాలి నాణ్యత మంగళవారం "తీవ్రమైన" జోన్‌కు పడిపోతుందని భావించారు. కానీ మధ్యాహ్నం గాలి వేగం, వెచ్చని పరిస్థితులతో కాలుష్య ప్రభావం తగ్గతుందన్నారు. 


ఢిల్లీ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల్లో పరిస్థితి చూద్దాం



  • గాలి నాణ్యత స్థాయి ఘజియాబాద్ ఏక్యూఐ 301గా ఉంది.

  • నోయిడాలో 303గా ఉంది.

  • గ్రేటర్ నోయిడాలో 270గా ఉంది.

  • గురుగ్రామ్ లో 325గా ఉంది.

  • ఫరీదాబాద్ లో 256గా ఉంది. 






ఏక్యూఐ వర్గీకరణ ఓసారి చూద్దాం. సున్నా నుంచి 50 మధ్య ఎక్యూఐని మంచిదిగా పరిగణిస్తారు. అదే సమయంలో 51 నుంచి 100 వరకు 'సంతృప్తికరమైనది'గా చెబుతారు. 101 నుంచి 200వరకు మధ్యస్థంగా ఉన్నట్టు లెక్క. 201 నుంచి 300వరకు ఉంటే పరిస్థితి అదుపు తప్పుతున్నట్టు వర్గీకరించారు. ఒక నగరం ఎక్యూఐ 301 నుంచి 400 మధ్య ఉన్నట్లయితే అక్కడ గాలి చాలా ప్రమాదకరంగా ఉన్నట్టు అర్థం చేసుకోవాలి. 401 నుంచి 500 వరకు ఉంటే 'తీవ్రమైనది'గా పరిగణిస్తారు. 


శీతాకాలం ప్రారంభం కావడంతో, దేశంలోని పెద్ద నగరాల్లో గాలి నాణ్యత క్షీణించడం ప్రారంభమవుతుంది. కాలుష్యం నుంచి ఎక్కువ ప్రమాదం దేశ రాజధాని ఢిల్లీపై ఉంది, ఇక్కడ కాలుష్య వాయులువు గాల్లో కరుగుతున్నాయి. ఇది ప్రజలకు శ్వాస తీసుకోవడం కష్టతరంగా మారుతుంది. దీపావళి రోజున పేలిన బాణసంచా కూడా గాలిలో కాలుష్యాన్ని వేగంగా పెంచుతుంది.