బ్రిటన్ ప్రధానిగా నియమితులైన రిషి సునక్‌ను ప్రధాని నరేంద్ర మోదీ అభినందించారు. 'మీరు బ్రిటన్ ప్రధాని అయిన వెంటనే, ప్రపంచ సమస్యలపై కలిసి పని చేయడానికి, రోడ్ మ్యాప్ 2030ని అమలు చేయడానికి నేను ఎదురుచూస్తున్నాను. దీంతోపాటు, బ్రిటన్‌లో నివసిస్తున్న భారతీయ ప్రజలను దీపావళి శుభాకాంక్షలు చెప్పారు.
రిషి సునక్‌కు హృదయపూర్వక అభినందనలు అని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. మీరు యుకెకు ప్రధాన మంత్రి అయినప్పుడు, ప్రపంచ సమస్యలపై కలిసి పనిచేయడం, రోడ్ మ్యాప్ 2030ను అమలు చేయడం కోసం నేను ఎదురు చూస్తున్నాను. బ్రిటీష్ భారతీయుల 'వైబ్రెంట్ బ్రిడ్జ్'కు దీపావళి శుభాకాంక్షలు. చారిత్రక సంబంధాలను ఆధునిక భాగస్వామ్యాలుగా మార్చుకున్నాం' అని ఆయన పేర్కొన్నారు.
ప్రముఖ వ్యాపార వేత్త ఆనంద్ మహేంద్ర ఆసక్తికరమైన ట్వీట్ చేశారు. విన్‌స్టన్ చర్చిల్ చేసిన కామెంట్స్‌ను గుర్తు చేస్తూ.. భారత్ నాయకులు తక్కువ సామర్థ్యం కలిగి ఉంటారని... వారిలో శక్తి సామర్థ్యాలు ఉండవని... విన్‌స్టన్ చర్చిల్ అవహేళన చేశారు. కానీ దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తైన వేళ భారతీయ సంతతికి చెందిన వ్యక్తి బ్రిటన్ పగ్గాలు చేపట్టి జవాబు చెప్పారు.
టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడు కూడా రిషి సునక్‌కు శుభాకాంక్షలు చెప్పారు. బ్రిటన్‌ను నడిపించేందుకు ప్రధాన మంత్రిగా బాధ్యతలు చేపట్టబోతున్న రిషి సున్‌కు శుభాకాంక్షలు అంటూ ట్వీట్ చేశారు. ఇది భారతీయులంతా ఆనందించదగ్గ విషయమని అభిప్రాయపడ్డారు.