Satyendar Jain: దిల్లీ ఆరోగ్య శాఖ మంత్రి సత్యేందర్ జైన్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కస్టడీకి అప్పగించింది కోర్టు. జూన్ 9 వరకూ కస్టడీకి అప్పగిస్తున్నట్లు రౌస్ ఎవెన్యూ న్యాయస్థానం ఆదేశించింది. సత్యేందర్ జైన్‌ను ఈడీ అధికారులు సోమవారం అరెస్టు చేశారు.
సత్యేందర్ జైన్‌పై హవాలా ఆరోపణలు రావడంతో విచారణ జరిపిన అధికారులు.. ఆధారాలు లభించడంతో అరెస్ట్ చేశారు. కోల్‌కతాకు చెందిన ఓ కంపెనీకి సంబంధించిన హవాలా లావాదేవీలకు సంబంధించిన కేసులో సత్యేందర్ జైన్‌ను అరెస్ట్ చేసినట్టుగా ఈడీ అధికారులు ధ్రువీకరించారు.
అక్రమాస్తులు
సత్యేందర్ జైన్ కుటుంబానికి చెందిన కొన్ని కంపెనీలపై ఈడీ ఇటీవల విచారణ జరుపుతోంది. కొన్ని చోట్ల సోదాలు నిర్వహించింది. కోల్‌కతాలో కొన్నిసోదాలు నిర్వహించినప్పుడు అక్కడి కంపెనీ సాయంతో మనీ లాండరింగ్ నిర్వహించినట్లుగా గుర్తించినట్లుగా తెలుస్తోంది. సోదాలు జరిపినప్పుడే దాదాపుగా రూ. నాలుగు కోట్ల 81 లక్షల సొమ్ము సత్యేందర్ జైన్ కుటుంబానికి చెందిన సంస్థల్లోకి అక్రమంగా వచ్చినట్లుగా గుర్తించారు. ఈ సొమ్మును అప్పుడే అటాచ్ చేశారు. తాజాగా అరెస్ట్ చేశారు.
పంజాబ్‌లో
పంజాబ్‌లో కొత్తగా ఏర్పడిన ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వంలో ఆరోగ్య మంత్రి విజయ్ సింగ్లా అవినీతికి పాల్పడ్డారని ఆధారాలు లభించడంతో ఆయనను పంజాబ్ సీఎం భగవంత్ మాన్ బర్తరఫ్ చేసి అరెస్ట్ చేయించారు. ఏసీబీ కేసులు నమోదు చేయించారు. ఇప్పుడు ఢిల్లీలోని ఆమ్ ఆద్మీ ప్రభుత్వంలోని మంత్రి మనీలాండరింగ్‌కు పాల్పడ్డారని ఈడీ అరెస్ట్ చేసింది. దీంతో సత్యేందర్ జైన్‌ను కూడా అరెస్ట్ చేయాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.
అయితే సత్యేందర్ జైన్‌కు దిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ మద్దతుగా నిలుస్తోంది. కేంద్ర ప్రభుత్వం, భాజపా.. కేంద్ర దర్యాప్తు సంస్థలను వాడుకుని .. తమ పార్టీ నేతలను వేధిస్తోందని ఆరోపిస్తోంది ఆమ్‌ఆద్మీ.
Also Read: UPSC Final Result 2021: పేరులోనే కాదు పోరాటంలో కూడా 'శివంగే'- UPSCలో 177వ ర్యాంకర్ కథ విన్నారా?