PM Modi Speech: నేను ప్రధానిని కాదు, 130 కోట్ల మందికి ప్రధాన సేవకుడిని: మోదీ ఎమోషనల్ స్పీచ్

ABP Desam   |  Murali Krishna   |  31 May 2022 03:49 PM (IST)

PM Modi Speech: ఫైల్స్‌పై సంతకాలు చేసే సమయంలోనే తాను ప్రధానినని, మిగతా సమయంలో ప్రజలకు ప్రధాన సేవకుడినని మోదీ అన్నారు.

నేను ప్రధానిని కాదు, 130 కోట్ల మందికి ప్రధాన సేవకుడిని: మోదీ ఎమోషనల్ స్పీచ్

PM Modi Speech: కేంద్రంలో భాజపా 8 ఏళ్ల పాలన పూర్తయిన సందర్భంగా హిమాచల్ ప్రదేశ్ సిమ్లాలో నిర్వహించిన గరీబ్​ కల్యాణ్​ సమ్మేళన్​లో ప్రధాని మోదీ ప్రసంగిచారు. తాను ప్రధానిని కానని.. 130 కోట్ల మందికి ప్రధాన సేవకుడినని మోదీ అన్నారు.

గత 8 ఏళ్లలో ఒక్కసారి కూడా నన్ను నేను ప్రధానమంత్రిగా ఊహించుకోలేదు. ఫైల్స్‌పై సంతకాలు చేసినప్పుడే ప్రధాని హోదాలో ఉంటాను. ఆ తర్వాత నేను ప్రధానిని కాదు.. 130 కోట్ల మంది ప్రజలకు ప్రధాన సేవకుడిని. నా జీవితంలో మీరే అన్నీ.. నా జీవితం మీకు అంకితం. 2014కు ముందు అవినీతి ప్రభుత్వంలో భాగమైపోయింది. కానీ భాజపా ప్రభుత్వం దానిని జీరో శాతానికి తీసుకువచ్చింది. ప్రత్యక్ష నగదు బదిలీ ద్వారా అవినీతి జరిగే ఆస్కారం లేకుండా చేశాం. ఇప్పటివరకు సుమారు 200 కోట్ల కొవిడ్​ టీకాలను పంపిణీ చేశాం. కరోనా సంక్షోభంలో దాదాపు 150 దేశాలకు వ్యాక్సిన్లు సరఫరా చేశాం. భారత్‌లో పేదరికం తగ్గుతుందని అంతర్జాతీయ సంస్థలు కూడా ఒప్పుకున్నాయి.                                                                                      - ప్రధాని నరేంద్ర మోదీ

అనంతరం పీఎం కిసాన్ సమ్మాన్ నిధి 11వ విడత నిధులు సుమారు 21 వేల కోట్లను లబ్ధిదారుల ఖాతాల్లోకి మోదీ జమ చేశారు. 

Also Read: Viral Video: 'ఆ పొట్టలో ఏముంది నాన్న! ఏం తింటున్నావ్?'- కార్యకర్తతో దీదీ సంభాషణ వైరల్

Also Read: Uttar Pradesh Road Accident: అంబులెన్స్‌- ట్రక్కు ఢీ- ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు మృతి

Published at: 31 May 2022 03:46 PM (IST)
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.