కుమార్తెకు పెళ్లి చేయకపోయినా ఆ ఖర్చులను ఆమెకు తండ్రి చెల్లించాల్సిందేనని ఛత్తీస్‌గఢ్‌ హైకోర్టు బిలాస్‌పూర్‌ డివిజన్ బెంచ్ కీలక తీర్పు ఇచ్చింది. చట్టం ప్రకారం, పెళ్లికాని కుమార్తె తన తండ్రి నుండి వివాహ ఖర్చులను డిమాండ్ చేయవచ్చని ధర్మాసనం తెలిపింది.  "భారత సమాజంలో, సాధారణంగా వివాహానికి ముందు, వివాహ సమయంలో కూడా ఖర్చులు చేయాల్సి ఉంటుంది" అని ధ‌ర్మాస‌నం అభిప్రాయంపడింది. ఈ తీర్పు ఇవ్వడానికి కారణం రాజేశ్వరి అనే మహిళ. ఆమెకు 35 ఏళ్లు వచ్చినా తండ్రి పెళ్లి చేయలేదు. తండ్రి రిటైరవుతున్న సందర్భంగా వస్తున్న సొమ్ములో కొంత తనకు పెళ్లి ఖర్చుల కింద ఇప్పించాలని ఆమె కోర్టును ఆశ్రయించింది. 


'ద కశ్మీర్ ఫైల్స్' చిత్రం పూర్తిగా వాస్తవం- ఎందుకీ వివాదం: ఉపరాష్ట్రపతి
 
భిలాయ్ స్టీల్ ప్లాంట్ (  Bhilai Steel Plant ) ఉద్యోగి భును రామ్ కుమార్తె  రాజేస్వరి హిందూ దత్తత మరియు నిర్వహణ చట్టం, 1956 ప్రకారం దుర్గ్ ఫ్యామిలీ కోర్టులో పిటిషన్‌  దాఖలు చేశారు. త‌న పెళ్లి ఖ‌ర్చుల మొత్తం కింద‌ రూ. 25 లక్షల ఇవ్వాలని ఆమె ఈ దావాలో పేర్కొన్నారు. రాజేశ్వరి తన పిటిషన్‌లో, ప్రతివాది అయిన తండ్రి భానురామ్ పదవీ విరమణ చేయబోతున్నారని, పదవీ విరమణ బకాయిలుగా రూ. 75 లక్షలు అందుకోవచ్చని వాటి నుంచి  రూ. 25 ల‌క్ష‌లు తనకు ఇప్పించాలని విజ్ఞప్తి చేశారు.  కుమార్తె తన వివాహం మొత్తాన్ని క్లెయిమ్ చేసుకోవచ్చని చట్టంలో ఎటువంటి నిబంధన లేదని పేర్కొంటూ స‌ద‌రు దరఖాస్తును ఫ్యామిలీ కోర్టు కొట్టివేసింది.


లగేజీ మార్చేసిన ఇండిగో - చుక్కలు చూపించిన కస్టమర్ ! మళ్లీ అలా చేయలేరంతే


ఫ్యామిలీ కోర్టు ( Family Court ) తీర్పుపై రాజేశ్వరి  బిలాస్‌పూర్‌లోని హైకోర్టు డివిజన్ బెంచ్ ను ఆశ్రయించింది.  హిందూ అడాప్షన్స్ అండ్ మెయింటెనెన్స్ యాక్ట్, 1956 నిబంధనల ప్రకారం పెళ్లికాని కూతురు తన పెళ్లి ఖ‌ర్చుల‌ను తల్లిదండ్రుల నుంచి క్లెయిమ్ చేసుకోవచ్చని జస్టిస్ గౌతమ్ భాదురి, సంజయ్ ఎస్ అగర్వాల్‌లతో కూడిన ధర్మాసనం ఆమె పిటిషన్‌ను విచారణకు అనుమతించింది. ఇప్ప‌టికే సృష్టించ‌బ‌డిన అలాంటి హక్కులను క్లెయిమ్ చేసినప్పుడు కోర్టులు "తిరస్కరణ" చేయ‌లేవ‌ని పేర్కొంది. ఈ సంద‌ర్భంగా కుటుంబ న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తి దుర్గ్ జారీ చేసిన 22 ఏప్రిల్ 2016 నాటి ఉత్తర్వును బెంచ్ కొట్టివేసింది.  ఎంత మొత్తం చెల్లించాలో విచారణ పూర్తయిన తర్వాత హైకోర్టు ఆదేశాల్లో వెలువడే అవకాశం ఉంది.