Covid Update: దేశంలో కరోనా కేసులు భారీగా పెరిగాయి. కొత్తగా 12,213 కరోనా కేసులు వైరస్​ బారిన పడ్డారు. 11 మంది మృతి చెందారు. తాజాగా 7,624 మంది కరోనా నుంచి కోలుకున్నారు. రికవరీ రేటు 98.66 శాతానికి చేరింది. మరణాల రేటు 1.21 శాతంగా ఉంది.


మొత్తం కేసుల్లో యాక్టివ్​ కేసులు 0.12 శాతం ఉన్నాయి. డైలీ పాజిటివిటీ రేటు 2.35 శాతంగా ఉంది.







  • మొత్తం కరోనా కేసులు: 43,257,730

  • మొత్తం మరణాలు: 5,24,803

  • యాక్టివ్​ కేసులు: 58,215

  • మొత్తం రికవరీలు: 4,26,74,712


వ్యాక్సినేషన్







దేశంలో తాజాగా 15,21,942 మందికి టీకాలు అందించారు. ఇప్పటివరకు పంపిణీ చేసిన వ్యాక్సిన్​ డోసుల సంఖ్య 1,95,67,37,014 కోట్లకు చేరింది. మరో 5,19,419 మందికి కరోనా టెస్టులు నిర్వహించారు.


కరోనా కేసులు పెరుగుతుండటంతో కేంద్రం.. రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. కరోనా నిబంధనలను తప్పగా పాటించేలా చూడాలని తెలిపింది. కరోనా టెస్టులను పెద్ద ఎత్తున నిర్వహించాలని కేంద్రం సూచించింది. 


Also Read: Presidential Poll 2022: ఉమ్మడి రాష్ట్రపతి అభ్యర్థి ఎవరో, లిస్ట్‌లో చాలా మందే ఉన్నారుగా


Also Read: Children's Boat Library: పాడుబడ్డ పడవలో లైబ్రరీ, వాట్‌ ఎన్ ఐడియా సర్‌జీ