Covid Update: కరోనా ఫోర్త్ వేవ్ భయాలు పెరుగుతోన్న వేళ దేశంలో తాజాగా రోజువారి కొవిడ్ కేసులు భారీగా పెరిగాయి. కొత్తగా 7,240 కరోనా కేసులు నమోదయ్యాయి. 8 మంది మృతి చెందారు.
3,591 మంది తాజాగా కరోనా నుంచి కోలుకున్నారు. రికవరీ రేటు 98.71 శాతానికి చేరింది. మరణాల రేటు 1.21 శాతంగా ఉంది. మొత్తం కేసుల్లో యాక్టివ్ కేసులు 0.08 శాతం ఉన్నాయి.
- మొత్తం కరోనా కేసులు:4,31,90,282
- మొత్తం మరణాలు: 5,24,723
- యాక్టివ్ కేసులు: 32,498
- మొత్తం రికవరీలు: 4,26,40,301
వ్యాక్సినేషన్
దేశంలో తాజాగా 15,43,748 మందికి టీకాలు అందించారు. ఇప్పటివరకు పంపిణీ చేసిన వ్యాక్సిన్ డోసుల సంఖ్య 1,94,59,81,691కు చేరింది. మరో 3,40,615 మందికి కరోనా టెస్టులు నిర్వహించారు.
శంలో కరోనా కేసులు పెరుగుతుండటం ఫోర్త్ వేవ్ అంచనాలకు బలం చేకూరుస్తున్నాయి. అయితే కరోనా నిబంధనలను పాటించాలని, మాస్కును తప్పనిసరి ధరించాలని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు చెబుతున్నాయి. మహారాష్ట్ర, దిల్లీ, కేరళలలో కరోనా కేసుల్లో భారీగా పెరుగుదల కనిపిస్తోంది. దీంతో ఆయా రాష్ట్రాల్లో నిబంధనలను కఠినతరం చేయాలని కేంద్రం ఆదేశించింది.
Also Read: Tomato Ketchup: టొమోటో కెచప్ దొరకడం కష్టమే! డెన్మార్క్ పరిశోధకుల ఆసక్తికరమైన అంశాలు
Also Read: Rare Alignment Of 5 Planets : 24న ఆకాశంలో అద్భుతం - మిస్సయితే మళ్లీ చూడలేరు !