PUBG Addiction: పబ్‌జీకి బానిసైన ఓ బాలుడు ఏకంగా తల్లినే హత్య చేశాడు. ఉత్తర్‌ప్రదేశ్‌లో జరిగిన ఈ దారుణ ఘటన యావత్ దేశాన్ని షాక్‌కు గురి చేసింది. ఆన్‌లైన్‌ గేమ్స్‌కు బానిసైన కుమారుడ్ని మందలించడమే ఆ తల్లి చేసిన పాపమైంది.







ఇదీ జరిగింది


ఉత్తర్​ప్రదేశ్ రాజధాని లఖ్​నవూలో జరిగిందీ దారుణ ఘటన. మొబైల్​లో గేమ్స్​కు అలవాటు పడిన 16 ఏళ్ల బాలుడు తన తల్లిని తుపాకీతో కాల్చేశాడు. లఖ్​నవూలోని పీజీఐ ప్రాంతంలో ఉంటోన్న సాధనకు 16 ఏళ్ల కుమారుడు, 10 ఏళ్ల కుమార్తె ఉన్నారు. ఆమె భర్త ఆర్మీలో ఉద్యోగం చేస్తున్నారు.


సాధన కుమారుడు పబ్​జీ గేమ్​కు బానిసైపోయాడు. ఈ అలవాటు మానుకోవాలని ఎన్నిసార్లు నచ్చజెప్పేందుకు చూసినా బాలుడు వినిపించుకోలేదు. ఇటీవల ఆమె నిద్రిస్తున్న సమయంలో బాలుడు తుపాకీతో కాల్చాడు. ఆ తర్వాత మూడు రోజుల పాటు తల్లి శవాన్ని ఇంట్లోనే దాచాడు. దుర్వాసన రాకుండా ఉండాలని గదుల్లో రోజూ రూమ్ ఫ్రెష్​నర్లను స్ప్రే చేశాడు. ఈ విషయాన్ని ఎవరకీ చెప్పకూడదని తన సోదరిని బాలుడు హెచ్చరించాడు.


ఇలా తెలిసింది


అయితే మంగళవారం రాత్రి 8 గంటలకు తన తండ్రికి ఫోన్ చేసి ఎవరో అమ్మను చంపేశారని చెప్పాడు. పోలీసులు సీన్‌లోకి ఎంటరైన తర్వాత బాలుడు వారికి కట్టుకథ చెప్పాడు. విద్యుత్ షాక్ వల్ల తన తల్లి చనిపోయిందని చెప్పుకొచ్చాడు. అయితే మృతదేహం పూర్తిగా పురుగులు పట్టిపోయిందని ఫోరెన్సిక్ బృందాలు గుర్తించాయి. శవం చుట్టూ రక్తపు మరకలు ఉన్నాయి. పోలీసులకు అనుమానం వచ్చి విచారణ జరపడంతో నిజం బయటకు వచ్చింది. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు పూర్తి స్థాయి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.


Also Read: kharif Crops: రైతులకు కేంద్రం శుభవార్త- 17 పంటలకు కనీస మద్దతు ధర పెంపు


Also Read:CM Mamata Banerjee In Alipurduar: వివాహ వేడుకలో దుమ్మురేపిన దీదీ- ఫోక్ డ్యాన్స్‌కు సోషల్ మీడియా షేక్!