kharif Crops: కనీస మద్దతు ధర (ఎమ్‌ఎస్‌పీ)పై కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. 17 పంటలకు కనీస మద్దతు ధర పెంచుతున్నట్లు ప్రకటించింది. వచ్చే ఖరీఫ్ సిజన్‌కు గానూ వరి మద్దతు ధరను క్వింటాలుకు రూ.100 పెంచింది. దీంతో మద్దతు ధర రూ.1,940 నుంచి రూ. 2,040కు పెరగనుంది.
ప్రధానమంత్రి నరేంద్రమోదీ అధ్యక్షతన ఆర్థిక వ్యవహారాల మంత్రివర్గ సంఘం బుధవారం సమావేశమైంది. ఈ భేటీలో 2022-23 ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి 14 పంటలకు కనీస మద్దతు ధరను పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు.
- సోయాబీన్ క్వింటాల్‌కు కనీస మద్దతు ధర రూ.300 పెంపు
- కందులు క్వింటాల్‌పై రూ.300 పెంపు
- పెసలు మద్దతు ధర క్వింటాల్‌కు రూ.480 పెంపు
- నువ్వుల మద్దతు ధర క్వింటాల్‌కు రూ.523
- పొద్దుతిరుగుడు మద్దతు ధర క్వింటాల్‌కు రూ.385
యూరియా నిల్వలు
ఖరీఫ్, రబీ సీజన్లో ఎరువుల అవసరాలను తీర్చడానికి భారత్‌లో తగినంత యూరియా నిల్వలు ఉన్నాయని కేంద్రమంత్రి మన్‌సుఖ్ మాండవీయ తెలిపారు. డిసెంబర్ వరకు యూరియా దిగుమతి చేసుకోవలసిన అవసరం లేదన్నారు. అంతర్జాతీయ మార్కెట్లో ఎరువుల ధరలు తగ్గుముఖం పట్టాయని, రానున్న ఆరు నెలల్లో వీటి ధరలు మరింత తగ్గే అవకాశం ఉందన్నారు.
దేశంలో తగినంత యూరియా అందుబాటులో ఉందని, దేశీయ అవసరాలకు అనుగుణంగా డిసెంబర్ వరకు యూరియా నిల్వలు ఉన్నాయన్నారు. డిసెంబర్ వరకు దిగుమతి చేసుకోవాల్సిన అవసరం లేదని కేంద్రమంత్రి వెల్లడించారు.
Also Read: Ukraine Kyiv Theater: ఓ వైపు యుద్ధం, మరోవైపు వినోదం- కీవ్ థియేటర్‌లో షోలు హౌస్‌ఫుల్!