డిసెంబర్ 31 అంటే.. దావత్ మాములుగా ఉండదు. న్యూ ఇయర్ కు వెలకమ్ చెబుతూ.. అంతా పార్టీలు చేసుకుంటారు. అయితే ఇలానే ఒడిశాలోని బొలంగీర్ కొంతమంది పోలీసులు.. మేకలు కోసి.. డిన్నర్ పార్టీ చేసుకున్నారు. అయితే మేకలు మాత్రం కొట్టుకొచ్చినవి.. అలా మటన్‌తో విందు పార్టీ చేసుకున్నారు. అయితే ఈ విషయం ఆ మేకల యజమానికి తెలిసింది.. పూర్తి వివరాళ్లోకి వెళ్తే..
ఒడిశాలోని సింధికెల గ్రామానికి చెందిన సంకీర్తన అనే వ్యక్తి.. మేకలను కాస్తూ.. జీవనం కొనసాగిస్తాడు. వాటి ద్వారా వచ్చే.. ఆదాయంతో ఇంటిని నడుపుతాడు. అయితే డిసెంబర్ 31న సైతం తన మేకలను మేపేందుకు వెళ్లాడు. మధ్యాహ్నం అయ్యే సమయానికి.. తన మేకల మందలో రెండు మేకలు కనిపించకుండా పోయాయి. ఊరంతా వెతికాడు.. కానీ లాభం లేదు. అయితే సంకీర్తన.. మేకలు మేపింది.. పోలీస్ స్టేషన్ కు సమీపంలోనే.
అయితే సంకీర్తన పోయిన మేకల గురించి.. వెతుకుతుంటేనే.. తన కుమార్తె.. పోలీస్ స్టేషన్ దగ్గరలో మేకలను కోస్తున్న విషయాన్ని చూసింది. ఇదే విషయాన్ని వెళ్లి.. తన తండ్రికి చెప్పింది. కొంతమంది గ్రామస్థులను తీసుకుని పోలీస్ స్టేషన్ కు వెళ్లాడు సంకీర్తన. మీరు కోసేది మా మేకలను ఇది సరైన పద్ధతి కాదని అన్నారు. అవసరం ఉంటే కొనుక్కోవాలని.. కానీ ఇలా.. దొంగిలించి విందు చేసుకోవడమేంటని గ్రామస్థులు నిలదీశారు. ఎంత అడిగినా.. పోలీసులు పట్టించుకోకుండా.. ఏం చేస్తారో చేసుకోండని బెదిరించారు.
అయితే ఈ విషయం.. ఎలాగోలా.. జిల్లా ఎస్పీ నితిన్ కు తెలిసింది. పోలీస్ సిబ్బంది తీరుపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై విచారణ చేయగా.. పోలీసులదే తప్పు అని తెలసింది. అనంతరం ఏఎస్ఐ సుమన్ మల్లిక్‌ను సస్పెండ్ చేశారు.
Also Read: Nellore Car Fire Accident: నెల్లూరులో కారు దగ్ధమైన ఘటన.. వెలుగులోకి మరిన్ని విషయాలు
Also Read: Mancherial: దొంగను బంధించేందుకు మహిళ సాహసం.. ప్యాంటు, బెల్టు పట్టుకొని లాగి.. అభినందించిన పోలీసులు
Also Read: Nellore Car Fire: కంటేపల్లి రైల్వే గేట్ వద్ద కారులో మంటలు... అనుమానాస్పదరీతిలో వ్యక్తి సజీవదహనం