వారం క్రితం ఎంతో వైభవంగా వివాహం జరిగింది. ఆ నవవధువుల కాళ్లపారాణి ఆరకముందే ఇరు కుటుంబాల్లో విషాదం అలముకుంది. నల్గొండ జిల్లాలో జరిగిన ప్రమాదంలో నవవరుడు మృతి చెందాడు. మాల్ - మధునాపూర్ గేట్ మధ్యలో సాగర్ హైవే పై శనివారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎస్.ఐ శ్రీనునాయక్, ఆయన తండ్రి మృతి చెందారు. ఓ కార్యక్రమానికి హాజరై ఇంటికి తిరిగివెళ్తూ ఆర్టీసీ బస్సు ఢీకొని అక్కడికక్కడే దుర్మరణం చెందారు. 


Also Read: ఎనీ డెస్క్ యాప్ తో మనీ గల్లంతు... కడప వాసి అకౌంట్ హ్యాక్ చేసి రూ.లక్షలు స్వాహా... బిహార్ లో సైబర్ కేటుగాడు అరెస్టు


డిసెంబర్ 26న వివాహం 


నల్గొండ జిల్లా చింతపల్లి మండలం మాల్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. దేవరకొండ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు, ఆటోను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వికారాబాద్ వన్ టౌన్ ఎస్ఐ శ్రీను నాయక్(32) ఆయన తండ్రి మాన్య నాయక్(50) అక్కడిక్కడే మృతి చెందారు. మృతులు రంగారెడ్డి జిల్లా మాడుగుల మండలం మాన్య తండా వాసులుగా గుర్తించారు. శ్రీను నాయక్ వారం క్రితమే వికారాబాద్ వన్ టౌన్ ఎస్ఐ గా బాధ్యతలు చేపట్టారు. డిసెంబర్ 26న శ్రీను నాయక్ వివాహం జరిగింది. వడిబియ్యం కార్యక్రమం ముగుంచుకుని స్వగ్రామానికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఎస్సై తండ్రి మాన్య ఆటో డ్రైవర్, ఇటీవల తండ్రి చేతికి గాయం కావడంతో ఎస్ఐ శ్రీను నాయక్ స్వయంగా ఆటో నడిపినట్లు తెలుస్తోంది. వారి ఆటోను ఆర్టీసీ బస్సు ఢీకొట్టడంతో తండ్రీకొడుకులు ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. 


Also Read: కంటేపల్లి రైల్వే గేట్ వద్ద కారులో మంటలు... అనుమానాస్పదరీతిలో వ్యక్తి సజీవదహనం


స్వగ్రామంలో విషాదఛాయలు


ఎస్సై శ్రీను నాయక్‌కి వారం రోజుల కిందటే వివాహం జరిగింది. ఎస్సై శ్రీను నాయక్ రంగారెడ్డి జిల్లా మాడ్గుల మండలం మాన్య తండాలో ఉంటున్నారు. ఓ కార్యక్రమానికి హాజరై ఆటోలో తిరిగి వెళ్తుండగా హైదరాబాద్ నుంచి దేవరకొండ వెళ్తోన్న ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటో నుజ్జునుజ్జు అయింది. ఎస్సై, ఆయన తండ్రి ఘటనాస్థలిలోనే ప్రాణాలు కోల్పోయారు. మరొకరి పరిస్ధితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఎస్సై శ్రీను మరణంతో వారి స్వగ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. 


Also Read:  గోదావరిలో దూకి వాలంటీర్ ఆత్మహత్యాయత్నం... రక్షించే క్రమంలో వైసీపీ వార్డు కౌన్సిలర్ మృతి


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి