China Pneumonia Cases Surge:
5 రాష్ట్రాలు అప్రమత్తం..
చైనాలో ఫ్లూ కేసులు (China Flu Cases) పెరుగుతున్న క్రమంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకూ మార్గదర్శకాలు జారీ చేసింది. రాజస్థాన్, గుజరాత్, ఉత్తరాఖండ్, కర్ణాటక, తమిళనాడు ప్రభుత్వాలు ప్రత్యేక దృష్టి సారించాయి. హెల్త్‌కేర్‌లోని ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ని ఓసారి రివ్యూ చేసుకోవాలని, అవసరమైన ఏర్పాట్లు చేసుకోవాలని కేంద్రం సూచించింది. చిన్నారుల ఆరోగ్యంపై దృష్టి పెట్టాలని తెలిపింది. సీజనల్ ఫ్లూపై అందరూ అప్రమత్తంగా ఉండాలని కర్ణాటక ఆరోగ్య శాఖ ప్రజలందరికీ అడ్వైజరీ జారీ చేసింది. ఈ ఫ్లూ సోకిన వాళ్లకు ప్రాణాపాయం లేకపోయినప్పటికీ...కనీసం వారం రోజుల పాటు ఇబ్బంది పెడుతుందని వివరించింది. అయితే...అప్పుడే పుట్టిన శిశువులు, గర్భిణులు, వ్యాధినిరోధక శక్తి తక్కువగా ఉన్న వాళ్లకు ఈ ఫ్లూ తొందరగా సోకే ప్రమాదముందని వైద్యులు వెల్లడించారు. స్టీరియాడ్స్ తీసుకునే వాళ్లకూ ముప్పు ఉంటుందని హెచ్చరించారు. కొంత మంది హాస్పిటలైజ్ అయ్యే అవకాశముందని తెలిపారు. జ్వరం, చలి, ఆకలి చచ్చిపోవడం, తుమ్ములు, పొడి దగ్గు...ఈ ఫ్లూ లక్షణాలు. హైరిస్క్ గ్రూప్‌లలో దాదాపు మూడు వారాల పాటు ఈ లక్షణాలు కనిపిస్తాయి.
యాక్షన్ ప్లాన్ రెడీ..
అటు రాజస్థాన్ మెడికల్ డిపార్ట్‌మెంట్ కూడా అప్రమత్తమైంది. ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్స్‌తో పాటు సిబ్బంది అంతా అలెర్ట్‌గా ఉండాలని ఆదేశించింది. వ్యాధి సోకిన వాళ్లకు చికిత్స అందించేందుకు అవసరమైన యాక్షన్ ప్లాన్‌ని సిద్ధం చేసుకోవాలని స్పష్టం చేసింది. ప్రస్తుతానికి ఆందోళన చెందాల్సిన అవసరం ఏమీ లేకపోయినా...రాష్ట్రంలో ఎక్కడా ఈ కేసులు నమోదు కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని వివరించింది. జిల్లా స్థాయిలో నోడల్ ఆఫీసర్‌ని నియమించనుంది. గుజరాత్ ప్రభుత్వం అన్ని హాస్పిటల్స్‌కీ సర్క్యులర్ జారీ చేసింది. చైనాలో వైరస్ వ్యాప్తి (China respiratory illness) చెందుతున్న తీరుని ఎప్పటికప్పుడు పరిశీలించాలని ఆదేశించింది. తమిళనాడు ప్రభుత్వమూ అప్రమత్తమైంది.
కేంద్ర ఆరోగ్యశాఖ సెక్రటరీ పలు ఆదేశాలు జారీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు లేఖ రాశారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న వైద్య సౌకర్యాలను రివ్యూ చేసుకోవాలని తెలిపారు. హాస్పిటల్ బెడ్స్, డ్రగ్స్, వ్యాక్సిన్‌లు, మెడికల్ ఆక్సిజన్, యాంటీబయోటిక్స్, టెస్టింగ్ కిట్స్ అన్నీ అందుబాటులో ఉంచుకోవాలని సూచనలు చేశారు. ఆక్సిజన్ ప్లాంట్స్, వెంటిలేటర్స్ ఎన్ని ఉన్నాయో ఓ సారి రివ్యూ చేసుకోవాలని ఆదేశించారు. కొవిడ్ వైరస్ సృష్టించిన సమస్యల్ని దృష్టిలో పెట్టుకుని భవిష్యత్ సంక్షోభాలను ఎదుర్కొనేందుకు చాలా అప్రమత్తంగా ఉండాలని ఇప్పటికే కేంద్రం స్పష్టం చేసింది. Operational Guidelines ని అమలు చేయాలని ఇప్పటికే తేల్చి చెప్పింది. శ్వాసకోశ సమస్యలు కలిగించే పాథోజెన్స్‌పై నిఘా పెట్టాలని సైంటిస్ట్‌లకూ సూచించింది. ఇన్‌ఫ్లుయెంజా తరహా వ్యాధులతో పాటు (influenza-like illness) severe acute respiratory illness (SARI) పైనా జిల్లా స్థాయిలో నిఘా అవసరమని కేంద్రం అలెర్ట్ చేసింది. చలికాలం కావడం వల్ల ఈ ఫ్లూ కేసులు పెరిగే అవకాశముందని తెలిపింది.
ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. *T&C Apply