Uttarakashi Tunnel Trapped Workers:


కార్మికులు ఏమన్నారంటే..?


ఉత్తరకాశీ సొరంగంలో (Uttarakashi Tunnel Rescue Successful) చిక్కుకున్న కార్మికులు బయటకు వచ్చిన తరవాత ఒక్కొక్కరుగా స్పందిస్తున్నారు. ఈ 17 రోజుల పాటు తాము ఎలా గడిపారో వివరించారు. సొరంగం కూలిపోయినప్పుడు ఏమీ అర్థం కాలేదని,చాలా గాబరా పడిపోయామని చెప్పారు. ఆ తరవాత రెస్క్యూ ఆపరేషన్‌ (Trapped Workers Rescued) మొదలయ్యాక కొంత వరకూ ఆందోళన తగ్గిందని అన్నారు. బయటకు రావడం చాలా ఆనందంగా ఉందని, ఇప్పుడు దీపావళి వేడుకలు చేసుకుంటామని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 


"ఉన్నట్టుండి సొరంగం కూలిపోయింది. శిథిలాల్లో చిక్కుకుపోయాం. బయటకు వెళ్లే మార్గం లేదని అర్థమైంది. దాదాపు 10-15 గంటల పాటు నరకం చూశాం. ఆ తరవాత రెస్క్యూ ఆపరేషన్ మొదలైంది. టన్నెల్‌లోకి పైప్‌ అమర్చారు. అందులో నుంచి మాకు అన్నం, పప్పుతో పాటు పండ్లు, డ్రైఫ్రూట్స్ ఇచ్చారు. ఆ తరవాత ఓ మైక్‌ పెట్టారు. దాంతో మా కుటుంబ సభ్యులతో మాట్లాడడానికి వీలైంది. ఇలా బయటకు రావడం చాలా సంతోషంగా ఉంది. దీపావళి వేడుకలు ఇప్పుడు చేసుకుంటాం"


- విశ్వజిత్ కుమార్ వర్మ, కార్మికుడు 






మరో కార్మికుడి కథ ఇది..


మరో కార్మికుడూ తన కథను చెప్పాడు. ఇన్ని రోజుల పాటు విశ్రమించకుండా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగించడంపై ఆనందం వ్యక్తం చేశాడు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు థాంక్స్ చెప్పాడు. 


"సొరంగంలో చిక్కుకున్న మొదటి 24 గంటల పాటు చాలా భయం భయంగా గడిచిపోయింది. ఆ తరవాత పైప్‌ అమర్చి ఫుడ్‌ అందించారు. అప్పటి నుంచి కాస్త ఆరోగ్యం కుదట పడింది. ఇప్పుడు పూర్తి ఆరోగ్యంగా ఉన్నాను"


- సుబోధ్ కుమార్ వర్మ 


 






రాత్రి 7.56 గంటలకు సొరంగం నుంచి మొదటి కార్మికుడు బయటకు వచ్చాడని పీటీఐ వార్తా సంస్థ తెలిపింది. అనంతరం కార్మికులందరినీ ఒక్కొక్కరిగా బయటకు తీసుకొచ్చారు. సిల్కియారా రెస్క్యూ ఆపరేషన్ విజయవంతం కావడంతో రెస్క్యూ సిబ్బందిని ప్రధాని నరేంద్ర మోదీ అభినందించారు. వారి ధైర్యసాహసాలు మా కార్మిక సోదరులకు కొత్త జీవితాన్ని ఇచ్చాయి అన్నారు.


Also Read: Uttarkashi Tunnel Rescue Operation: రూ.18 వేల జీతం కోసం సొంతూరు వదిలి, కన్నీళ్లు పెట్టిస్తున్న కార్మికుల కథలు


ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. *T&C Apply