Cent Bank Home Finance Limited Notification: ముంబయిలోని సెంట్‌ బ్యాంక్‌ హోం ఫైనాన్స్‌ లిమిటెడ్(CBHFL), దేశవ్యాప్తంగా ఉన్న వివిధ శాఖల్లో ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 60 ఆఫీసర్, సీనియర్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. సరైన అర్హతలున్నవారు ఆన్‌లైన్ ద్వారా డిసెంబరు 11లోగా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది. 

వివరాలు..

ఖాళీల సంఖ్య: 60.

పోస్టుల కేటాయింపు: ఎస్సీ-12, ఎస్టీ్-12, ఓబీసీ-15, ఈడబ్ల్యూఎస్-03, యూర్(జనరల్)-18.

➥ ఆఫీసర్‌: 31 పోస్టులు

అర్హత: ఏదైనా డిగ్రీతోపాటు కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి.

అనుభవం: ఏదైనా హౌసింగ్ ఫైనాన్స్ సంస్థలో కనీసం ఏడాది అనుభవం ఉండాలి.

వయోపరిమితి: 21 - 35 సంవత్సరాల మధ్య ఉండాలి. నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి. ఎస్సీ, ఎస్టీలకు 5 సంవత్సరాలు; ఓబీసీలకు 3 సంవత్సరాలు, దివ్యాంగులకు 10 సంవత్సరాలపాటు వయోసడలింపు వర్తిస్తుంది.

➥ సీనియర్‌ ఆఫీసర్‌: 27 పోస్టులు

అర్హత: ఏదైనా డిగ్రీతోపాటు కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి.

అనుభవం: ఏదైనా హౌసింగ్ ఫైనాన్స్ సంస్థలో కనీసం 2 సంవత్సరాల అనుభవం ఉండాలి.

వయోపరిమితి: 21 - 35 సంవత్సరాల మధ్య ఉండాలి. నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి. ఎస్సీ, ఎస్టీలకు 5 సంవత్సరాలు; ఓబీసీలకు 3 సంవత్సరాలు, దివ్యాంగులకు 10 సంవత్సరాలపాటు వయోసడలింపు వర్తిస్తుంది.

➥ సీనియర్‌ ఆఫీసర్‌(హెచ్‌ఆర్‌): 01 పోస్టు

అర్హత: ఏదైనా డిగ్రీతోపాటు ఎంబీఏ(హెచ్‌ఆర్‌) అర్హత ఉండాలి. కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి.

అనుభవం: సంబంధిత విభాగంలో కనీసం 2 సంవత్సరాల అనుభవం ఉండాలి.

వయోపరిమితి: 21 - 35 సంవత్సరాల మధ్య ఉండాలి. నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి. ఎస్సీ, ఎస్టీలకు 5 సంవత్సరాలు; ఓబీసీలకు 3 సంవత్సరాలు, దివ్యాంగులకు 10 సంవత్సరాలపాటు వయోసడలింపు వర్తిస్తుంది.

➥ సీనియర్‌ ఆఫీసర్‌ (కంప్లైన్స్‌): 01 పోస్టు

అర్హత: కంపెనీ సెక్రటరీ(ఎగ్జిక్యూటివ్‌) ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. డిగ్రీతోపాటు కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి.

అనుభవం: సంబంధిత విభాగంలో కనీసం 2 సంవత్సరాల అనుభవం ఉండాలి.

వయోపరిమితి: 21 - 35 సంవత్సరాల మధ్య ఉండాలి. నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి. ఎస్సీ, ఎస్టీలకు 5 సంవత్సరాలు; ఓబీసీలకు 3 సంవత్సరాలు, దివ్యాంగులకు 10 సంవత్సరాలపాటు వయోసడలింపు వర్తిస్తుంది.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

దరఖాస్తు ఫీజు: రూ.500. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు రూ.200 చెల్లిస్తే సరిపోతుంది.

ఎంపిక విధానం: కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా.

పరీక్ష విధానం: మొత్తం 200 మార్కులకు ఆన్‌లైన్ రాతపరీక్ష నిర్వహిస్తారు. పరీక్షలో మొత్తం 150 ప్రశ్నలు ఉంటాయి. ఇందులో రీజనింగ్-50 ప్రశ్నలు-75 మార్కులు, ఇంగ్లిష్ లాంగ్వేజ్-50 ప్రశ్నలు-50 మార్కులు, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్-50 ప్రశ్నలు-75 మార్కులు ఉంటాయి. పరీక్ష సమయం 120 నిమిషాలు. ఇంగ్లిష్, హిందీ మాధ్యమాల్లో ప్రశ్నలు ఉంటాయి. రాతపరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు తర్వాతి దశలో ఇంటర్వ్యూ నిర్వహిస్తారు.

జీతం: ఆఫీసర్ పోస్టులకు ఏడాదికి రూ.3.60 లక్షలు, సీనియర్ ఆఫీసర్ పోస్టులకు ఏడాదికి రూ.4 లక్షలు చెల్లిస్తారు.

పరీక్ష కేంద్రాలు: బెంగళూరు, భోపాల్, ఢిల్లీ/ఢిల్లీ ఎన్‌సీఆర్, ముంబయి/నేవీ ముంబయి/థానే/ఎంఎంఆర్ రీజియన్, చెన్నై.

ముఖ్యమైన తేదీలు..

➥ ఆన్‌లైన్‌ దరఖాస్తు చివరి తేదీ: 11.12.2023.

➥ ఫీజు చెల్లించడానికి చివరితేది: 11.12.2023.

➥ దరఖాస్తు ప్రింట్ తీసుకోవడానికి చివరితేది: 26.12.2023.

ఆన్‌లైన్ పరీక్ష తేది: జనవరి, 2024లో.

Notification

Online Applicaton

Website

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి... 

ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. 🏆
*T&C Apply*