G20 Summit 2023: 



సెప్టెంబర్ 7న ఘటన..


సెప్టెంబర్ 9,10 వ తేదీల్లో ఢిల్లీలో G20 సదస్సు జరిగింది. ఎలాంటి అవాంతరాలు రాకుండా పక్కా భద్రతా ఏర్పాట్లు చేసింది కేంద్ర ప్రభుత్వం. అనుకున్న విధంగానే ఈ సమ్మిట్ సక్సెస్ అయింది. అయితే...అప్పుడు జరిగిన ఓ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సెప్టెంబర్ 7న 12 గంటల పాటు సెక్యూరిటినీ పరుగులు పెట్టించింది ఓ బ్యాగ్. ఓ ఫైవ్‌స్టార్ హోటల్‌లో చైనా ప్రతినిధులు చెకిన్ అయ్యారు. ఆ సమయంలో ఆ టీమ్‌లోని ఓ వ్యక్తి అనుమానాస్పదంగా బ్యాగ్ పట్టుకుని కనిపించాడు. బ్యాగ్‌లు తీసుకెళ్లేందుకు అనుమతినిచ్చింది సెక్యూరిటీ. కానీ...అది అనుమానాస్పదంగా కనిపించడం కలకలం రేపింది. ఒకటి కాదు..ఏకంగా రెండు బ్యాగ్‌లున్నాయి. అందులో కొన్ని పరికరాలు కూడా కనిపించాయి. వీటిని గుర్తించిన వెంటనే స్కాన్ చేయాలని సెక్యూరిటీ సిబ్బంది ఆ ప్రతినిధులకు చెప్పింది. కానీ అందుకు వాళ్లు అంగీకరించలేదు. దీనిపై దాదాపు 12 గంటల పాటు వాగ్వాదం జరిగింది. లోపలకి తీసుకెళ్లేందుకు సిబ్బంది ఒప్పుకోలేదు. స్కానింగ్ చేసేందుకు ఆ చైనా ప్రతినిధులు ఒప్పుకోలేదు. పోలీసులూ వచ్చి వాళ్లకు అర్థమయ్యేలా చెప్పేందుకు చాలానే ప్రయత్నించారు. అయినా వాళ్లు ఏ మాత్రం వెనక్కి తగ్గలేదు. ఆ తరవాత చేసేదేమీ లేక ఆ బ్యాగ్‌లను చైనా ఎంబసీ కార్యాలయానికి పంపారు. ఈ బ్యాగ్‌లను స్కాన్ చేసేందుకు సెక్యూరిటీ సిబ్బంది వాళ్ల గది బయటే దాదాపు 12 గంటల పాటు ఎదురు చూశారు. అయినా వాళ్లు బ్యాగ్‌లు అప్పగించలేదు. ఎంబసీకి వెళ్లాక కానీ ఈ విషయం వెలుగులోకి రాలేదు. మొత్తానికి ఆ బ్యాగ్‌లు ఎంబసీకి వెళ్లిపోయాక భద్రతా సిబ్బంది ఊపిరి పీల్చుకుంది. 


G20 సదస్సు జరిగిన సమయంలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ కాన్వాయ్‌లోని ఓ డ్రైవర్‌ని అరెస్ట్ చేశారు పోలీసులు. డ్రైవింగ్ చేసే క్రమంలో నిర్లక్ష్యం వహించడంపై బైడెన్ సెక్యూరిటీ సీరియస్ అయింది. వెంటనే అతడిని తొలగించింది. ఆ తరవాత కాసేపు ప్రశ్నించి వదిలేసింది. ఇంతగా సీరియస్ అవ్వడానికి ఓ కారణముంది. బైడెన్ కాన్వాయ్‌లోని ఓ కార్‌ అనుకోకుండా తాజ్‌ హోటల్‌లోకి వచ్చింది. యూఏఈ ప్రెసిడెంట్ మహమ్మద్ బిన్ జాయేద్ అల్ నహ్యాన్ అక్కడే బస చేస్తున్నారు. అక్కడికి మరే కార్‌నీ అనుమతించరు. కానీ...బైడెన్ కాన్వాయ్‌లోని ఓ డ్రైవర్‌ ఉన్నట్టుండి తాజ్‌ హోటల్‌లోకి వెళ్లిపోయాడు. ఇది గమనించిన సెక్యూరిటీ వెంటనే అప్రమత్తమైంది. కార్‌ని ఆపి డ్రైవర్‌ని నిలదీసింది. ITC మౌర్య హోటల్ అనుకుని తెలియక లోపలకు వచ్చేశానని వివరణ ఇచ్చాడు ఆ డ్రైవర్. కరెక్ట్‌ టైమ్‌కి అక్కడ ఉండాలని, అందుకే వచ్చాని చెప్పాడు. జో బైడెన్ ITC మౌర్యలో బస చేశారు. అదే హోటల్ అనుకుని తాజ్ హోటల్‌లోకి ఎంటర్ అయ్యాడు ఆ డ్రైవర్. అక్కడే ఓ బిజినెస్‌మేన్‌ని డ్రాప్ చేశాడు. ప్రోటోకాల్‌ సరిగ్గా తెలియకపోవడం వల్ల వచ్చిన సమస్య ఇది. కాసేపు అతడిని ప్రశ్నించి ఆ తరవాత వదిలేశారు. 


Also Read: మా ఫుల్‌ సపోర్ట్ మీకే, ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధాన్ని సమర్థించిన కిమ్ - పుతిన్‌తో స్పెషల్ మీటింగ్