IT Firm Owner Gifts Cars:



50 కార్‌లు గిఫ్ట్..


చెన్నైలోని ఓ ఐటీ కంపెనీ ఓనర్ ఉద్యోగులకు అదిరిపోయే గిఫ్ట్‌లు ఇచ్చాడు. 50 మందికి కార్‌లు కానుకగా ఇచ్చేశాడు. ఎంప్లాయిస్‌ పట్ల ఉన్న అభిమానాన్ని ఇలా చాటుకున్నాడు. 2009లో ఈ కంపెనీ ప్రారంభమైంది. అప్పటి నుంచి దాదాపు 15 ఏళ్లుగా ఈ కంపెనీలోనే పని చేస్తున్న వాళ్లున్నారు. మధ్యలో సంస్థ ఎన్నో ఒడుదొడుకులు ఎదుర్కొంది. ఆ సమయంలోనూ ఉద్యోగులు అండగా నిలబడ్డారు. సంస్థను మళ్లీ గాడిలో పెట్టారు. ఈ సపోర్ట్‌ ముచ్చటపడిపోయాడు ఓనర్. ఎలాగైనా వాళ్లకు థాంక్స్ చెప్పాలనుకున్నాడు. కాస్త ఖర్చైనా పర్లేదు...చాన్నాళ్ల పాటు గుర్తు పెట్టుకునేలా గిఫ్ట్‌లు ఇవ్వాలని ఫిక్స్ అయ్యాడు. అలా ఆలోచించే సమయంలోనే కార్‌లు కొనాలన్న థాట్ వచ్చింది. వెంటనే 50 రకరకాల కార్‌లను బుక్ చేశాడు. అందరికీ గిఫ్ట్ చేశాడు. ఇప్పుడే కాదు. గతేడాది ఏకంగా 100 కార్లు కానుకగా ఇచ్చాడు. వాళ్ల హార్డ్‌వర్క్‌కి ఎంత చేసినా తక్కువే అని చెబుతున్నాడు. 


"నేను నా భార్య కలిసి ఈ కంపెనీని 2009లో ప్రారంభించాం. షేర్‌లన్నీ మా పేరిటే ఉన్నాయి. ఇప్పుడు ఆ షేర్‌లను కన్వర్ట్ చేయాలని అనుకుంటున్నాం. కంపెనీలో ఎన్నో ఏళ్లుగా పని చేస్తున్న వారికి ఈ షేర్‌లు ఇవ్వాలనుకుంటున్నాం. 33% షేర్‌లు ఇవ్వాలని నిర్ణయించుకున్నాం. దీంతో పాటు వెల్త్ షేరింగ్ ప్రోగ్రామ్‌లో భాగంగా 50 కార్‌లు కొని గిఫ్ట్‌గా ఇచ్చాం"


- కంపెనీ యజమాని


Also Read: రామాయణంలో ఉన్నదే చెప్పాను, మనోభావాలు దెబ్బ తీయడం నా ఉద్దేశం కాదు - NCP నేత జితేంద్ర క్లారిటీ