China Pneumonia Cases Hike:


చైనాలో న్యుమోనియా..


చైనాలో న్యుమోనియా కేసులు (China Pneumonia Cases) పెరుగుతున్న నేపథ్యంలో కేంద్రం..రాష్ట్ర ప్రభుత్వాలను అప్రమత్తం చేసింది. ప్రజారోగ్య శాఖలు సిద్ధంగా ఉండాలని ఆదేశించింది. ఎలాంటి విపత్తు ఎదురైనా వెంటనే చర్యలు తీసుకునేందుకు అన్నీ సిద్ధం చేసుకోవాలని తేల్చి చెప్పింది. ప్రస్తుతానికి ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, కానీ ఉన్నట్టుండి ఇక్కడ అవే పరిస్థితులు వస్తే అందుకు తగ్గట్టుగా ముందుగానే ఏర్పాట్లు చేసుకోవాలని సూచించింది. కేంద్ర ఆరోగ్యశాఖ సెక్రటరీ పలు ఆదేశాలు జారీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు లేఖ రాశారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న వైద్య సౌకర్యాలను రివ్యూ చేసుకోవాలని తెలిపారు. హాస్పిటల్ బెడ్స్, డ్రగ్స్, వ్యాక్సిన్‌లు, మెడికల్ ఆక్సిజన్, యాంటీబయోటిక్స్, టెస్టింగ్ కిట్స్‌ అన్నీ అందుబాటులో ఉంచుకోవాలని సూచనలు చేశారు. ఆక్సిజన్ ప్లాంట్స్, వెంటిలేటర్స్ ఎన్ని ఉన్నాయో ఓ సారి రివ్యూ చేసుకోవాలని ఆదేశించారు. కొవిడ్ వైరస్ సృష్టించిన సమస్యల్ని దృష్టిలో పెట్టుకుని భవిష్యత్‌ సంక్షోభాలను ఎదుర్కొనేందుకు చాలా అప్రమత్తంగా ఉండాలని ఇప్పటికే కేంద్రం స్పష్టం చేసింది. Operational Guidelines ని అమలు చేయాలని ఇప్పటికే తేల్చి చెప్పింది. శ్వాసకోశ సమస్యలు కలిగించే పాథోజెన్స్‌పై నిఘా పెట్టాలని సైంటిస్ట్‌లకూ సూచించింది. ఇన్‌ఫ్లుయెంజా తరహా వ్యాధులతో పాటు  (influenza-like illness)  severe acute respiratory illness (SARI) పైనా జిల్లా స్థాయిలో నిఘా అవసరమని కేంద్రం అలెర్ట్ చేసింది. చలికాలం కావడం వల్ల ఈ ఫ్లూ కేసులు పెరిగే అవకాశముందని తెలిపింది. 


"చలికాలంలో ఫ్లూ కేసులు పెరిగే అవకాశముంది. అందుకే రాష్ట్ర ప్రభుత్వాలన్నీ అప్రమత్తంగా ఉండాలి. ఇన్‌ఫ్లుయెంజా తరహా వ్యాధులు వ్యాప్తి చెందే ప్రమాదముంది. చైనాలో ఉన్నట్టుండి న్యుమోనియా కేసులు పెరుగుతున్నాయి. అక్కడి పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నాం. ఎలాంటి విపత్తు వచ్చినా ఎదుర్కొనేందుకు భారత్ సిద్ధంగానే ఉంది"


- కేంద్ర ఆరోగ్య శాఖ


ఢిల్లీలోని Ram Manohar Lohia Hospital డైరెక్టర్‌ డాక్టర్ అజయ్ శుక్లా (Dr Ajay Shukla) పలు సూచనలు చేశారు. ఇన్‌ఫెక్షన్ సోకే ముప్పు నుంచి తప్పించుకునేందుకు కొన్ని జాగ్రత్తలు పాటించాలని తెలిపారు. వ్యక్తిగత శుభ్రత చాలా ముఖ్యమని తేల్చి చెప్పారు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు పడుతున్న వ్యక్తులకు కాస్త దూరంగా ఉండాలని సూచించారు. ఇది మరీ ప్రమాదకరమైన ఇన్‌ఫెక్షన్ కాదని, కేవలం అనారోగ్యానికి గురవుతారని వివరించారు శుక్లా. భారత్‌లో ప్రస్తుతానికి ఈ కేసులు నమోదయ్యే అవకాశాలు లేవని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు. 


"ఎవరైనా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతున్నా...వాళ్లకు ఇన్‌ఫెక్షన్ సోకిందన్న అనుమానమున్నా కాస్త భౌతిక దూరం పాటించండి. ఇప్పటికే కాలుష్య సమస్యతో చాలా సతమతం అవుతున్నాం. బయటకు వెళ్లాల్సి వస్తే కచ్చితంగా మాస్క్‌ ధరించండి. N95 లేదా N99 మాస్క్‌లు పెట్టుకుంటే మంచిది. చేతులు శుభ్రంగా ఉంచుకోండి"


- డా. అజయ్ శుక్లా, వైద్య నిపుణులు


Also Read: Mann Ki Baat Highlights:పెళ్లి చేసుకోడానికి విదేశాల వరకూ వెళ్లడం అవసరమా - కొత్త ట్రెండ్‌పై ప్రధాని మోదీ అసంతృప్తి


ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. *T&C Apply