Kerala Stampade Tragedy:
యూనివర్సిటీలో తొక్కిసలాట..
కేరళలోని కొచ్చి వర్సిటీలో జరిగిన తొక్కిసలాటలో (Kerala Stampade Tragedy) నలుగురు విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. 50 మందికి పైగా గాయపడ్డారు. ఓపెన్ ఆడిటోరియంలో సింగర్ నిఖితా గాంధీ కన్సర్ట్ జరుగుతుండగా...ఉన్నట్టుండి వాన కురిసింది. ఆ సమయంలో ఒక్కసారిగా విద్యార్థులంతా పరుగులు పెట్టారని, తొక్కిసలాట జరగడానికి ఇదే కారణమని పోలీసులు ప్రాథమికంగా వెల్లడించారు. Cochin University of Science and Technology లో ఈ ఘటన జరిగింది. ఈ ఓపెన్ ఆడిటోరియమ్‌కి ఒకటే ఎంట్రీ, ఎగ్జిట్ డోర్ ఉంది. పాస్‌లున్న వాళ్లను బ్యాచ్‌ల వారీగా లోపలికి పంపారు నిర్వాహకులు. అప్పటికే ఎంట్రీ గేట్ వద్ద భారీ క్యూ ఉంది. చాలా మంది తోసుకుని లోపలికి రావాలని చూశారు. జనం భారీగా తరలి రావడం వల్ల పాస్ ఉన్న వాళ్లనూ లోపలికి రాకుండా నిర్వాహకులు అడ్డుకున్నారు. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం...ఆడిటోరియంలో వెయ్యి మంది కూర్చుని చూడగలిగే కెపాసిటీ ఉంది. కానీ తొక్కిసలాట జరిగే సమయానికి చాలా వరకూ సీట్‌లు ఖాళీగానే ఉన్నాయి. అప్పటికి ప్రోగ్రామ్ స్టార్ట్ కూడా అవలేదు. లోపలికి వచ్చిన వాళ్ల పాస్‌లు చెక్ చేస్తూ ఆడిటోరియంలోకి పంపిస్తున్నారు. అప్పుడే ఒక్కసారిగా వర్షం కురిసింది. వెంటనే క్యూని వదిలేసి లోపలికి తోసుకుని వచ్చారు.
"ఒక్కసారిగా వర్షం కురిసింది. ఆ సమయానికి ఏం చేయాలో అర్థం కాక అంతా పరుగులు పెట్టారు. లోపలికి తోసుకుని వచ్చారు. అక్కడే మెట్లు కూడా ఉన్నాయి. ఒకరిపై ఒకరు పడిపోయారు. అక్కడికక్కడే నలుగురు చనిపోయారు. నిజానికి ఈ ప్రమాదం జరిగి ఉండాల్సింది కాదు. ఆడిటోరియంలో చాలా సీట్లు ఖాళీగానే ఉన్నాయి. కేవలం వర్షం పడడం వల్ల తోపులాట జరిగింది"
- పోలీసులు
మరో కారణమూ..
దీంతో పాటు మరో కారణమూ ఈ ప్రమాదానికి కారణమైందని కొందరు చెబుతున్నారు. ముందుగా ఆడిటోరియంలోకి ఇంజనీరింగ్ విద్యార్థులను అనుమతించారు నిర్వాహకులు. మిగతా విభాగాలకు చెందిన విద్యార్థులు బయటే వేచి చూశారు. అప్పుడే వాన కురిసింది. క్యూ నుంచి తప్పించుకుని లోపలికి వెళ్లిపోవడానికి ఇదే అదనుగా భావించారు. అప్పుడే తోపులాట జరిగింది.
కొచ్చిన్ యూనివర్శిటీ ఆఫ్ సైన్స్&టెక్నాలజీలో జరిగిన ఫెస్ట్ లో తొక్కిసలాట ఘటనపై కేంద్ర మాజీ మంత్రి శశిథరూర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వర్షం పడిన కారణంగా వర్సిటీ క్యాంపస్ లో తొక్కిసలాట జరిగి నలుగురు విద్యార్థులు ప్రాణాలు కోల్పోవడం బాధాకరం అన్నారు. విద్యార్థుల మృతిపట్ల సంతాపం ప్రకటిస్తూ, వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
Also Read: Mann Ki Baat: ఆ రోజుని దేశం ఎప్పటికీ మరిచిపోలేదు, 26/11 దాడులపై ప్రధాని మోదీ వ్యాఖ్యలు
ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. *T&C Apply