Sri Lanka Crisis: శ్రీలంక సంక్షోభంపై కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ప్రజెంటేషన్‌లో, శ్రీలంకలో ప్రస్తుత పరిస్థితికి కారణమైన విషయాలను తెలిపింది. ఈ దేశంలోని ప్రస్తుత రాజకీయ పరిస్థితుల గురించి వివరించింది. అలాగే స్థాయికి మించి అపరిమితంగా చేసిన అప్పులే.. ఆ దేశ సంక్షోభానికి కారణమంటూ విశ్లేషణాత్మకంగా వివరించింది. ఈ క్రమంలోనే భారత దేశంలోని కొన్ని రాష్ట్రాలు చేస్తున్న అప్పులు, పర్యవసానాలపై కూడా విదేశీ వ్యవహరాల మంత్రిత్వ శాఖ అధికారులు రెండవ ప్రజెంటేషన్ ఇచ్చారు.
10 రాష్ట్రాల పేరు ప్రస్తావించిన కేంద్ర ప్రభుత్వం..
ఈ క్రమంలోనే కేంద్ర ఆర్థిక శాఖ అధికారులు ఆంధ్ర ప్రదేశ్ సహా దేశంలోని 10 రాష్ట్రాల ఆర్థిక పరిస్థితులపై పవర్ పాయింట్ ప్రెజంటేషన్ ఇచ్చారు. దేశంలోని మిగతా రాష్ట్రాల స్థితిగతులను ప్రదర్శించారు. ఆంధ్ర ప్రదేశ్, బిహార్, హరియాణా, ఝార్ఖండ్, కేరళ, మధ్య ప్రదేశ్, పంజాబ్, రాజస్థాన్, ఉత్తర ప్రదేశ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలు ఆర్థిక క్రమశిక్షణ పాటించాల్సిన అవసరం ఉందని తెలియ జేశారు. ఏపీ రుణాలు జీఎస్డీపీలో 32 శాతానికి చేరినట్లు తెలిపారు. ఆంధ్ర ప్రదేశ్, బిహీర్, రాజస్థాన్, పంజాబ్ రాష్ట్రాలు రుణ, ఆర్థిక కొలమానాలను దాయటాయన్నారు. అలగే తెలంగాణ రుణాలు కూడా జీఎస్డీపీలో 25 శాతానికి చేరినట్లు పేర్కొన్నారు.
టీఆర్ఎస్, వైసీపీ, డీఎంకే, తృణమూల్ నేతల అభ్యంతరం..
శ్రీలంక సంక్షోభంపై కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ప్రజెంటేషన్‌లో, భారతదేశంలోని వివిధ రాష్ట్రాల ఆర్థిక పరిస్థితిపై ఇచ్చిన డేటాపై అనేక రాజకీయ పార్టీలు అభ్యంతరాలు వ్యక్తం చేశాయి. వైఎస్ఆర్ సిపీ, టీఆర్ఎస్, టీఎంసీ, ఏఐఎంఐఎం, డీఎంకే అభ్యంతరాలు వ్యక్తం చేశాయి. శ్రీలంక పరిస్థితిపై ఏర్పాటు చేసిన సమావేశంలో జీడీపీకి సంబంధించి రాష్ట్రాల అప్పుల భారం లెక్కలపై చర్చించడం సరికాదని ఈ పార్టీల నేతలు అంటున్నారు. అవసరమైతే ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయాలన్నారు. కొన్ని రాష్ట్రాల లెక్కలను గాలికొదిలేస్తున్నారని అని అభ్యంతరాలు వ్యక్తం చేశాయి. రాష్ట్రాల అప్పుల లెక్కలపై చర్చ తో పాటు.. కేంద్ర ప్రభుత్వ అప్పుల లెక్కలపై కూడా చర్చ జరగాలని డిమాండ్ చేశారు.
డేటా ఆధారంగానే మాట్లాడాం.. ఎలాంటి రాజకీయ కుట్ర లేదు!
శ్రీలంకలో అస్థిరత పరిస్థితి గురించి ఆందోళన ఉందిని... మిగతా దేశాల కంటే భారత్ శ్రీలంకకు ఎక్కువ సాయం చేసిందని విదేశాంగ మంత్రి జై శంకర్ అన్నారు. భారత్‌లో కూడా ఇలాంటి పరిస్థితి వస్తుందేమోనని ప్రజలు ఆందోళన చెందారని తెలిపారు. ఆర్థిక మంత్రిత్వ శాఖతో కలిసి వివరణ ఇచ్చాంమని కేంద్ర విదేశాంగ మంత్రి జైశంకర్ తెలిపారు. భారత దేశంలోని వివిధ రాష్ట్రాల్లో అప్పుల పరిస్థితి ఎలా ఉందో ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపిందన్నారు. శ్రీలంక వంటి పరిస్థితిలోకి, భారతదేశం వెళ్తుందని మేము అనుకోము. కానీ ఆర్థిక సంస్కరణలు మరియు క్రమశిక్షణను అనుసరించడమే శ్రీలంకలో పరిస్థితి నుంచి తీసుకోవాల్సిన పాఠం అని తెలియజేయాలని ప్రయత్నించామన్నారు. రాష్ట్రాల డేటా చూపించడం వెనుక ఎలాంటి రాజకీయ కుట్ర లేదుని స్పష్టం చేశారు.