ఆర్మీ హెలికాప్టర్‌ ప్రమాదంలో త్రివిధ దళాధిపతి జనరల్ బిపిన్ రావత్ మరణించిన సంగతి తెలిసిందే. ఆయనతో పాటు మొత్తం 13 మంది ఆర్మీ ఉన్నతాధికారులు మరనించారు. ఈ దుర్వార్త విని దేశమంతా విషాదం అలుముకుంది. అయితే, వారు ప్రయాణించిన ఎంఐ-17 హెలికాప్టర్ చివరి దృశ్యాలు ఇప్పుడు బయటికి వచ్చాయి. సరిగ్గా ప్రమాదం జరిగేందుకు ఒక నిమిషం ముందు కింది నుంచి తీసిన వీడియోలు వెలుగులోకి వచ్చాయి. అదే ప్రాంతంలో ఉన్న స్థానికులు ఆ వీడియోలను తమ సెల్ ఫోన్లలో బంధించారు. హెలికాప్టర్ ప్రయాణిస్తూ దట్టమైన పొగమంచులో కనుమరుగు కావడం ఆ వీడియోలో కనిపిస్తోంది. కింద ఉన్న స్థానికులు కూడా ఏదో పెద్ద శబ్దంతో భయంతో వెళ్లిపోతున్నట్లు వీడియోలు బయటకు వచ్చాయి.







తమిళనాడులోని కునూరు అటవీ ప్రాంతంలో ఈ ఎంఐ-17 ఆర్మీ హెలీకాప్టర్ కూలిపోయింది. ఈ ప్రమాదంలో త్రివిధ దళాధిపతి బిపిన్ రావత్, ఆయన భార్య మధులిక రావత్ సహా 13 మంది ప్రాణాలు కోల్పోయారు. చిత్తూరు జిల్లాకు చెందిన ఓ సైనికుడు కూడా అదే హెలికాప్టర్‌లో ఉండి మరణించారు.


నేడు ఢిల్లీకి భౌతిక కాయాలు
హెలికాప్టర్ ప్రమాదంలో మృతి చెందిన బిపిన్ రావ‌త్‌, ఆయన సతీమణి మృతదేహాలను గురువారం ఢిల్లీ తీసుకువెళ్లనున్నారు. శుక్రవారం  ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు ప్రజలకు అంతిమ నివాళులర్పించేందుకు అనుమతిస్తారు. ఆ తర్వాత ఢిల్లీ కంటోన్మెంట్‌లోని బ్రార్ స్క్వేర్ శ్మశానవాటిక వరకు అంతిమయాత్ర సాగనుంది. అంత్యక్రియల ఊరేగింపు కామరాజ్ మార్గ్ నుండి ప్రారంభమవుతుంది. గురువారం సాయంత్రంలోగా వారి పార్థివ దేహాన్ని సైనిక విమానంలో దేశ రాజధానికి తీసుకు వచ్చే అవకాశం ఉంది.


 






Also Read: Bipin Rawat: "అగ్గిపెట్టె" కారణంగా ఎన్డీఏలోకి రావత్‌ ఎలా వచ్చారు?


Also Read: CDS Bipin Rawat Helicopter Crash: సీడీఎస్ హెలికాప్టర్ ప్రమాదంపై రక్షణ మంత్రి రాజ్‌నాథ్ ప్రకటన


Also Read: Mi 17V Helicopter : వరల్డ్ బెస్ట్ హెలికాఫ్టర్లలో ఒకటి Mi-17V-5 ..! మరి ప్రమాదం ఎలా జరిగింది ?


Also Read: CDS Bipin Rawat Chopper Crash: బిపిన్ రావత్.. ఆర్మీ లెజెండ్.. వెన్నుచూపని యోధుడు!


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి