Delhi Metro:
రెండు బాటిళ్ల లిక్కర్..
ఢిల్లీ మెట్రో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రయాణికులు ఇకపై రెండు బాటిళ్ల లిక్కర్‌ని తీసుకెళ్లేందుకు అనుమతినిచ్చింది. రెండు సీల్డ్ బాటిల్స్‌ని తీసుకెళ్లొచ్చని వెల్లడించింది. అయితే...మెట్రోలో మద్యం సేవించడంపైన మాత్రం నిషేధం అలాగే కొనసాగుతుందని స్పష్టం చేసింది. ఇన్నాళ్లూ ఒక్క Airport Express Lineలో తప్ప మిగతా మార్గాల్లో ఆల్కహాల్ క్యారీ చేయడంపై బ్యాన్ విధించిన ఢిల్లీ మెట్రో...ఇప్పుడు దాన్ని ఎత్తివేస్తున్నట్టు ప్రకటించింది.
"సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్, ఢిల్లీ మెట్రో రైల్ అధికారులతో ప్రత్యేకంగా ఓ కమిటీ ఏర్పాటు చేశారు. పాత లిస్ట్‌ని రివ్యూ చేసిన తరవాత కీలక నిర్ణయం తీసుకున్నారు. ఒక్కో ప్రయాణికుడు లేదా ప్రయాణికురాలు రెండు సీల్డ్ బాటిల్స్ ఆల్కహాల్‌ని తీసుకెళ్లేందుకు అనుమతినిచ్చారు. ఎయిర్‌పోర్ట్ ఎక్స్‌ప్రెస్ లైన్‌కి మాత్రమే ఇన్నాళ్లు ఇది పరిమితమైంది"
- ఢిల్లీ మెట్రో అధికారి
ఇదే సమయంలో ప్రయాణికులు మెట్రోలో ట్రావెల్ చేసేటప్పుడు క్రమశిక్షణతో ఉండాలని, మెట్రో రూల్స్‌కి కట్టుబడి ఉండాలని స్పష్టం చేశారు అధికారులు. మద్యం సేవించినా, మద్యం మత్తులో మెట్రో ఎక్కి అనుచితంగా ప్రవర్తించినా కఠిన చర్యలు తీసుకుంటామని వెల్లడించింది.
మెట్రోలో కొట్టుకున్న యువకులు..
ఢిల్లీ మెట్రో గత కొన్ని నెలలుగా అనేక కారణాల వల్ల వార్తల్లో నిలుస్తోంది. తాజాగా మరోసారి వార్తల్లోకి ఎక్కింది. బ్యాగ్‌లు ధరించిన ఇద్దరు యువకులు మెట్రో కోచ్‌లో.. కొట్టుకున్నారు. ప్రయాణికులంతా వీరి ఫైట్ కు దూరంగా ఉండగా.. కొందరు మాత్రం వారిని ఆపే ప్రయత్నం చేశారు. కానీ వాళ్లు మాత్రం అస్సలే ఆగలేదు. ఒకరినొకరు విపరీతంగా అసభ్య పదజాలం వాడుతూ దూషించుకున్నారు. కొట్టుకున్నారు. అక్కడే ఉన్న పలువురు వీరి గొడవను వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టారు. అది కాస్తా నెట్టింట వైరల్ గా మారింది. సచిన్ భరద్వాజ్ (Sachin Bharadwaj) అనే వ్యక్తి ఈ వీడియోను ట్విట్టర్ వేదికగా షేర్ చేయగా.. వేలల్లో వ్యూస్ వందల్లో కామెంట్లు వచ్చాయి. ఒక్కొక్కరూ ఒక్కో విధంగా స్పందిస్తున్నారు. ఓ నెటిజెన్ స్పందిస్తూ.. "ఏదేమైనా ప్రశాంతంగా ఉండండి.. మీ జీవితంలో తక్కువ సమస్యలు ఉన్నాయా" అంటూ కామెంట్ చేశారు. అలాగే మరో వ్యక్తి అన్ని వయసుల వారికి ఆనందం ఢిల్లీమెట్రోసర్వీస్‌లో అందుబాటులో ఉందంటూ తెలిపారు. ఈ క్రమంలోనే ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ (డీఎంఆర్‌సీ) ఓ ప్రకటన విడుదల చేసింది.మెట్రోలో ప్రయాణిస్తున్నప్పుడు ప్రయాణికులు బాధ్యతాయుతంగా నడుచుకోవాలని కోరుతున్నట్లు వెల్లడించారు.