జమ్మూకశ్మీర్‌లో రోడ్లు ఎలా ఉంటాయి? అక్కడ అంతా కొండ ప్రాంతాలే కాబట్టి డ్రైవింగ్‌లో ఢక్కా మొక్కీలుతిన్న వారు మాత్రమే బండి నడపగలరు. ప్రయాణికుల్ని తీసుకెళ్లే బస్సు డ్రైవర్లయితే మరింత అప్రమత్తంగా ఉండాలి. కానీఓ డ్రైవర్ అమ్మాయి వచ్చి గోముగా అడిగిందని బస్ స్టీరింగ్ ఇచ్చేశాడు.


ఉధంపూర్ జిల్లాలో ఓ బస్ డ్రైవర్ బస్ నిండా ప్రయాణికులు ఉన్నప్పటికీ సరదా పడిందని అమ్మాయికి స్టీరింగ్ ఇచ్చేశాడు. ఆ డ్రైవర్ బస్సులో రోజూ స్కూలు పిల్లల్ని తీసుకెళ్తూ ఉంటాడు. అలా స్కూల్‌కు వెళ్లి వచ్చే వారిలో ఓ అమ్మయికూడా ఉంది. ఆ అమ్మాయి రోజూ మాటలు చెబుతూ ఉంటుంది. తనకు డ్రైవింగ్ నేర్పించాలని కోరింది. ఆ డ్రైవర్ కూడా అంగీకరించాడు. కొంత డ్రైవింగ్ కూడా నేర్పాడు. 


తరచూ ఆమెచేతికి స్టీరింగ్ ఇచ్చి తాను పక్కన కూర్చుని సూపర్ వైజ్ చేయడం ప్రారంభించాడు. ఇది మరీ శృతి మిచిపోవడం ప్రయాణికుల ప్రాణాలతో ఆటలాడటం కావడంతో ఓ సారి బస్సులో ప్రయాణిస్తున్నవారు వీడియో తీసి సోషల్ మీడియాలోపెట్టారు. అంతే క్షణాల్లో వైరల్ అయిపోయింది. 



 అది ఒక కొండ మార్గం. ఏ మాత్రం నిర్లక్ష్యం వహించినా బస్సు లోయలోకి దూసుకెళ్లే ప్రమాదం ఉంది. అయినప్పటికీ ఆ నిర్లక్ష్యంగా సదరు యువతితో బస్సును ప్రమాదకరంగా నడిపించాడు. జమ్ముకశ్మీర్‌ ట్రాన్స్‌పోర్ట్‌ అధికారుల దృష్టికి ఈ విషయం వెళ్లడంతో యువతి డ్రైవ్‌ చేసిన బస్సును సీజ్‌ చేశారు. ఆ డ్రైవర్ డ్రైవింగ్‌ లైసెన్స్‌, వాహనం పర్మిట్‌ను సస్పెండ్‌ చేశారు.  


జమ్మూకశ్మీర్‌లో రోడ్డు ప్రమాదులు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. నైపుణ్యం ఉన్న డ్రైవర్లే ఒక్కో సారి బస్సుల్నికంట్రోల్ చేయలేకపోతూంటారు. అలాంటి రోడ్ల మీద విద్యార్తినికి స్టీరింగ్ ఇచ్చి  ప్రయాణికుల ప్రాణాల్ని రిస్కు్లో పెట్టారు. అయితే ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో  అందరూ ఊపిరి పీల్చుకున్నారు.    అయితే ఆ డ్రైవర్ మాత్రం మరోసారి డ్రైవింగ్ చేసే అవకాశాన్ని కోల్పోయాడు .