సాక్షాత్తూ ప్రధానమంత్రి నరేంద్రమోదీనే ప్రదానమంత్రి కార్యాలయం కోసం టేబుల్ డిజైన్ చేయమని అడిగితే... ఆయన చేయనన్నారట. దానికి కారణాలుగా ఆయన డిజైనర్ చెప్పిన మాటలంటూ సోషల్ మీడియాలో వరైల్ అవుతున్నాయి. ప్రముఖ ఫర్నీచర్‌ డిజైనర్‌ కునాల్‌ మర్చంట్‌ కు పీఎంవోలో శాశ్వత ప్రాతిపదికన  టేబుల్‌ తయారీ కోరుతూ ప్రధానమంత్రి వ్యక్తిగత కార్యదర్శి వివేక్‌ కుమార్‌ నుంచి లేఖ అందింది.  డిజైనింగ్‌ రంగంలో ఆయన ప్రతిభను గుర్తించిన ప్రధాని మోదీ ఈ అవకాశం ఇచ్చినట్లు పేర్కొన్నారు. 


మోదీకి ప్రశంసల గానం - ఇళయరాజాకు రాజ్యసభ పదవి ?


అయితే కునాల్ మర్చంట్ ఈ ఆఫర్‌ను తిరస్కరించారు. 'ముఖ్యమైన పని కోసం నన్ను ఎంచుకున్నందుకు ధన్యవాదాలు. కానీ నా రాజకీయ, సామాజిక అభిప్రాయాల కారణంగా, నేను ఈ ఆఫర్‌ను తిరస్కరించాను. నేను గాంధేయవాదిని, అహింసను నమ్ముతాను. మైనారిటీలకు వ్యతిరేకంగా నిర్ణయాలపై సంతకం చేయడానికి, వారిని దూరం చేయడానికి నేను టేబుల్‌ను తయారుచేసి ఇవ్వలేను. మోడీ ప్రభుత్వం ద్వేషపూరిత వాతావరణాన్ని సృష్టిస్తోంది. మీ రాజకీయాలు మీలో ద్వేషంతో నిండిపోయాయని చూపిస్తున్నాయి. నేను మీ ఆఫీసు కోసం టేబుల్‌ను తయారు చేస్తే, అది మైనారిటీ, దళిత తదితర నేపథ్యాల నుంచి వచ్చిన నా స్నేహితులు, కుటుంబ సభ్యులు, సిబ్బందిని మోసం చేసినట్లే. నేను అది చెయ్యలేను''. అని రిప్లయ్ ఇచ్చారు. ఆయన ఆన్సర్ వైరల్ అయింది. 


భారత్‌లో ఫోర్త్ వేవ్ మొదలైందా ! ఒక్కరోజులో 90 శాతం పెరిగిన పాజిటివ్ కేసులు
 
సోషల్ మీడియాలోనూ కునాల్ మర్చంట్ వైఖరి చర్చనీయాంశమయింది. తకునాల్ వైఖరి తెలిసి కూడా ఆయనకు టేబుల్ ఆర్డర్ ఎలా ఇస్తారన్న అనుమానాలు చాలా మందికి వచ్చాయి. దానికి తగ్గట్లుగానే అసలు ప్రధానమంత్రి కార్యాలయం కునాల్ మర్చంట్‌కు ఎలాంటి టేబుల్ ఆర్డర్ ఇవ్వలేదని ఢిల్లీ పోలీసులు ప్రకటించారు. పిఎంఒ నుంచి కునాల్‌కు వచ్చిన మెయిల్‌ నకిలీదని ఢిల్లీ పోలీసులు ప్రకటించారు. పిఎంఒ ఉద్యోగి ఒకరు నకిలీ గుర్తింపుతో మెయిల్‌ పంపారని, దీనిపై దర్యాప్తు జరుగుతోందని ఢిల్లీ పోలీసు కమిషనర్‌ తెలిపారు.


ప్రధానమంత్రి కార్యాలయానికి టేబుల్ కావాలంటే దానికో ప్రాసెస్ ఉంటుంది. ఇలా నేరుగా కునాల్ మర్చంట్‌ను ఎంపిక చేసుకుని ఆయనను సంప్రదించడం నమ్మశక్యంగా లేదని ఎక్కువ మంది అభిప్రాయపడ్డారు. దానికి తగ్గట్లుగానే ఆ మెయిల్ నకిలీదని తేలింది. అయితే కునాల్ మర్చంట్ ఇచ్చిన సమాధానం మాత్రం ప్రధానికి ఇబ్బందికరమే. సోషల్ మీడియాలో వైరల్ కావడం బీజేపీ నేతల్ని కూడా ఇబ్బంది పెడుతోంది.