దిగ్గజ సంగీత దర్శకుడు ఇళయరాజా ( Ilayaraja ) ను కేంద్ర ప్రభుత్వం రాజ్యసభకు ( Rajya Sabha ) నామినేట్ చేసే అవకాశం కనిపిస్తోంది. రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ (  President ) రాజ్యసభ సభ్యునిగా ఇళయరాజాను నామినేట్ చేయనున్నారని ఢిల్లీ రాజకీయవర్గాల్లో విస్తృతంగా ప్రచారం జరుగుతోంది  ఆరేళ్ల కిందట  సుబ్రమణ్యస్వామిని బీజేపీ రాజ్యసభకు పంపింది. ఆయన పదవీకాలం జూన్‌లో ముగుస్తుంది. ఆయనకు మళ్లీ కొనసాగింపు ఇచ్చే ఉద్దేశంలో బీజేపీ ( BJP ) లేదు. ఆయన స్థానంలో  ఇళయరాజాను రాజ్యసభ సభ్యుడిగా రాష్ట్రపతి నియమించనున్నట్లుగా తెలుస్తోది. అయితే ఇళయారాజాను నేరుగా బీజేపీలో చేర్చుకోవాల్సిన అవసరం లేదు. ఆయనను తటస్థునిగా ఉంచుతూనే పదవి ఇవ్వాలని భావిస్తున్నారు. 


భారత్‌లో ఫోర్త్ వేవ్ మొదలైందా ! ఒక్కరోజులో 90 శాతం పెరిగిన పాజిటివ్ కేసులు


సంగీత, సాహిత్య, వైజ్ఞానికత, ఆర్థిక రంగాలతోపాటు వివిధ రంగాలకు చెందిన ప్రముఖులను.. 12 మందిని రాష్ట్రపతి రాజ్యసభకు నామినేట్‌ చేసే ( Nominate ) అధికారం ఉంది. ఆ స్పెషల్‌ కోటా కిందే.. తాజాగా ఇళయరాజా పేరును రాష్ట్రపతి నామినేట్‌ చేసే అవకాశమున్నట్లు తెలుస్తోంది. సంగీత రంగంలో ఇళయరాజా మ్యాస్ట్రోగా పేరు పొందారు. ఆ రంగంలో రాజ్యభ ఇవ్వాలంటే ఇళయరాజా అర్హతలు సరిగ్గా సరిపోతాయి. కేంద్ర ప్రబుత్వంపై విమర్శలు వచ్చే అవకాశం కూడా ఉండదు. ఇళయరాజా కూడా ఈ విషయంలో  సానుకూలంగా ఉన్నట్లుగా తెలుస్తోంది. 


మరి కొన్ని గంటల్లో మ్యాచ్‌ ఆడాల్సిన ప్లేయర్‌ను మింగేసిన రోడ్డు ప్రమాదం


అంబేద్కర్ జయంతి రోజున ఆయన ప్రధాని మోదీని ( PM MOdi ) ప్రశంసలతో ముంచెత్తారు.'అంబేద్కర్‌ - మోదీ' పుస్తకానికి ముందుమాట రాశారు. ప్రధాని మోదీ.. రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్‌ ఆశయాలను నెరవేరుస్తున్నారని పేర్కొన్నారు. ఆయన చేసిన  వ్యాఖ్యలపై విస్తృత ప్రచారం జరిగింది. అటు విమర్శలతో పాటు ఇటు ప్రశంసలు కూడా వచ్చాయి. తమిళనాట బీజేపీని ఎక్కువ మంది వ్యతిరేకిస్తూ ఉంటారు. ఈ కారణంగా ఆయనపై విమర్శలు ఎక్కువగా వచ్చాయి. అయినప్పటికీ మోదీ విషయంలో ఇళయరాజా సానుకూల అభిప్రాయంతో ఉన్నారు. అందుకే ఆయనకు పదవి దక్కనున్నట్లుగా తెలుస్తోంది. 


భారత్‌లో ఫోర్త్ వేవ్ మొదలైందా ! ఒక్కరోజులో 90 శాతం పెరిగిన పాజిటివ్ కేసులు


బీజేపీలో చేరకుండానే ఇలా రాష్ట్రపతి నామినేట్ చేయడం ద్వారా పలువురు ప్రముఖులు రాజ్యసభ సభ్యులు అయ్యారు. అలాంటివారిలో సుప్రీంకోర్టు మాజీ చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్, సచిన్ టెండూల్కర్ వంటి వారు రాజ్యసభ సభ్యులు అయ్యారు.