BSF Seize Drugs: పశ్చిమ బెంగాల్ దక్షిణ దినాజ్ పూర్ జిల్లాలోని భారత్-బంగ్లాదేశ్ సరిహద్దులో భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్ఎఫ్) జవాన్లు రూ. 12 కోట్లకు పైగా విలువైన డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నారు. ముందస్తు పక్కా సమాచారం మేరకు సరిహద్దు భద్రతా దళం జవాన్లు తనిఖీలు నిర్వహించారు. నార్త్ బెంగాల్ ఫ్రాంటియర్ కు చెందిన 61 బెటాలియన్ బీఎస్ఎఫ్, 151 బెటాయిలన్ బీఎస్ఎఫ్ కు చెందిన బీవోపీ హిలి దళాలు, కస్టమ్స్ అధికారులతో కలిసి భారీ మొత్తంలో డ్రగ్స్ ను పట్టుకున్నారు. నిలిపి ఉంచిన ట్రక్కులో తనిఖీలు చేసిన రూ. 12 కోట్ల విలువైన డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. 


రూ. 49 లక్షల విలువైన యాబా ట్యాబ్లెట్లు, రూ. 11 కోట్లకు పైగా విలువైన 321 గ్రాముల హెరాయిన్ ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ మాదక ద్రవ్యాలు బారత దేశం నుంచి బంగ్లాదేశ్ కు తరలించేందుకు ట్రక్కులో లోడ్ చేసి ఉంచినట్లు అధికారులు గుర్తించారు. ఈ మేరకు పక్కా సమాచారం రావడంతో బీఎస్ఎఫ్ జవాన్లు తనిఖీలు నిర్వహించి డ్రగ్స్ పట్టుకున్నారు. డ్రగ్స్ ను తరలిస్తున్న ట్రక్కును అధికారులు సీజ్ చేశారు. ట్రక్కు యజమానులను ఆకాష్ మొండల్, బబ్లూ ఒరావ్ గా గుర్తించారు. అక్రమ రవాణాకు ఏఎన్ఈ లు చేసే ప్రయత్నాలను అడ్డుకునేందుకు ఆయా సరిహద్దు ప్రాంతాల్లో యాంటీ స్మగ్లింగ్ డ్రైవ్ లు నిర్వహిస్తున్నారు.






వరలక్ష్మీ టిఫిన్ సెంటర్ యజమానితో ప్రేమాయణం


వరలక్ష్మీ టిఫిన్ సెంటర్ డ్రగ్స్ కేసులో షాకింగ్ విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. టిఫిన్ సెంటర్ యజమాని ప్రభాకర్ రెడ్డితో అనురాధ ప్రేమాయణం సాగిస్తోంది. అతడి కోసమే డ్రగ్స్ దందా చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రియుడు కోసం గోవా నుండి డ్రగ్స్ తెప్పిస్తూ.. అక్రమ దందాకు పాల్పడుతోంది. అయితే ఇటీవలే అరెస్ట్ అయిన అనురాధ.. విచారణలో పలువురి పేర్లను వెల్లడించింది. హర్ష వర్ధన్ రెడ్డీ, వీనిత్ రెడ్డి , రవి గోవాలో డ్రగ్స్ నెట్ వర్క్ సూత్రదారులుగా వ్యవహరిస్తున్నారని.. అలాగే నైజీరియన్ కు చెందిన జేమ్స్ పేర్లను అనురాధ వెల్లడించారు.


పది రోజుల క్రితం హైదరాబాద్ నగరంలోని మోకిలలో పోలీసులకు భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. దాదాపు 52 గ్రాముల కోకైన్, 45 ఎల్‌ఎస్‌డీ పిల్స్, 8 గ్రాముల హెరాయిన్‌ను సైబరాబాద్ ఎస్ఓటీ పోలీసులు సీజ్ చేశారు. మోకిల వద్ద డ్రగ్స్ అమ్ముతుండగా ఎస్‌ఓటీ టీమ్ పోలీసులు రెడ్ హ్యాండెడ్‌గా ఆమెను పట్టుకున్నారు. ఓ అమ్మాయితో పాటు మరో ఇద్దరిని అరెస్టు చేశారు. ఎన్డీపీఎస్ యాక్ట్ కింద పోలీసులు వారి మీద కేసు పెట్టారు. వారి నుంచి 48 గ్రాముల ఎండీఎంఏ, మరొక 8 గ్రాముల క్రషింగ్ ఎండీఎంఏ, 51 గ్రాముల కొకైన్ సీజ్ చేసినట్లు వెల్లడించారు. ఈ డ్రగ్స్ కేసుకు సంబంధించి రాజేంద్రనగర్ డీసీపీ కీలక వివరాలు వెల్లడించారు. డీసీపీ జగదీశ్వర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. మోకిల పోలీస్ స్టేషన్ పరిధిలో డ్రగ్స్ చెలామణికి సంబంధించి సమాచారం రావడంతో డ్రగ్స్ పట్టుకున్నామని అన్నారు. డ్రగ్స్ కేసులో అనురాధ అనే యువతి కీలకంగా ఉందని, ఈమెకు గతంలోనే వివాహం జరిగిందని తెలిపారు. అయితే, భర్త నుంచి విడాకులు తీసుకుని విడిగా ఉంటోందని అన్నారు. ఆమె తరచూ గోవాకు వెళ్తూ ఉండడం.. గోవాలో నైజీరియాకు చెందిన జేమ్స్‌తో పరిచయం ఏర్పరచుకుందని అన్నారు. గోవాలో జేమ్స్ వద్ద డ్రగ్స్ కొనుక్కొని రోడ్డు మార్గం ద్వారా హైదరాబాద్‌కు తీసుకువచ్చిందని అన్నారు. ముఖ్యంగా వరలక్ష్మీ టిఫిన్ సెంటర్ యజమాని ప్రభాకర్ రెడ్డితో ప్రేమాయణం సాగిస్తున్న ఆమె.. అతడి కోసమే ఈ డ్రగ్స్ దందాకు పాల్పడుతోందని అన్నారు.