Breaking News: మరోసారి ఎన్డీయే పక్షనేతగా నరేంద్ర మోదీ - మద్దతు ప్రకటించిన చంద్రబాబు, నితీష్

Latest Telugu Breaking News: ఏపీ అసెంబ్లీ, దేశవ్యాప్తంగా జరిగిన ఎన్నికల్లో ఓటర్లు అనూహ్య తీర్పు ఇచ్చారు. ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ ఇక్కడ చూడొచ్చు.

Continues below advertisement

LIVE

Background

Andhra Pradesh And Telangana Latest News:  ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు అనూహ్య తీర్పు ఇచ్చారు. ప్రతిపక్షం అనేది లేకుండా మొత్తం ఓట్లను కూటమికే కుమ్మరించారు. గతంలో వైసీపీకీ 151 అసెబ్లీ సీట్లు వస్తేనే అద్భుతం అనుకున్నారు. కానీ అంతకు మించిన ఓటుశాతాన్ని సీట్లను కూటమి పార్టీలకు కట్టూబెట్టారు. టీడీపీ 136 స్థానాల్లో విజయం కేతనం ఎగరేస్తే... జనసేన పోటీ చేసిన 21 స్థానాల్లో విజయ దుందుబి మోగించింది. బీజేపీ 8 స్థానాలు తగ్గించుకుంది. వైపీపీ మాత్రం కేవలం అంటే కేవలం 11 స్థానాలతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఇది రాష్ట్ర రాజకీయాల్లోనే చాలా అరుదైన సన్నివేశంగా రాజకీయ విశ్లేషకులు అభివర్ణిస్తున్నారు. 

8 స్థానాల్లో ఖాతా తెరవని వైసీపీ

ఘోర పరాజయం పొందిన వైసీపీ 8 ఉమ్మడి జిల్లాలో కనీసం బోణీ చేయలేకపోయింది. వైసీపీ బోణీ చేయని జిల్లాలు:- శ్రీకాకుళం, విజయనగరం, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, నెల్లూరు, అనంతపురం మిగతా జిల్లాలు చూస్తే విశాఖ పట్నం, చిత్తూరు, కర్నూలు, ప్రకాశం జిల్లాలో రెండేసి స్థానాలు దక్కించుకుంది. కడలో మూడు స్థానాలు నెగ్గింది. 

ఎంపీ స్థానాల విషయంలో కూడా కూటమికే పట్టం కట్టారు ఓటర్లు. టీడీపీ 16 స్థానాలు నెగ్గింది. జనసేన రెండు స్థానాల్లో, బీజేపీ మూడు స్థానాల్లో విజయం సాధించింది. వైసీపీ మాత్రం నాలుగు ఎంపీ స్థానాలకే పరిమితం అయింది. ఎన్డీఏ భాగస్వామ్య పార్టీలోల ఎక్కువ సీట్లు సాధించిన పార్టీల్లో టీడీపీ రెండో స్థానంలో ఉంది.

తెలంగాణలో కాంగ్రెస్ 8 స్థానాలు దక్కించుకుంటే, బీజేపీ పోటీగా 8 స్థానాల్లో విజయం సాధించింది. ఎంఐఎం తనస్థానాన్ని నిలబెట్టుకుంది. మొన్నటి వరకు అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్‌ ఒక్కటంటే ఒక్క స్థానాన్ని కూడా కైవశం చేసుకోలేదు. చాలా నియోజకవర్గాల్లో డిపాజిట్లు కూడా పొందలేకపోయింది. ఆ పార్టీ నుంచి పోటీ చేసిన ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ లాంటి వాళ్లు కూాడా ఓటమి పాలయ్యారు. 

ఆరు నెలల క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర ఓటమితో ఇబ్బంది పడుతున్న బీఆర్‌ఎస్‌కు లోక్‌సభ ఎన్నికల్లో ఘోర ఓటమి మరింత కుంగదీస్తోంది. ఫలితాల దెబ్బకు ఆ పార్టీలో నిశ్చబ్ధ వాతావరణం నెలకొంది. అటు కాంగ్రెస్‌లో కూడా అదే పరిస్థితి కనిపించింది. అసెంబ్లీ ఎన్నికల్లో విజయంతో జోష్‌ మీద ఉన్నట్టు కనిపించినా కేవంల సింగిల్ డిజిట్‌కు పరిమితం కావడం ఆశ్చర్యాన్ని కలిగించింది. 

జాతీయ స్థాయిలో కూడా ప్రజలు ఆశ్చర్యకరమైన ఫలితాలు ఇచ్చారు ప్రజలు. 542 స్థానాలకు ఎన్నికలు జరిగితే ఎన్డీఏకు 293 స్థానాలు కట్టబెట్టిన ప్రజలు ఇండీ కూటమికి 233 స్థానాలు అప్పగించారు. ఇతరులకు 17 స్థానాలు ఇచ్చారు. ఇలా దేశవ్యాప్తంగా ఓటు నాడి పట్టుకోవడంలో దాదాపు అన్ని సర్వే సంస్థలు లెక్క తప్పాయి.   

కూటమి ఎక్కువ సీట్లు సాధించడంతో జగన్ మోహన్ రెడ్డి తన పదవికి రాజీనామా చేశారు. మంగళవారం సాయంత్రం రాజీనామా పత్రాన్ని గవర్నర్‌కు పంపించారు. వెంటనే ఆయన్న దాన్ని ఆమోదించారు. 9వ తేదీని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా చంద్రబాబు అమరావతిలో ప్రమాణం చేయనున్నారు. దీని ఏర్పాట్లపై చర్చించేందుకు సీఎస్ జవహర్ రెడ్డి చంద్రబాబుతో సమావేశం కానున్నారు. 

ఢిల్లీలో ఈ సాయంత్రం ఎన్డీఏ పార్టీల భేటీ జరగనుంది. ఇందులో పాల్గొనేందుకు  టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ ఈ ఉదయం ఢిల్లీ వెళ్లనున్నారు.  

Continues below advertisement
18:36 PM (IST)  •  05 Jun 2024

మరోసారి ఎన్డీయే పక్షనేతగా నరేంద్ర మోదీ - మద్దతు ప్రకటించిన చంద్రబాబు, నితీష్

బీజేపీ సారథ్యంలోని ఎన్డీయే (NDA) కూటమి కేంద్రంలో మరోసారి అధికారంలోకి వచ్చింది.  అయితే ఎన్డీయే పక్షనేతగా నరేంద్ర మోదీని కూటమి నేతలు ఎన్నుకున్నారు. ఎన్డీయే పక్షనేతగా నరేంద్ర మోదీకి కూటమి నేతలు మద్దతు తెలిపారు. కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటుకు చంద్రబాబు, జేడీయూ నేత నితీష్ కుమార్ మద్దతు లేఖలను అందజేశారు. 

17:23 PM (IST)  •  05 Jun 2024

ప్రధాని రాజీనామాకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం

ప్రధాని నరేంద్ర మోదీ రాజీనామాకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం తెలిపారు. ప్రధాని రాజీనామా లేఖను రాష్ట్రపతి ఆమోదించారు.

17:10 PM (IST)  •  05 Jun 2024

నంబర్ గేమ్ మొదలైంది, అంతా సిద్ధంగా ఉండండి - మంత్రులతో మోదీ కీలక వ్యాఖ్యలు

ప్రధాని నరేంద్ర మోదీ తన పదవికి రాజీనామా సమర్పించే ముందు కేంద్ర మంత్రులతో కేబినెట్ సమావేశం నిర్వహించారు. జూన్ 8వ తేదీన మూడోసారి ప్రధానిగా మోదీ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ క్రమంలోనే మంత్రులతో సమావేశమైన ఆయన తదుపరి కార్యాచరణపై దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా మంత్రులతో కీలక వ్యాఖ్యలు చేశారు మోదీ. గెలవడం, ఓడిపోవడం రాజకీయాల్లో అత్యంత సహజమని కేంద్ర మంత్రులకు ప్రధాని మోదీ హితబోధ చేశారు.

17:03 PM (IST)  •  05 Jun 2024

చంద్రబాబు ఆహ్వానిస్తే ప్రమాణ స్వీకారానికి వెళ్తా: రేవంత్ రెడ్డి

ఏపీ సీఎంగా ప్రమాణ స్వీకారానికి చంద్రబాబు (Chandrababu) ఆహ్వానిస్తే తాను తప్పకుండా వెళ్తానని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ సూచనల మేరకే తాను నడుచుకుంటానని అన్నారు. ఏపీలో ఏ ప్రభుత్వం వచ్చినా సామరస్యంగానే రాష్ట్ర సమస్యలు పరిష్కరించుకుంటామని గతంలోనే చెప్పినట్లు గుర్తు చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా అనేది చట్టబద్ధతతో కూడుకున్న హామీ అన్న రేవంత్.. రాహుల్ గాంధీ విస్పష్టంగా ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వడానికి కట్టుబడి ఉన్నారని తెలిపారు. ఈ విషయంపై తమ పార్టీలో చర్చించాక చంద్రబాబుతో మాట్లాడతానని అన్నారు.

14:19 PM (IST)  •  05 Jun 2024

Breaking News: ఢిల్లీకి చేరుకున్న చంద్రబాబు నాయుడు

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కాసేపటి క్రితం ఢిల్లీ చేరుకున్నారు. సాయంత్రం జరిగే ఎన్డీఏ సమావేశంలో పాల్గొనేందుకు ఆయన ఈ ఉదయం ఢిల్లీ వెళ్లారు. పవన్ కల్యాణ్ కూడా కాసేపట్లో ఢిల్లీ చేరుకోనున్నారు. ఆయన కూడా సమావేశానికి హాజరుకానున్నారు. 

13:40 PM (IST)  •  05 Jun 2024

janasena News: జనసేనకు మరో గుడ్ న్యూస్

ఎన్నికల్లో అద్భుత విజయం సాధించిన జనసేనకు మరో గుడ్స్యూస్. 


ఈ ఫలితాలతో 'గాజు గ్లాసు' గుర్తును ఆ పార్టీకి EC శాశ్వతంగా కేటాయించనుంది.


 పర్మినెంట్ గుర్తు రావాలంటే అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో 6% చొప్పున ఓట్లు రావాలి. 


కనీసం 2 MLA, ఒక MP సీటు గెలవాలి. 


ఈ ఎన్నికల్లో JSP 21 MLA, 2 MP స్థానాలు దక్కించుకోవడంతో సింబల్ టెన్షన్ తీరిపోయింది.


 త్వరలోనే EC అధికారికంగా ఆ పార్టీకి గ్లాస్ గుర్తు ఇవ్వనుంది.

10:59 AM (IST)  •  05 Jun 2024

ప్రజలే మమ్మల్ని నడిపించాలి: చంద్రబాబు

నాకు, నా కుటుంబానికి జరిగిన అవమానం ఎప్పుడు మర్చిపోలేను . బాంబులు పేల్చినా నేను గట్టిగా నిలబడ్డాను. అలాంటి వ్యక్తిని అవమానించారు. తాను ఇకపై సభలోకి రానని చెప్పేసి వచ్చేశాను. మళ్లీ సీఎంగానే సభకు వస్తానని చెప్పాను. అన్నట్టుగానే దాన్ని నిజం చేయడానికి శ్రమించాను. దీనికి కార్యకర్తలు, నేతలు చాలా సహకరించారు. ఓడిపోయినా, గెలిపించినా ప్రజల పక్షానే ఉన్నాం. నా శపథం ప్రకారం అదే హోదాలో సభకు వస్తున్నాను... ఆ గౌరవాన్ని ఇచ్చిన ప్రజలకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఎప్పటికప్పుడు మమల్ని నడిపించే బాధ్యత ప్రజలు తీసుకోవాలి. ఎప్పటికప్పుడు ఫీడ్ బ్యాక్ ఇవ్వాలని కోరుతున్నాను. బీజేపీకి, జనసేనకు ప్రత్యేక ధన్యవాదాలు. 

10:55 AM (IST)  •  05 Jun 2024

ముందు వ్యవస్థలను పునరుద్ధరించాలి: చంద్రబాబు

వ్యవస్థలను పునరుద్దరించాల్సి ఉంది. నాలుగైదు రోజుల పరిశీలించాలి. మీరు రాసినట్టు, మేం మాట్లాడినట్టు ఓ స్థాయిలో ఆగిపోయాయి. ఇప్పుడు ఇంకా లోతుకు వెళ్తే ఎంత నష్టాల్లో ఉందో చూడాలి. ఒకప్పుడు ఇలాంటి పరిస్థితే ఉండేది. విద్యుత్ సంస్కరణలు తీసుకొచ్చి 1999 నుంచి 2004 వరకు క్వాలిటీ పవర్ ఇచ్చాం. 2014 నాటికి మళ్లీ సమస్యలు వచ్చాయి. 2014 నుంచి మళ్లీ విద్యుత్ వ్యవస్థను పునరుద్దరించాం. ఇప్పుడు మళ్లీ సమస్యలు వచ్చాయి. ఇప్పుడు వాటిని ఎలా రిపేర్ చేయాలో చూడాలి. సంబంధం లేదని వ్యవస్థలపై డబ్బులు తీసుకొచ్చి సంబంధం లేని వ్యవస్థకు ఇచ్చారు. 

10:52 AM (IST)  •  05 Jun 2024

అప్పులు ఎంత చేశారో ఇంకా లోతుగా చూడాలి: చంద్రబాబు

ఐదేళ్లు విధ్వంసం చూసిన తర్వాత ఇది 30 ఏళ్ల డ్యామేజ్ చేసింది. వ్యవస్థలు ధ్వంసం అయ్యాయి. మొత్తం ఆర్థికవ్యవస్థ కుప్పకూలింది. అప్పులు ఎంత చేశారో లోతుకుపోతే తప్ప తెలియదు. ఎక్కడికక్కడ సహజసంపదను అడ్డేలేదు అన్నట్టు దోచుకున్నారు. 

10:50 AM (IST)  •  05 Jun 2024

అధికారాన్ని బాధ్యతగా భావిస్తున్నాం: చంద్రబాబు

ఐదేళ్లు ప్రజలను, టీడీపీ, జనసే, బీజేపీ కార్యకర్తలను చిత్రవధ చేశారు. ఇది అధికారం అనుకోవడం లేదు. బాధ్యతగా భావిస్తున్నాం. పాలకులం కాదు సేవకులం. ఇవి గుర్తుపెట్టుకొని పని చేస్తాం. సూపర్ సిక్స్‌ ఇచ్చాం. ఎన్నికల మేనిఫెస్టో ఇచ్చాం. ఇవి ప్రజల్లోకి వెళ్లాయి. ఒక హోప్ క్రియేట్ అయింది. అవే ఫలితాల రూపంలో వచ్చాయి. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదని మొదటి సారిగా  పవన్ కల్యాణ్ కూటమికి బీజం వేశారు. తర్వాత బీజేపీ కూడా కూటమిలో భాగస్వాములై... ఒకరు ఎక్కువ తక్కువ అనే భేషజాలు లేకుండా పని చేశాం. 

10:47 AM (IST)  •  05 Jun 2024

Chandra Babu Press Meet: అహంకారంతో వెళ్తే ఇలాంటి గుణపాఠాలే వస్తాయి.

Chandra Babu Press Meet: టీడీపీకి 45.60 శాతం వచ్చాయి. 39.37 శాతం ఓట్లు వైసీపీకి వచ్చాయి. ఒక్కొక్కరికి 95 వేలు మెజార్టీ వచ్చాయి.  ప్రజల ఇచ్చిన తీర్పు చూస్తే అంహకారం, నియంతృత్వం ఉంటే ప్రజలు క్షమించే పరిస్తితి లేదు. ఈసారి వీళ్లు చేసింది గుణపాఠం పాలకులకు కాదు.... అవినీతి అహంకారంతో ముందుకువెళ్లే వాళ్లకు ఇదే జరుగుతుంది. 

10:47 AM (IST)  •  05 Jun 2024

Chandra Babu Press Meet: అహంకారంతో వెళ్తే ఇలాంటి గుణపాఠాలే వస్తాయి.

Chandra Babu Press Meet: టీడీపీకి 45.60 శాతం వచ్చాయి. 39.37 శాతం ఓట్లు వైసీపీకి వచ్చాయి. ఒక్కొక్కరికి 95 వేలు మెజార్టీ వచ్చాయి.  ప్రజల ఇచ్చిన తీర్పు చూస్తే అంహకారం, నియంతృత్వం ఉంటే ప్రజలు క్షమించే పరిస్తితి లేదు. ఈసారి వీళ్లు చేసింది గుణపాఠం పాలకులకు కాదు.... అవినీతి అహంకారంతో ముందుకువెళ్లే వాళ్లకు ఇదే జరుగుతుంది. 

10:43 AM (IST)  •  05 Jun 2024

చరిత్రలో ఇదో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ ఎన్నిక: చంద్రబాబు

ఈ కమిట్‌మెంట్‌ ఎలా వర్ణించగలం: చంద్రబాబు 
ఎక్కడో అమెరికాలో ఉన్న వ్యక్తి లక్షలు ఖర్చు పెట్టి ఇక్కడకు వచ్చి కసిగా ఓటు వేశారు. : చంద్రబాబు
వేరే రాష్ట్రాల్లో 
చరిత్రలో ఇదో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ ఎన్నిక: చంద్రబాబు

10:42 AM (IST)  •  05 Jun 2024

భవితరాల భవిష్యత్ కోసం నిలబడ్డాం... చాలా త్యాగాలు చేశాం: చంద్రబాబు 

సుదీర్ఘమైన రాజకీయ యాత్రలో ఈ ఐదేళ్లు చూసిన ప్రభుత్వాన్ని ఎప్పుడూ చూడలేదు.: చంద్రబాబు 
భవితరాల భవిష్యత్ కోసం నిలబడ్డాం... చాలా త్యాగాలు చేశాం: చంద్రబాబు 
చాలా ఎన్నికలు చూశాం... నేను చూసిన పదో ఎన్నిక: చంద్రబాబు 
దేశంలో ఎవరూ శాశ్వతం కాదు... అధికారం శాశ్వతం కాదు... దేశం, రాష్ట్రం శాశ్వతం: చంద్రబాబు

Sponsored Links by Taboola