Massive Power Outage Hits Spain:  అత్యంత సమర్థమైన విద్యుత్ నిర్వహణ వ్యవస్థ ఉండే దేశాల్లో కూడా కరెంట్ సమస్యలు స్తున్నాయి.  పవర్ గ్రిడ్ నుండి విద్యుత్ సరఫరాలో భారీ కోతతో స్పెయిన్ మొత్తం అంధకారంలో మునిగిపోయింది. స్పెయిన్ తో పాటు, ఫ్రాన్స్, పోర్చుగల్ కూడా ఈ విద్యుత్ కోత సమస్యను ఎదుర్కొంటున్నాయి. స్పెయిన్ మరియు పోర్చుగల్‌లోని పెద్ద  పట్టణాల్లో  విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడిన విషయాన్ని ప్రభుత్వం అధికారికంగా ధృవీకరించింది.  

స్పెయిన్‌లో విద్యుత్ సరఫరా అంతరాయం గురించి స్పానిష్ విద్యుత్ గ్రిడ్ పర్యవేక్షణ సంస్థ ఇ-రీడ్స్ అధికారిక ప్రకటన విడుదల చేసింది. దేశవ్యాప్తంగా విద్యుత్ సరఫరాను దశలవారీగా పునరుద్ధరించడానికి కృషి చేస్తున్నట్లు కంపెనీ తెలిపింది. "ఇది యూరప్ అంతటా విస్తృతమైన సమస్య" అని కంపెనీ తెలిపింది. 

 మాడ్రిడ్‌లోని భూగర్భంలో ఉన్నవారిని ఖాళీ చేయించినట్లు స్పానిష్ రేడియో స్టేషన్లు తెలిపాయి. స్పెయిన్ రాజధాని మాడ్రిడ్ నగరం మధ్యలో విద్యుత్ సరఫరా అంతరాయం కారణంగా వీధుల్లో గందరగోళం నెలకొంది. ట్రాఫిక్ లైట్లు పనిచేయకపోవడంతో రోడ్లపై ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. లిస్బన్ ,  పోర్టోలలో మెట్రో కూడా మూసివేశారు. రైళ్లు కూడా ఆగిపోయాయి.  

 

యూరప్ లోని పలు దేశాల్లో   విద్యుత్ సరఫరాలో అంతరాయం వెనుక గల కారణంపై స్పష్టత లేదు.  ఐబీరియన్ ద్వీపకల్పం ఈ విద్యుత్ కోత సమస్య వల్ల ప్రభావితమైంది.