Organ Donation: అన్ని దానాల్లోకెల్లా అవయవ దానం అత్యంత గొప్పది. చాలా ముఖ్యమైనది. ఒకరి ప్రాణాన్ని కాపాడటానికి మించినది మరొకటి ఏదైనా ఉంటుందా. బతుకుతామో, లేదో అన్న భయాందోళనలో ఉన్న వ్యక్తులకు తమలోని అవయవాలను దానం చేయడం మాట్లాడుకునేంత చిన్న విషయం ఏమీ కాదు. మనకు ఉన్న దాంట్లో నలుగురికి పెట్టినంత సులభం కాదు.. ఒంట్లోని అవయవాలను తీసి మరొకరికి దానం చేయడం. ఆర్థికంగా మంచిగా స్థిరపడితే అన్నదానం చేయవచ్చు. నిరుపేదలకు దుప్పట్లు, రగ్గులు అందించవచ్చు. కానీ ఒంట్లో అవయవాలు ఉన్నాయి కదా అని దానం చేయలేము. దానికెంతో గుండె ధైర్యం కావాలి. 


మామూలుగా బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తుల నుంచి అవయవాలు తీసి వేరొకరికి అమరుస్తారు. ఇందుకోసం బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తి కుటుంబ సభ్యుల అనుమతి తప్పని సరిగా కావాల్సి ఉంటుంది. బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తులు బతికే ఉంటారు. కానీ వారు దేనికి స్పందించలేరు. వారి చేతులు, కాళ్లు పని చేయవు. కళ్లు కూడా ఆడించలేరు. శరీరంలోని ఏ భాగాన్ని కదిలించలేరు. ప్రాణం ఉన్నా.. చలనం లేని శవంలా పడి ఉంటారు. అలాంటి వ్యక్తుల కుటుంబ సభ్యులను వైద్యులు అవయవ దానానికి ఒప్పిస్తారు. అలాగే ప్రమాదంలో గాయపడి బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తి మరో ఐదుగురికి ప్రాణం పోశాడు. ఇది ఛండీగఢ్ లో జరిగింది. 


వైద్యులు ఒప్పించడంతో ఒప్పుకున్న తల్లి..


బ్రెయిన్ డెడ్ అయిన ఓ యువకుడు చేసిన అవయవ దానం ఐదుగురి ప్రాణాలకు రక్షణగా నిలిచింది. బ్రెయిన్ డెడ్ అయిన ఆ వ్యక్తి నుంచి గుండెను తీస్తే ప్రాణం పోతుందని తెలిసినా.. ఆ వ్యక్తి తల్లి అవయవదానానికి ముందుకు వచ్చింది. తన కుమారుడి అవయవాలను వేరొకరికి అమర్చేందుకు అంగీకరించింది ఆ మాతృమూర్తి. ఛండీగడ్ లోని పీజీ మెడికల్ కాలేజీ ఆస్పత్రి ప్రమాదంలో గాయపడి వచ్చిన ఓ యువకుడు బ్రెయిన్ డెడ్ అయ్యాడు. అప్పుడే వైద్యులు అవయవ దానం గురించి బాధితుడి తల్లికి వివరించారు. వైద్యులు ఒప్పించడంతో గుండెం, కాలేయం, క్లోమం, కిడ్నీలను వేరొకరికి అమర్చాలని అనుకున్నారు. గుండె మినహా ఇతర అవయవాలను అదే ఆస్పత్రిలోని ఇతర బాధితులకు దానం చేశారు. ఆయా అవయవాలను వారికి అమర్చి ప్రాణం పోశారు. గుండెను మాత్రం దిల్లోలనీ ఓ బాధితుడికి అమర్చేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేసి తరలించారు. 


54 ఏళ్ల సైనికుడికి గుండె అవసరం..


దిల్లీలో ఆర్మీ ఆసుపత్రి రీసెర్చ్ అండ్ రిఫరెల్ లోఓ 54 ఏళ్ల సైనికుడికి గుండె అవసరం అయింది. యువకుడి నుంచి తీసిన గుండెను ఆ సైనికుడికి అమర్చారు. గుండెను తరలించడానికి ప్రత్యేకంగా గ్రీన్ కారిడార్ ఏర్పాటు చేశారు. సైనిక బలగాల్లోని ఆర్గాన్ రిట్రైవల్ అండ్ ట్రాన్స్ ప్లాంటేష్ అథారిటీ, ఏహెచ్ఆర్ఆర్ వైద్యులు ఎయిర్ లిఫ్ట్ ద్వారా గుండెను సకాలంలో దిల్లీకి తరలించారు. బ్రెయిన్ డెడ్ యువకుడి నుంచి తీసిన గుండెను 54 ఏళ్ల సైనికుడికి అమర్చడంతో ఆయనకు కొత్త ప్రాణం పోసినట్లు అయింది. సెప్టెంబర్ 3న ఈ ఆపరేషన్ జరిగింది. ఈ విషయాన్ని నేషనల్ ఆర్గాన్ అండ్ టిష్యూ ట్రాన్స్ ప్లాంట్ ఆర్గనైజేషన్ తెలియజేసింది.