విడాకులు అంటే భార్యకు మాత్రమే అన్యాయం జరుగుతుందా ? భర్తకు భరణం ఇవ్వాల్సిన కేసులు కూడా ఉంటాయి. కానీ విడాకులు అంటే.. అదేదో భర్తనే ఇస్తున్నాడన్న ఓ భావనతో ఇంత కాలం ఆ భర్తలకు అన్యాయం జరుగుతూ వస్తోంది.ఇప్పుడు  వారికి కాస్త ధైర్యం ఇచ్చే తీర్పు వచ్చింది. అదేమిటంటే..  భార్యనుంచి భర్త కూడా భరణం కోరవచ్చు. అలా కోరడమే కాదు.. కోర్టుకెళ్లి ఉత్తర్వులు కూడా తెచ్చుకున్నాడు ఓ భర్త. 


మద్యం తాగేవాళ్లంతా మహా పాపులు - శాపనార్థాలు పెట్టిన సీఎం !


మహారాష్ట్రకు చెందిన ఓ జంటకు  1992లో పెళ్లయింది. కొన్నాళ్లు బాగానే ఉన్నారు. ఆ భర్త పెళ్లయిన తర్వాత కూడా  భార్యను చదువుకునేందుకు ప్రోత్సహించాడు. చాలా ఖర్చు  పెట్టాడు. చివరికి ఆమెకు ప్రభుత్వ ఉద్యోగం వచ్చింది. అయితే ఆ భర్తకు ఎలాంటి ఉపాధి లేకుండా పోయింది. కానీ భార్యకు ప్రభుత్వ ఉద్యోగం ఉంది కదా అనుకున్నాడు. కొన్నాళ్లకు భర్త ఏమీ సంపాదించడం లేదన్న కారణంతో వచ్చిన కలహాలతో భర్త నుంచి విడాకులు ఇప్పించాలని 2015లో భార్య.. నాందేడ్​ సివిల్​ కోర్టును ఆశ్రయించింది. విచారణ చేపట్టిన కోర్టు వారికి అదే ఏడాది విడాకులు మంజూరు చేసింది. 


పెళ్లి చేయని కుమార్తెకు పెళ్లి ఖర్చులు ఇవ్వాల్సిందే - ఓ తండ్రికి చత్తీస్‌ఘడ్ కోర్టు ఆదేశం !


అయితే ఇలా తనను అర్థంతరంగా వదిలేస్తే తన జీవితం ఎం కావాలనుకున్న ఆ భర్త.. హిందూ వివాహ చట్టం 1955లోని సెక్షన్​ 24, 25 ప్రకారం భార్య నుంచి శాశ్వత భరణం, జీవనాధార ఖర్చులు ఇప్పించాలని కోర్టును ఆశ్రయించాడు. తనకు జీవనాధారం ఏమీ లేదని, భార్య ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ మంచి వేతనం తీసుకుంటున్నట్లు పిటిషన్​లో పేర్కొన్నారు. విచారణ జరిపినకోర్టు భర్తకు భరణం ఇవ్వాలని భార్యను ఆదేశించింది. అయితే భార్య  ఔరంగాబాద్​ హైకోర్టును ఆశ్రయించింది . 


 ఇరు పక్షాల వాదనలు విన్న కోర్టు.. భర్తకు భార్య భరణం ఇవ్వాలని తీర్పు వెల్లడించింది. సివిల్​ కోర్టులో వాదనలు, సమర్పించిన డాక్యుమెంట్లు, గతంలో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును పరిశీలించిన హైకోర్టు.. సివిల్​ కోర్టు ఇచ్చిన తీర్పును సమర్థించింది. భర్తకు భరణం ఇవ్వాల్సిందేనని స్పష్టం చేసింది.
వైవాహిక జీవితానికి స్వస్తి పలుకుతూ భార్యాభర్తలు వీడిపోయిన సందర్భంలో భార్యకు భరణం ఇవ్వటం చాలా ఏళ్ల నుంచి వస్తున్న పద్ధతి. అయితే, వీడాకులు తీసుకునే భార్య.. భర్తకు భరణం ఇవ్వాలని బొంబాయి​ హైకోర్టు ఔరంగాబాద్ బెంచ్ స్పష్టం చేసింది.