Bhopal Ujjain Train Blast Case Verdict: లక్నో: భోపాల్ - ఉజ్జయినీ ప్యాసింజర్ రైలు పేలుడు కేసులో ఏడుగురికి మరణశిక్ష విధించగా, మరో నిందితుడికి జీవిత ఖైదు విధించారు. ఎన్ఐఏ ప్రత్యేక కోర్టులో నిందితులను హాజరు పరచగా.. ఈ దారుణానికి పాల్పడిన మొత్తం ఎనిమిది మంది ఉగ్రవాదుల్లో ఏడుగురికి ఉరిశిక్ష, ఒకరికి జీవిత ఖైదు విధించింది. శిక్షకు సంబంధించిన అన్ని అంశాలపై చర్చించిన తర్వాత, భోపాల్ - ఉజ్జయినీ ప్యాసింజర్ ట్రెయిన్ పేల్చివేత కేసులో ఎన్ఐఏ స్పెషల్ కోర్టు మంగళవారం శిక్షను ఖరారు చేసింది. వాస్తవానికి సోమవారం శిక్ష విధించాల్సి ఉండగా, తీర్పు మంగళవారానికి వాయిదా పడింది. నేడు ఎన్ఐఏ కోర్టు దోషులకు ఉరిశిక్ష, జీవిత ఖైదుతో పాటు జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించింది.
ప్యాసింజర్ రైలు పేలుడు దుర్ఘటన కేసులో శుక్రవారం నాడు ఉగ్రవాదులందరినీ కోర్టు దోషులుగా నిర్ధారించింది. మధ్యప్రదేశ్‌లోని షాజాపూర్‌లో మార్చి 7, 2017 ఉదయం జరిగిన రైలు పేల్చివేత ఘటనలో ఐఎస్‌ఐఎస్‌కు చెందిన ఖొరాసన్ విభాగానికి చెందిన ఉగ్రవాదుల పాత్ర ఉందని తేలింది. పేలుడు జరిగిన మరుసటి రోజు మార్చి 8, 2017న, లక్నోలోని కకోరి ప్రాంతంలో, ఖొరాసన్ గ్రూపులతో సంబంధం ఉన్న కాన్పూర్ కు చెందిన సైఫుల్లాను ATS ఎన్‌కౌంటర్‌లో హతమార్చింది. మహమ్మద్ ఫైజల్, గౌస్ మహ్మద్ ఖాన్, మహ్మద్ అజర్, అతిఫ్ ముజఫర్, మహ్మద్ డానిష్, సయ్యద్ మీర్ హుస్సేన్, ఆసిఫ్ ఇక్బాల్ అలియాస్ రాకీ, మహ్మద్ అతీఫ్ అలియాస్ అతిఫ్ ఇరానీలను పోలీసులు అరెస్టు చేశారు.
ఆరేళ్ల కిందట ఘటన..

యువతను మభ్యపెట్టి ఉగ్రవాద కార్యకలాపాలు..
అరెస్ట్ సమయంలో ఉగ్రవాదుల నుంచి పెద్ద ఎత్తున పేలుడు పదార్థాలు, ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. ఉగ్రవాదులకు నిధులు సమకూర్చడం, పేలుడు పదార్థాలు, ఆయుధాలు సేకరించడం లాంటి పలు ఆరోపణలపై అప్పట్లో పోలీసులు నిందితులపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. నిరుద్యోగ యువత, చదువుకున్న చదువులకు తగిన ఉద్యోగాలు లేక సమస్యలు ఎదుర్కొంటున్న యువతను బ్రెయిన్ వాష్ చేసి ఐఎస్ఐస్ ఉగ్రవాద సంస్థలో ఈ నిందితులు చేర్చినట్లు విచారణలో తేలింది. ముఖ్యంగా యువకులను దేశ వ్యతిరేక కార్యకలాపాలకు ఐసిస్ ఉపయోగించుకునే ప్రయత్నం చేసింది. జకీర్ నాయక్ మాట్లాడిన, ఆయనకు సంబంధించిన వీడియోలను చూపించి యువకులను జిహాద్ కోసం ప్రేరేపించారు. సొంత దేశంపైనే తిరుగుబాటు చేయాలని, దాడులు చేయాలని యువతను ఉగ్రవాదంలోకి లాగేందుకు వీరు ప్రయత్నాలు చేస్తుండేవారు. నేడు ఉగ్రవాదులందరినీ మళ్లీ ఎన్ఐఏ స్పెషల్ కోర్టులో హాజరుపరచగా మొత్తం 8 మందిలో ఏడుగురు దోషులకు ఉరిశిక్ష, ఒకరికి జీవిత ఖైదు విధిస్తూ కోర్టు కీలక తీర్పు వెలువరించింది.