అత్యాచారానికి గురయ్యారో లేదో తెలుసుకోవడనికి .. రేప్ కేసుల్లో వైద్యులు చేసే ఓ విధానమైన పరీక్షా విధానం టు ఫింగర్ టెస్ట్.   టెస్టులు చేసే వైద్యులు రెండు వేళ్లను  చొప్పించి బాధితురాలి కన్నెపొర చినిగిందో లేదో చూస్తారు. చినిగి ఉంటే అత్యాచారం జరిగినట్లుగా గుర్తిస్తారు. లేకపోతే లేదని రిపోర్టు ఇస్తారు. అత్యాచార బాధితులు ముఖ్యంగా మైనర్లయితే ఈ టెస్టును వైద్యులు తప్పనిసరిగా చేస్తారు.  ఈ విధానం చాలా కాలంగా అమల్లో ఉంది.  కానీ ఇది అశాస్త్రీయ విధానమని.. దీన్ని తక్షణం నిలిపివేయాలని మద్రాస్ హైకోర్టు మధురై బెంచ్ ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది.  


తమిళనాడులో రాజీవ్ గాంధీ అనే వ్యక్తిపై మైనర్‌పై రేప్ చేశాడనే కేసు నమోదయింది. అతను టైలర్ షాపు నడుపుతూ ఉంటాడు.  అతని వద్ద శిక్షణ కోసం పదహారేళ్ల బాలిక వచ్చింది. వారి మధ్య సాన్నిహిత్యం పెరిగింది. కొద్ది రోజుల తర్వాత ఇద్దరూ కనిపించకుండా వెళ్లిపోయారు. దీంతో బాలిక తండ్రి పోలీసు కేసు పెట్టారు. పోలీసులు వారిని పట్టుకుని తీసుకు వచ్చి బాలికను తండ్రికి అప్పగించారు. ఆ తర్వాత బాలిక తండ్రి తన బిడ్డపై టైలర్ రాజీవ్ అత్యాచారం చేశారని కేసు పెట్టారు. అప్పులు బాలికకను వైద్యులు టూ ఫింగర్ టెస్ట్ చేసి  అత్యాచారం జరిగిందని నిర్ధారించారు. దీంతో రాజీవ్ కు జీవిత ఖైదు పడింది. 


అయితే ఇది చట్ట సమ్మతం కాదని రాజీవ్  హైకోర్టును ఆశ్రయించారు. ఈ సందర్భంగా ఆ బాలిక తన ఇష్టప్రకారమే వచ్చిందని.. తాను కిడ్నాప్ చేయలేదన్నారు. ఆ బాలిక పారిపోవడానికి కూడా ప్రయత్నించలేదన్నారు. అయితే ఆ బాలిక మైనర్ కాబట్టి ఆ అభ్యంతరాల్నీ చెల్లవనీ కి- R డ్నాపేనని బాలిక తండ్రి తరపు న్యాయవాదులు వాదించారు. వాదనలు విన్న కోర్టు జీవిత ఖైదును ఇరవై ఏళ్ల జైలు శిక్షగా మార్చింది. ఈ కేసులో "టు ఫింగర్ టెస్ట్‌"పై కేసీక ఆదేశాలు జారీ చేసింది. 


కన్నె పొర అనేది లైంగిక చర్య జరిగినప్పుడు మాత్రమే చనిగిపోదని అనేకానేక కారణాల వల్ల దెబ్బతింటుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా నిర్ధారించిన రిపోర్టులు ఉన్నాయి. అయినప్పటికీ "టు ఫింగర్ టెస్ట్‌" ద్వారా రేప్ జరిగిందని నిర్ధారించడమే కాదు.. ఇలా టెస్ట్ చేయడం కూడా పద్దతి కాదని హైకోర్టు బెంచ్ అభిప్రాయపడింది. అమ్మాయిల వ్యక్తిగత స్వేచ్చను హరించడమేనని న్యాయమూర్తులు వ్యాఖ్యానించారు.  ఈ  తీర్పు కారణంగా అనాగరిక టెస్టుగా భావిస్తున్న " టు ఫింగర్ టెస్ట్‌" ను బ్యాన్ అయ్యే  అవకాశం ఉంది.